Gunde Ninda Gudi Gantalu January 17th Episode: మీనాకు బాలు ప్రేమ దక్కేనా? ప్రభావతి కుట్రకు తెరపడినట్లేనా?

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, ఘర్షణలు, అపార్థాలతో ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభమే మీనా-బాలు మధ్య జరిగిన ఘాటైన గొడవతో మొదలవుతుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన బాలు, ఇంటి బయటే మీనాతో గొడవకు దిగుతాడు. తన మాట వినకుండా గుడికి వెళ్లిందని మండిపడుతూ, మీనా చేసిన పనిని అవమానంగా భావిస్తాడు. అయితే మీనా మాత్రం తన తమ్ముడు శివపై ప్రేమతోనే తాను గుడికి వెళ్లానని, తండ్రి లేని పిల్లాడైన శివను వదిలేయలేనని చెప్పడంతో బాలు మరింత రెచ్చిపోతాడు.

"అంటే నాపై ప్రేమ లేదా?" అంటూ మీనా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటాడు బాలు. శివ చదువులో బాగా ముందుకు వెళ్తున్నాడని, తాను మాత్రం కేవలం డ్రైవర్ అనే కారణంతోనే ఇలా చేస్తున్నావా అని అనుమానాలు వ్యక్తం చేస్తాడు. మాటలు మితిమీరడంతో మీనా అతడిని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. భోజనం పెట్టాలని ప్రయత్నించినా బాలు తినకుండా అలాగే పడుకుంటాడు.

Gunde Ninda Gudi Gantalu January 17th Episode

ఈ గొడవను చూసిన ప్రభావతి మాత్రం లోపల లోపల ఆనందపడుతుంది. మీనా ఆమెను నిలదీస్తూ, "మీకు ఇప్పుడు తృప్తిగా ఉందా?" అని ప్రశ్నిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం మీరు ఇలా గొడవ పడుతుంటేనే తనకు సంతోషమని నేరుగా చెప్పేస్తుంది. కొడుకు తాగి వస్తే బాధపడే తల్లి కాకుండా సంతోషించే తల్లిని మిమ్మల్నే చూస్తున్నానని మీనా అన్నా కూడా ఆమె పట్టించుకోదు. "వాడు మారడు... రోజూ ఇలాగే గొడవ పడండి" అంటూ వ్యంగ్యంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరుసటి రోజు ఉదయం కథ మరో మలుపు తిరుగుతుంది. మీనా కాఫీ ఇవ్వబోతే బాలు తీసుకోకుండా "ఇక నుంచి నీ చేత్తో ఇచ్చేదేమీ తీసుకోను" అని స్పష్టంగా చెబుతాడు. దీంతో మీనా అతడికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కారు తాళాలు దాచిపెడుతుంది. బాలు తాళాల కోసం వెతుకుతుండగా సత్యం అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. రాత్రి తాగి వచ్చావా అంటూ బాలుని నిలదీస్తాడు. మీనాను కూడా అదే ప్రశ్న అడిగినా ఆమె మౌనం వహిస్తుంది. కానీ ప్రభావతి అసలు విషయం చెప్పడంతో సత్యం తీవ్రంగా ఆగ్రహిస్తాడు. తాగి వచ్చే అలవాటు మానుకోకపోతే బాగుండదని గట్టిగా హెచ్చరిస్తాడు.

అంతలో మీనా కారు తాళాలను తీసుకొచ్చి సత్యం ముందు పెడుతుంది. కిచెన్‌లోనే మర్చిపోయాడని చెప్పడంతో సత్యం మరింత కోప్పడతాడు. తర్వాత కిచెన్‌లో బాలు-మీనాల మధ్య మరోసారి గొడవ చెలరేగుతుంది. "నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నేను కిచెన్‌లోకి రాలేదే" అంటూ బాలు నిలదీస్తాడు. మాటామాటా పెరిగి మీనా కూడా తొలిసారి ధైర్యంగా ఎదురు తిరుగుతుంది. అందరూ బాగానే ఉన్నారని, మధ్యలో తనను ఎందుకు ఇలా వేధిస్తున్నారని ప్రశ్నిస్తుంది. పెళ్లయితే ఆడపిల్ల పూర్తిగా పుట్టింటిని మర్చిపోవాలా అంటూ బాలు మనసుకు గుచ్చే ప్రశ్న వేస్తుంది. దీనికి సమాధానం చెప్పలేక బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తరువాత మీనా మాటలు గుర్తు చేసుకుంటూ బాలు లోపల బాధపడుతుంటాడు. అదే సమయంలో పార్వతి, సుమతి అక్కడికి వస్తారు. అల్లుడి కోపాన్ని గుర్తించిన పార్వతి క్షమాపణ చెబుతుంది. అయితే శివ తప్పుదారి పడుతుంటే అతడి పుట్టినరోజులు జరపాల్సిన అవసరం ఏముందని బాలు ప్రశ్నిస్తాడు. పార్వతి మరోసారి క్షమాపణ చెప్పినా, "నాకు ట్రిప్ ఉంది" అంటూ బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో కథ మరింత భావోద్వేగంగా మారుతుంది. రోజు మొత్తం జరిగిన గొడవలు, అపార్థాల తర్వాత బాలు, మీనా ఇద్దరూ లోపల లోపల తీవ్రంగా బాధపడతారు. బాలు తన స్నేహితుడు రాజేష్ దగ్గర తన మనసులో ఉన్న బాధను బయటపెడతాడు. మీనా తనను అర్థం చేసుకోవడం లేదని, అయినా ఆమెను బాధపెట్టినందుకు మనసు కలవరపడుతోందని చెప్పుకుంటాడు. కోపం ఎక్కువై మాటలు దాటిపోయాయని అతనికీ అర్థమవుతుంది. అయితే తన అహంకారం, తన మాటను ఎవ్వరూ దాటకూడదన్న భావన అతడిని ఇంకా వెనక్కి తగ్గుతాడు.

ఇటు మీనా మాత్రం పూలు అల్లుకుంటూ అక్కడి మహిళలతో తన బాధను పంచుకుంటుంది. తాను చేసిన పని తప్పేనేమోనన్న సందేహం ఒకవైపు, తన ప్రేమను అర్థం చేసుకోని బాలు తీరు మరోవైపు ఆమెను కలిచివేస్తాయి. కన్నీళ్లతో తన మనసులోని బాధను బయటపెడుతూ, పెళ్లయిన తర్వాత కూడా పుట్టింటి వాళ్లపై ప్రేమ చూపించడం తప్పేనా అని ప్రశ్నిస్తుంది. తన ప్రతి మాటను అపార్థంగా తీసుకుని బాలు ఇలా ప్రవర్తించడం తనకు ఎంత బాధ కలిగిస్తోందో చెప్పి వాపోతుంది.

ఇద్దరి మాటలు విన్న స్నేహితులు మాత్రం పరిస్థితిని శాంతింపజేయాలని ప్రయత్నిస్తారు. "అనవసరంగా గొడవను ఇంకా పెద్దది చేయొద్దు" అంటూ.. ఈ పరిస్థితిలో ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సిందేనని, అర్థం చేసుకునే మనసుతో క్షమాపణ చెప్పితేనే సమస్య తగ్గుతుందని సూచిస్తారు. ముఖ్యంగా మీనాకు, బాలు మనసు మారాలంటే ముందుగా నువ్వే అడుగు వేయాలని సలహా ఇస్తారు. కోపంతో కాదు, ప్రేమతో అతడిని దగ్గరకు తీసుకురావాలని చెబుతారు.

అంతేకాదు, బాలు ఇష్టపడేలా ఒక మంచి వంటకం చేసి, అతడి మనసును కరిగించే ప్రయత్నం చేయమని మీనాకు సూచిస్తారు. ప్రేమ మాటలకంటే పనుల్లో చూపితేనే బాలు మారే అవకాశం ఉందని వివరంగా చెబుతారు. ఈ మాటలు మీనాకు కొంత ధైర్యం ఇస్తాయి. పరిస్థితిని మరింత చెడగొట్టకుండా, సంబంధాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఆమె మనసులో బలపడుతుంది.

ఇదే సమయంలో బాలు కూడా మీనాకు ఓ చిన్న సర్‌ప్రైజ్ తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మీనా మరోవైపు గుమగుమలాడే వంట చేసి బాలు కోసం ఎదురుచూస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూనే, అహంకారం, అపార్థాల మధ్య ఇరుక్కున్నారని ఈ సన్నివేశాలు స్పష్టంగా చూపిస్తాయి. ఈ సంఘటనల తర్వాత కథ ఎటు మలుపు తిరుగుతుందో, బాలు నిజంగా మారుతాడా లేదా అన్న ఉత్కంఠతో వచ్చే ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X