Gundeninda Gudigantalu March 21th Episode: బాలుపై మనోజ్ దాడి.. సత్యం ఆగ్రహం..50 లక్షల డిమాండ్!

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారంలో ఎపిసోడ్ లో చాలా ఫన్నీగా సాగింది. పార్టీ నుంచి మద్యం తాగి ఇంటికి వచ్చిన మనోజ్, రవి, బాలు ముగ్గురూ మత్తులో తూలుతూ గేటు దగ్గరకి చేరుతారు. వారిని చూసిన ప్రభావతి కంగారుపడి పరుగెత్తుకుంటూ వస్తుంది. అయితే మత్తులో ఉన్న రవి తన తల్లినే గుర్తుపట్టకుండా 'ఈ ఆంటీ ఎవరు?' అని అడగడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. దీనికితోడు మనోజ్ కూడా మరింతగా రెచ్చిపోతూ అనవసరమైన మాటలు మాట్లాడడంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ దృశ్యం సత్యాన్ని తీవ్రంగా ఆగ్రహానికి గురిచేస్తుంది.

సత్యం కోపంతో ఆగ్రహించి, 'కన్నతల్లినే ఆంటీ అంటారా?' అంటూ మండిపడతాడు. వెంటనే వారిని ఇంట్లోకి రానివ్వొద్దని ఆదేశించి, తలుపులు వేసేయమని మీనాకు చెప్పేస్తాడు. ప్రభావతి ఎంత వేడుకున్నా, సత్యం తన నిర్ణయాన్ని మార్చుకోడు. తన కొడుకుల మీద చూపిన ఈ కఠిన వైఖరి కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతుంది. చివరికి కోడళ్లు కూడా ఏమీ చేయలేక భర్తలను బయటే వదిలి లోపలికి వెళ్లాల్సి వస్తుంది. బయట చలిలో పడుకున్న ముగ్గురు కొడుకుల పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తుంది. మీనాకు వారిని అలా చూడలేక కనీసం దుప్పటి, చాప ఇవ్వమని అడిగినా, సత్యం కోపంతో వాటిని బయటికి విసిరేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 645 March 21th 2026 here is full story

మత్తులో ఉన్న ముగ్గురు విచిత్రంగా ప్రవర్తిస్తూ, దుప్పటిని కింద వేసుకుని, చాపను కప్పుకుని నిద్రపోవడం కొంచెం హాస్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇక కొంతసేపటికి బాలుకు మత్తు దిగడంతో పరిస్థితి మారుతుంది. అతను తన తప్పును గ్రహించి మీనాతో మాట్లాడుతాడు. 'నాన్న గౌరవం తీసేశాను' అంటూ పశ్చాత్తాపంతో మాట్లాడిన బాలులోని నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడం ఈ ఎపిసోడ్‌కు భావోద్వేగ టచ్‌ను తీసుకొస్తుంది. మీనా కూడా అతనికి ధైర్యం చెబుతూ, కుటుంబంలో బాలు పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

ఇక మరో వైపు రోహిణి ట్రాక్ కథలో ఉత్కంఠను పెంచుతుంది. బాలు ఫోన్‌లో ఉన్న శివ దొంగతనం వీడియోను షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ఫోన్ మనోజ్ కోటులో ఉండటంతో, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినా మీనా మేల్కొని ఉండటం వల్ల సాధ్యం కాకపోతుంది. ఇదే సమయంలో దివ్య ఫోన్ చేసి ఆ వీడియో గురించి ఒత్తిడి చేయడం, రోహిణి టెన్షన్‌ను మరింత పెంచుతుంది. ఈ సన్నివేశాలు కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ను తీసుకొస్తాయి.

తెల్లవారిన తర్వాత పరిస్థితి మళ్లీ మారుతుంది. ముగ్గురు కొడుకులు బయట పడుకుని ఉండగా, ఇంట్లో అందరూ చూసి షాక్ అవుతారు. సత్యం వారిని లేపి గట్టిగా క్లాస్ తీసుకుంటాడు. రవి, బాలు తమ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పగా, మనోజ్ మాత్రం తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. అతను చెప్పిన రూ.50 లక్షల డీల్ విషయంతో కథకు కొత్త మలుపు వస్తుంది. మద్యం తాగడం వల్లే ఆ డీల్ కుదిరిందని చెప్పడం కుటుంబ సభ్యులను కాసేపు ఆశ్చర్యపరుస్తుంది. కానీ వెంటనే మనోజ్‌కు ఏదో అనుమానం వచ్చి, బాలు మత్తులో ఏం మాట్లాడాడో అడుగుతాడు. రవిని నిలదీయడం మొదలుపెడతాడు.

ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో బాలు ఏమీ దాచకుండా జరిగిన విషయం మొత్తం బయటపెడతాడు. తాము పెద్ద వ్యాపారవేత్తలుగా నటిస్తూ అబద్ధాలు చెప్పామని, తనకు 40 కార్లు ఉన్నాయని, మీనాకు బొకే షాప్ లేదనీ, పార్లరమ్మకు ఏజెన్సీలు లేవనీ, అలాగే ఉన్నాయని, రవికి ఫైవ్ స్టార్ హోటల్స్ లేవని చెప్పాననీ అంటాడు. ఈ సమయంలో రవి కూడా అదే విషయాన్ని సమర్థిస్తూ, 'నువ్వు వేసిన నాటకం మొత్తం అన్నయ్య చెప్పేశాడు' అని చెప్పడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.

ఈ విషయం విన్న సత్యం తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. కుటుంబాన్ని ఫ్రాడ్‌లోకి దించేశావా అంటూ మనోజ్‌ను గట్టిగా ప్రశ్నిస్తాడు. ఇదే సమయంలో మనోజ్ తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక బాలు కాలర్ పట్టుకుని, 'నా చేతికి వచ్చిన అవకాశం పోయింది... నన్ను పూర్తిగా ముంచేశావ్' అంటూ ఆవేశంతో మాట్లాడతాడు. అయితే అసలు షాక్ అప్పుడే బయటపడుతుంది. ఈ డీల్‌లో ఫ్రాడ్ బయటపడితే తాను 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని మనోజ్ వెల్లడించడంతో ఇంట్లో అందరూ షాక్‌కు గురవుతారు.

ఇక్కడితో కథ ముగియకుండా, పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. డీలర్ ముఖేష్ నేరుగా ఇంటికే వచ్చి గొడవకు దిగుతాడు. 'అబద్ధాలు చెప్పిన ఫ్రాడ్ ఎక్కడ?' అంటూ కోపంగా అడగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తుంది. మనోజ్ మాత్రం ఏమీ తెలియనట్టుగా ముందుకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. తాను జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పినా, ముఖేష్ ఆగ్రహం తగ్గదు.

ఈ సమయంలో ప్రభావతి జోక్యం చేసుకుని తన కొడుకును క్షమించమని, డీల్ కొనసాగించమని వేడుకుంటుంది. కానీ ముఖేష్ మాత్రం కఠినంగా స్పందిస్తూ, డీలర్‌షిప్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, అగ్రిమెంట్ ప్రకారం 50 లక్షలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తాడు. దీంతో మనోజ్ పూర్తిగా ఆందోళనలో పడిపోతాడు.

ఇదే సమయంలో బాలు ముందుకు వచ్చి పరిస్థితిని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు. 'ఇంత పెద్ద మొత్తం కట్టే స్థితి అతనికి లేదు, కుటుంబ పరిస్థితులు కూడా బాగోలేవు' అంటూ ముఖేష్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అయితే ముఖేష్ మాత్రం తాను తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, డబ్బు చెల్లించకపోతే కోర్టుకు వెళ్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.

ఈ పరిణామాలతో ఇంట్లో పరిస్థితి మరింత విషమంగా మారనుంది. సత్యం ఈ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు? మనోజ్ నిజంగా ఆ 50 లక్షలు ఎలా చెల్లిస్తాడు? బాలు సమస్యను సర్దిచెప్పగలడా? లేక ఈ గొడవ కారణంగా కుటుంబంలో విభేదాలు మరింత పెరుగుతాయా? ఇదిలా ఉండగా, మరోవైపు రోహిణి ప్లాన్ కూడా కథకు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఒక శివ దొంగతనం వీడియో బయటకు వస్తే.. ప్రభావతి ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ సిరీయల్స్ ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X