Gundeninda Gudigantalu january 24th Episode: మీనాకు ఘోర అవమానం.. పట్టు వదలని బాలు..

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కథ ఈసారి పూర్తిగా రోహిణి చుట్టూ తిరుగుతూ, ఆమె అల్లుకున్న అబద్ధాల వల మరింత బిగుసుకున్నట్టు కనిపించింది. రోహిణి విషయం సత్యానికి తెలిసిన క్షణం నుంచే కథ కీలక మలుపు తిరిగింది. సత్యం నేరుగా ప్రభావతిని ప్రశ్నించడం ద్వారా ఇంట్లో దాగి ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలినట్టు అయింది. 'కోడలు గర్భం దాల్చడం సంతోషమే కానీ... అది రెండోసారి అయితే ఆలోచించాల్సిందే' అంటూ సత్యం అడిగిన ప్రశ్న ప్రభావతిని షాక్‌కు గురి చేసింది. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినా, సత్యం అనుమానం మరింత పెరిగింది. 'రోహిణి మీద నీకు ప్రత్యేక అభిమానం ఉంది' అంటూ ప్రభావతిని నిలదీయడం, ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై కూడా సందేహం కలిగించింది.

దీంతో ప్రభావతి తనపై అనుమానమా అంటూ కుదిపేసి, తన క్యారెక్టర్ నిరూపించుకోవాలనే ఆవేశంతో మనోజ్ గదికి వెళ్లి రోహిణిని గట్టిగా నిలదీసింది. ఈ దశ నుంచే రోహిణి గుండెల్లో గుబులు మొదలైంది. కింద హాల్లో కుటుంబ సభ్యులంతా ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభావతి ప్రశ్నల వర్షం కురిపిస్తూ,'నీ గతమేంటి? ఎవరు నువ్వు?' అంటూ రోహిణిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సత్యం శాంతించమని చెప్పినా, ప్రభావతి వినలేదు. 'ఈ ఇంటికే కళంకం తెస్తావని అనుకోలేదు' అంటూ ఆమె ఆగ్రహం ఇంటి వాతావరణాన్ని విషపూరితంగా మార్చింది. మనోజ్ అడ్డుపడినా, అతడినీ హెచ్చరించడం ప్రభావతి ఆగ్రహం స్థాయిని చూపించింది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 605 january 24th 2026 here is full story

Courtesy: jiohotstar

'నువ్వు ఎప్పుడు బిడ్డను కన్నావు? ఎవరి వల్ల గర్భం వచ్చింది? నీ తల్లిదండ్రులు ఎక్కడ?' అంటూ ప్రభావతి వేసిన ప్రశ్నలు రోహిణిని మాటలేకుండా చేశాయి. 'నీ బతుకే రహస్యాల పుట్టలా ఉంది' అన్న మాట రోహిణి మౌనాన్ని మరింత లోతుగా చేసింది. ఆమె ఏం చెప్పాలో అర్థం కాక తల వంచుకోవడం, ప్రభావతిని మరింత రెచ్చగొట్టింది. 'ఇది అందరి ముందు తెలుసుకోవాల్సిన విషయమే' అంటూ ప్రభావతి తేల్చి చెప్పడం, ఈ ఎపిసోడ్‌లో ఆమె పాత్రను కఠినంగా చూపించింది. రోహిణి హాస్పిటల్‌కు వెళ్లిందన్న మాటతో పరిస్థితి మరింత ముదిరింది. 'రెండోసారి బిడ్డను కనడానికి చెకప్ చేయించుకున్నావా?' అన్న ప్రశ్నతో కథ ఉత్కంఠ తార స్థాయికి చేరింది.

ఈ సమయంలో సత్యం జోక్యం చేసుకుని, వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడటం సరికాదని చెప్పినా, ప్రభావతి వినలేదు. ఇక్కడే రోహిణి తన కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. సోఫాలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనల్లో పడింది. ఈ ఏడుపు మనోజ్‌లో కూడా అనుమానం కలిగించడం కథకు మరో మలుపు. 'నా గతం బయటపడబోతోందా?' అన్న భయంతో తల్లడిల్లిన రోహిణి, చివరకు సంచలన ప్రకటన చేసింది. 'నేను మొదటిసారి గర్భవతి అయ్యాను' అన్న మాటతో ఇంట్లో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే ఇది నిజమా లేక మరో అబద్ధమా అన్న సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. 'అది మనోజ్‌తో పెళ్లి అయిన తర్వాతే'అంటూ చెప్పి, వెంటనే 'ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది' అని మరో కథ అల్లుతుంది.

ఈ మొత్తం వ్యవహారం చివరకు మీనా మీదికి మళ్లింది. మాట ఒకరి నుంచి ఒకరికి వెళ్లి, అసలు విషయం బయటపెట్టింది మీనానే అన్న అభిప్రాయం ఏర్పడటంతో, ఆమె అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. ప్రభావతి మీనాపై విరుచుకుపడటం, చేయి చేసుకునే వరకు వెళ్లడం, రోహిణికి మరో అవకాశంగా మారింది. మీనాపై విషం చిమ్ముతూ, తాను బాధితురాలినన్నట్టు నటించడం రోహిణి పాత్రను మరింత నెగటివ్‌గా తీర్చిదిద్దింది. నేటీ ఎపిసోడ్ మీనా నిజం కన్నా రోహిణి నాటకమే పైచేయి సాధించినట్టు కనిపించింది.

ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో మొదలైన మీనా-రోహిణి మధ్య ఘర్షణ, ఈ రోజు మరింత లోతుగా సాగింది. వంటగదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, 'నేను ఏం తప్పు చేశాను? తెలిసిన నిజం చెప్పినా నన్నే ఎందుకు నిందిస్తున్నారు?' అంటూ మీనా తనలో తానే కుమిలిపోతుంది. నిజాయితీగా మాట్లాడినందుకు తాను శిక్ష అనుభవిస్తున్నానన్న భావన ఆమెను తీవ్రంగా కలచివేస్తుంది. ఈ సమయంలో బాలు మీనాకు అండగా నిలవడం ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

మీనాను ఓదారుస్తూ, ఆమె తప్పు ఏమీ లేదని ధైర్యం చెబుతాడు. రోహిణి చెప్పిన మాటల్లో చాలా చోట్ల తేడా ఉందని, ఆమె ఆడుతున్నదని బాలు గ్రహిస్తాడు. 'ఈ ఇంట్లో ఏ రహస్యం ఎక్కువ రోజులు దాగదు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. నువ్వు భయపడకు' అంటూ బాలు మీనాకు భరోసా ఇస్తాడు. ఇక నుంచి రోహిణి ప్రతి అడుగును గమనిస్తానని, ఆమె అసలు బాగోతాన్ని బయటపెడతానని చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగినట్టైంది. బాలు మాటలు మీనాకు కొంత ఊరటనిస్తే, అదే సమయంలో ఆ సంభాషణను చాటుగా వింటున్న రోహిణి భయంతో వణికిపోతుంది.

ఇప్పటివరకు కన్నీళ్లు, నాటకాలతో తప్పించుకుంటూ వచ్చిన ఆమెకు, బాలు అనుమానం కలగడం గట్టి షాక్‌గా మారుతుంది. తన అబద్ధాల వెనుక దాగిన నిజం బయటపడుతుందేమోనన్న ఆందోళన రోహిణి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. బాలు పాత్ర మరింత బలంగా, న్యాయానికి నిలబడే వ్యక్తిగా రూపుదిద్దుకుంది. రోహిణి కథ నిజమా? మీనా తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది? బాలు నిగ్గు తేల్చే రోజు ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలతో, రాబోయే ఎపిసోడ్లపై ఉత్కంఠను పెంచుతూ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X