Gundeninda Gudigantalu February 14th Episode: మీనా తలకి గాయం.. గుణని చితక్కొట్టిన బాలు..
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ లో బాలు మనసులో మాత్రం భీకరమైన తుఫాను రేగుతోంది. ఫంక్షన్‌లో ఎదురైన అవమానం ఇంకా మంటలాగా మండుతుండగా, మళ్లీ మద్యం గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఈసారి అతని ఎదురుగా ఎవ్వరూ లేరు... అతని అంతరాత్మే నిలబడి ప్రశ్నించింది. 'మీనా మాట వినకుండా స్నేహితులకు అప్పులు ఇచ్చి నువ్వే అప్పుల పాలయ్యావు... ఇంకా కళ్లుతెరవవా?' అని అంతరాత్మ హెచ్చరించగా, బాలు మాత్రం మొండిగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. 'కష్టంలో ఉన్న స్నేహితుడికి సాయం చేయడం తప్పా?'అంటూ తన మనసుకు తానే సర్ది చెప్పుకున్నాడు.
అంతరాత్మ మీనాకు సారీ చెప్పమని సూచించగానే, బాలు ఆవేశంతో మద్యం సీసాతో తన ప్రతిబింబానికే దాడి చేశాడు. సీసా విరిగిపోవడంతో మందు మొత్తం నేలపై కారిపోతుంది. అదే క్షణంలో 'నేను ఏం చేస్తున్నాను? నా జీవితం ఎటు వెళ్తోంది?' అనే ప్రశ్న మొదటిసారి అతని మనసులో మెదిలింది. ఇక మరుసటి రోజు ఉదయం రాజేష్ బాలు ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్నటి ఆర్భాటం ఏమాత్రం లేకుండా, పూర్తిగా పశ్చాత్తాపంతో కనిపించాడు. బాలు, మీనాల ముందు తలదించుకుని క్షమాపణ చెప్పాడు.

ఫంక్షన్ కోసం డబ్బు వృథా చేశానని, వచ్చిన బంధువులు తిని తాగి చివరకు నిందలు వేసారని వాపోయాడు. మీనా ముందే హెచ్చరించినా వినలేదని ఒప్పుకున్నాడు. అంతేకాదు, కట్నంగా వచ్చిన డబ్బును బాలు చేతిలో పెట్టి... 'ముందు నీ అప్పు తీర్చుకో. అప్పు ఎంత త్వరగా తీరితే అంత మంచిది... లేదంటే వడ్డీ రూపంలో మనల్ని మింగేస్తుంది'అంటూ హితవు పలికాడు.
రాజేష్ వెళ్లిన తర్వాత బాలు తన స్టైల్లో మీనాతో, 'చూశావా... స్నేహితులకు సాయం చేస్తే డబ్బు తిరిగి వస్తుంది' అంటూ బిల్డప్ ఇచ్చాడు. తన మాటలతో ఇంకా గొప్పలు చెప్పే ప్రయత్నం చేయగా, మీనా మాత్రం వెటకారంగా స్పందించింది. 'స్కూల్లో పాఠాలు నేర్చుకోలేదు కదా... అందుకే ఇప్పుడు ఇలా గుణపాఠాలు నేర్చుకుంటున్నారు'అంటూ చురక వేసింది. చివరకు సూటిగా చెప్పేసింది 'నిజమైన స్నేహం అంటే అప్పులు చేసి ఆదుకోవడం కాదు... అప్పులే రాకుండా జాగ్రత్తగా చూసుకోవడమే.' ఈ మాటలతో బాలు నోరు మూసుకున్నాడు.
మరోవైపు రవి పనిచేసే రెస్టారెంట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ కొత్త అమ్మాయి అహంకారంగా ఎంట్రీ ఇచ్చి, 'నేనే కొత్త ఇన్‌చార్జ్... నీ ఉద్యోగం పోయింది'అంటూ రవికి షాక్ ఇచ్చింది. రవీ వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లగా, ఆమె తన కూతురేనని, ఇకపై హోటల్ బాధ్యతలు ఆమెదేనని వెల్లడించాడు. అయితే రవి టాలెంట్ చూసి, కొత్త బాస్ 'నీ ఉద్యోగం ఎక్కడికీ పోదు... ఇకపై నిన్ను బేబీ అని పిలుస్తాను' అనడంతో రవి కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అదే సమయంలో శృతి ఎంట్రీ ఇచ్చి రవిని గట్టిగా హగ్ చేసి 'హలో బేబీ' అంటూ షాక్ ఇచ్చింది. 'మాది లవ్ మ్యారేజ్... మా మధ్య ఎవరూ రాలేరు'అంటూ ఇచ్చిన వార్నింగ్, రాబోయే రోజుల్లో రవి-శృతి మధ్య గొడవలకు బీజం వేసినట్టే కనిపిస్తోంది.
అటు మీనా పుట్టింట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శివ రోజు రోజుకీ చెడు సహవాసాలకు బానిస అవుతున్నాడు. అర్థరాత్రులు ఇంటికి రావడం, మద్యం మత్తులో గొడవలు చేయడం మొదలుపెట్టాడు. తల్లి పార్వతి, అక్క సుమతి ఎంత చెప్పినా వినకుండా ఎదురు తిరుగుతున్నాడు. మరుసటి రోజు పార్వతి కన్నీళ్లతో మీనాకు ఫోన్ చేసి, 'నీ తమ్ముడు పూర్తిగా చెడు మార్గంలో పడిపోయాడు... వాడిని కాపాడుకో' అంటూ వేడుకుంది. దీంతో ఎపిసోడ్ భావోద్వేగంగా ముగిసింది.
రాబోయే ఎపిసోడ్‌లో గుండె నిండా గుడి గంటలు కథ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్‌కు చేరనుంది. మీనా పుట్టింట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మీనా తమ్ముడు శివ చెడు సావాసాలకు బానిస అవుతున్న తీరు కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గుణతో కలిసి మద్యం పార్టీలకు వెళ్లి అర్థరాత్రులు ఇంటికి వస్తున్న శివను చూసి తల్లి పార్వతి, సుమతి బాధతో కుమిలిపోతారు.వారు ఎంత చెప్పినా వినకుండా ఎదురు తిరుగుతున్నాడు. తాగి వచ్చిన శివను నిలదీస్తే... 'నేనేమైనా మీ అల్లుడిలా తాగుబోతునా?' అంటూ ఎదురు మాట్లాడడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతుంది.
మరుసటి రోజు మీనా పుట్టింటికి రావడంతో అసలు విషయం బయటపడుతుంది. శివ ప్రవర్తన రోజు రోజుకీ దిగజారుతోందని, చదువు వైపు కూడా ఆసక్తి చూపించడం లేదని పార్వతి కన్నీళ్లతో చెప్పుకొస్తుంది. మొదట ఉద్యోగంలో చేరితే మారుతాడని మీనా ఆశపడినా... గ్రూప్ స్టడీ పేరుతో గుణతో కలిసి తాగుతున్నాడన్న నిజం తెలిసి మీనా ఆగ్రహంతో రగిలిపోతుంది.
కోపంగా గుణ దగ్గరకు వెళ్లిన మీనా... 'నా తమ్ముడికి దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను?'అంటూ నిలదీస్తుంది. మాటా మాటా పెరిగి గుణ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో మీనా అతడిపై చేయి చేసుకుంటుంది. దీంతో గుణ ప్రతిగా మీనాను లాగి కొట్టడంతో ఆమె తలకు గాయం అవుతుంది. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న బాలు.. తన భార్యపై చేయి చేసుకున్న గుణపై విరుచుకుపడతాడు. గుణను ఉతికి ఆరేసినట్టు బాలు చేసే దాడి రానున్న ఎపిసోడ్లలో పెద్ద డ్రామాకు దారితీయబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ పరిణామాలతో శివ జీవితంలో మార్పు వస్తుందా? గుణ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? బాలు-మీనా మధ్య బంధం మరింత బలపడుతుందా? అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతోంది.మొత్తానికి రానున్న ఎపిసోడ్లు ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాతో మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.


Click it and Unblock the Notifications











