Gundeninda Gudigantalu February 21th Episode: ప్రభావతికి మూడిందిగా.. డేంజర్‌లో మౌనిక,శృతి కాపురాలు

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే శృతి తల్లి శోభన డబ్బింగ్ స్టూడియోకు వచ్చి రవి-నీతు వ్యవహారంపై తన కూతురికి సూచనలు చేస్తుంది. నీతు ప్రవర్తన కాస్త భిన్నంగా ఉందని, అనవసర అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. అయితే శృతి మాత్రం రవిపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేస్తూ, "రవి అలాంటి వ్యక్తి కాదు... నీతుతో షాపింగ్‌కు వెళ్తున్నట్టు ముందే చెప్పాడు" అంటూ తల్లిని కూల్ చేస్తుంది. అంతేకాదు, గతాన్ని ప్రస్తావిస్తూ "నువ్వూ ఒకసారి వేరే వ్యక్తితో షాపింగ్‌కు వెళ్లావు కదా... అప్పుడు మేమేమైనా అనుమానించామా?" అంటూ కౌంటర్ ఇస్తుంది. ఈ మాటలతో శోభన ఒక్కసారిగా కంగుతింటుంది. ఇకపై ఇలాంటి విషయాలు తీసుకురావద్దని శృతి గట్టిగా చెప్పడంతో, ఈ తల్లి-కూతురు ఘట్టం ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది.

మీనా బొమ్మల కొలువు ఆలోచన
ఇక ఇంట్లో మీనా బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచనతో ఉత్సాహంగా కనిపిస్తుంది. వంటగదిలో పని చేస్తుండగా వెనుక నుంచి బాలు సరదాగా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారిగా అప్రమత్తమైన మీనా చేతిలో ఉన్న కత్తితో దాడి చేయబోతుంది. బాలు ఉలిక్కిపడతాడు. తర్వాత పరిస్థితి చల్లారాక మీనా సారీ చెబుతుంది. ఇంట్లో శుభం జరగాలన్న ఉద్దేశంతో, వారసుడు రావాలని కోరుకుంటూ బొమ్మల కొలువు పెట్టాలనుకుంటున్నట్టు బాలుకి చెబుతుంది. అత్త ప్రభావతి పర్మిషన్ అవసరం అని భావించి ఇద్దరూ కలిసి సత్యం దగ్గరకు వెళ్తారు. సత్యం చాకచక్యంగా ప్రభావతిని ఒప్పించేందుకు మాటలు తిప్పుతాడు. మొదట "ఇది గొప్పింటి వాళ్ల పండుగ... మనకెందుకు?" అంటూ తిరస్కరించిన ప్రభావతి, "నీ గొంతు గాన కోకిలలా ఉంటుంది... నువ్వే పాటలు పాడాలి" అన్న పొగడ్తలతో ఇంప్రెస్ అయి చివరకు పర్మిషన్ ఇస్తుంది. ఇలా సత్యం మస్కా కొట్టి మీనా కోరిక తీరేలా చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 625 February 21th 2026 here is full story

డాన్స్ స్కూల్‌లో ప్రభావతి ఆవేదన
డాన్స్ స్కూల్‌కు వెళ్లిన ప్రభావతి తన స్నేహితురాలు మీనాక్షితో బొమ్మల కొలువు విషయం పంచుకుంటుంది. "ఉన్న ఇల్లే చిన్నది... అందులో మీనా బొమ్మల కొలువు అంటోంది" అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. కానీ మీనాక్షి మాత్రం "బొమ్మల కొలువు పెడితే ఇంట్లో శుభం జరుగుతుంది, కీడు పోతుంది, సంతానం కోరుకునేవాళ్లు చేస్తారు" అంటూ వేరే కోణంలో అర్థం చెబుతుంది. రోజూ పూజలు, పాటలు, పిండి వంటలు ఉంటాయని చెప్పడంతో ప్రభావతి గర్వంగా "మా సత్యం నన్నే పాటలు పాడమంటున్నాడు" అంటూ ఆనందపడుతుంది.

ప్రేమ జంట రొమాన్స్... మీనా ఎంట్రీతో షాక్
అదే సమయంలో డాన్స్ స్కూల్‌లోని ఓ రూమ్‌లో ప్రేమ జంట రొమాన్స్‌లో మునిగిపోతుంటారు. అనూహ్యంగా మీనా భోజనం తీసుకుని అక్కడికి రావడంతో వారిని చూసి షాక్ అవుతుంది. "ఇది డాన్స్ స్కూల్... ఇలాంటి పనుల కోసం వచ్చారా?" అంటూ క్లాస్ పీకుతుంది. భయపడ్డ ఆ జంట ముందే ప్లాన్ ప్రకారం ప్రభావతి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ నటిస్తూ, "మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీనా అపార్థం చేసుకుని తిట్టింది" అంటూ అబద్ధం చెబుతారు. నిజం తెలుసుకోకుండా ప్రభావతి మీనాపై మండిపడుతుంది. దీంతో బాధపడిన మీనా "ఇది మీ మెడకు ఉచ్చు లా మారుతుంది" అంటూ హెచ్చరించి వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న మీనాక్షి మాత్రం ప్రభావతి వ్యవహారాన్ని తప్పుపడుతుంది.

ఖర్చు గొడవలు... అన్నదమ్ముల మధ్య టెన్షన్
బొమ్మల కొలువు పేరుతో ఇంట్లో కొత్త సందడి మొదలవుతుంది. బాలు బొమ్మలు తెచ్చి హాల్లో సర్దుతాడు. మనోజ్ ఎంట్రీ ఇచ్చి ప్రశ్నించగా బాలు సెటైర్ వేయడంతో అవమానంగా ఫీలై వెళ్లిపోతాడు. రోహిణి అసూయతో "మీ అమ్మ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చింది?" అంటూ రెచ్చగొడుతుంది. ఖర్చు విషయాన్ని లేపిన మనోజ్ "ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు" అంటాడు. ఇదే సమయంలో సత్యం తన తల్లి సుశీలమ్మకు ఫోన్ చేస్తాడు. ఆమె "ఇంట్లో నలుగురికి పెళ్లై ఏడాది అవుతోంది... హోమం కూడా చేయాలి, మౌనిక-సంజును కూడా కూర్చోబెట్టండి" అంటూ సూచిస్తుంది. దీంతో కార్యక్రమం మరింత గ్రాండ్‌గా మారుతుంది. మొత్తం ఖర్చు రూ.15,000 అని, ప్రతి ఒక్కరి వాటా రూ.5,000 అని బాలు నిర్ణయిస్తాడు. మనోజ్ ఇవ్వనన్నా, రోహిణి పరువు కోసం తనవంతు ఇస్తుంది. శృతి వెంటనే తన రూ.2,500 ఇస్తూ, మిగతావి రవి ఇస్తాడని చెబుతుంది. అందరినీ సమానంగా చూసినందుకు బాలు వారిని మెచ్చుకుంటాడు.

తోడికోడళ్ల డ్రామా... ప్రభావతి లోపలి ఆనందం
బొమ్మలు సర్దుతున్న సమయంలో రవి-శృతి ఇంప్రెస్ అవుతారు. సత్యం ఇన్‌డైరెక్ట్‌గా పిల్లలకు బుద్ధి చెప్పడంతో, రెండు జంటలు చిన్నపాటి మాటల యుద్ధంలో పడతాయి. ఈ దృశ్యం చూసిన ప్రభావతి మాత్రం "ఇంకా తోడికోడళ్లు కలవలేదు" అంటూ లోలోపల సంతోషిస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో బొమ్మల కొలువు పేరుతో ఇంట్లో కొత్త ఉత్సాహం మొదలైనా, అదే సమయంలో అసూయ, అపార్థాలు, ఖర్చు గొడవలు కూడా తలెత్తాయి. ఇక ముందు సుశీలమ్మ సూచించిన హోమంలో మౌనిక-సంజు పాల్గొంటారా? ప్రేమ జంట అబద్ధం బయటపడుతుందా? బొమ్మల కొలువు నిజంగా శుభం తెస్తుందా? లేక కొత్త కలహాలకు కారణమవుతుందా? అన్నది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X