Gundeninda Gudigantalu April 4th Episode: మీనా కొత్త వ్యాపారం, ప్రభావతి గుట్టురట్టు, చిక్కుల్లో రోహిణి,

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ప్రభావతి కేసు వెనక్కి తీసుకున్న విషయం అసలు కారణం తెలియకుండానే సత్యం, బాలు, మీనాలు ఆమెను పొగుడుకోవడం కథకు కీలక మలుపు ఇచ్చింది. శివ జైలు సమస్య నుంచి బయటపడిన తర్వాత, బాలు అతడిని రాజేష్ ఇంటి నుంచి తన అత్తగారి ఇంటికి తీసుకువస్తాడు. మీనా కూడా అతడితో పాటు వస్తుంది. శివను చూసిన వెంటనే పార్వతమ్మ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన తప్పును గ్రహించిన శివ, తల్లి కాళ్లపై పడుతూ క్షమాపణలు కోరుతాడు. అయితే పార్వతమ్మ మాత్రం "నాకు కాదు, నీ బావకి చెప్పు.. నిన్ను బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు" అంటూ బాలను ప్రశంసిస్తుంది.

Also Read
నీ సైజు ఎంతో చెప్పు.. నెటిజన్‌కు స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై
నీ సైజు ఎంతో చెప్పు.. నెటిజన్‌కు స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై

దాంతో శివ, బాలు దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. బాలు కూడా ప్రేమగా "ఇకనైనా మారి చదువు మీద దృష్టి పెట్టు, కుటుంబానికి అండగా నిలువు" అంటూ సలహా ఇస్తాడు. ఈ సీన్ మొత్తం కుటుంబ భావోద్వేగాలను హైలైట్ చేసింది. ఇదే సమయంలో పార్వతమ్మ, ప్రభావతి పెద్దమనసుతో కేసు వెనక్కి తీసుకున్నందుకు క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకుని అందరూ కలిసి ఆమెను కలవడానికి బయలుదేరుతారు. ఇక ప్రభావతి వైపు చూస్తే, ఆమె మనసులో మాత్రం కలత కొనసాగుతుంది. "నా లేక ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో? వాళ్లు నన్ను తీసుకెళ్లడానికి ఎందుకు రాలేదు?" అంటూ తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సమయంలో బాలు, మీనా, పార్వతమ్మ కుటుంబం వచ్చి తలుపు తట్టడంతో కామాక్షి వారిని ఆహ్వానిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం వారిని చూసి ముఖం తిప్పేసుకుంటుంది.

Recommended For You
6 గురు లవర్స్‌తో 6 సార్లు మోసపోయా.. నా లైఫ్‌తో సిగ్గులేకుండా.. శృతిహాసన్ ఎమోషనల్
6 గురు లవర్స్‌తో 6 సార్లు మోసపోయా.. నా లైఫ్‌తో సిగ్గులేకుండా.. శృతిహాసన్ ఎమోషనల్
Gunde Ninda Gudi Gantalu serial Expected episode 655 April 4th 2026 here is full story

పార్వతమ్మ వినమ్రంగా క్షమాపణలు చెబుతూ, శివ చేసిన తప్పుకు బాధపడుతుంది. మీనా, సుమతి కూడా ధన్యవాదాలు చెబుతారు. చివరికి శివ కూడా ప్రభావతి కాళ్లపై పడుతూ క్షమించమని అడుగుతాడు. అయితే శివను చూసిన వెంటనే ప్రభావతికి అతడు వేట కత్తితో వెంటాడిన సంఘటన గుర్తుకు వచ్చి ఒక్కసారిగా భయపడుతుంది. అయినప్పటికీ ఆ భయాన్ని దాచిపెట్టి "సరే, ఈసారి క్షమించాను.. ఇకనైనా బుద్ధిగా ఉండు" అంటూ చెప్పేస్తుంది. ఈ సీన్ తర్వాత బాలు మరో ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ప్రభావతిని ఇంటికి తీసుకురావడానికి అతడు వేసిన డ్రామా ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. "ఇది నేను నిన్ను అమ్మా అని పిలిచే చివరి సారి" అంటూ భావోద్వేగంగా మాట్లాడి అందరినీ షాక్‌కు గురి చేస్తాడు. కామాక్షి కూడా కంగారు పడుతుంది. కానీ వెంటనే బాలు కథ మలుపు తిప్పుతూ "బామ్మ నాన్నకి రెండో పెళ్లి చేయబోతుంది" అని చెబుతాడు.

You May Also Like
Rakasa Movie Public Talk: రాకాస మూవీ పబ్లిక్ టాక్.. మెగా డాటర్ మూవీ ఎలా ఉందంటే..?
Rakasa Movie Public Talk: రాకాస మూవీ పబ్లిక్ టాక్.. మెగా డాటర్ మూవీ ఎలా ఉందంటే..?

నీలవేణి అనే పాత ప్రేమ కథను తెరపైకి తీసుకువచ్చి, తండ్రికి రెండో పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. బాలు ఇక్కడే ఆగకుండా, "పెళ్లి పనులు మొదలయ్యాయి.. ఆస్తి కూడా కొత్త పిల్లాడికే రాస్తారు" అంటూ మరింత భయపెడతాడు. కామాక్షి కూడా కావాలనే ఈ డ్రామాను పెంచుతూ ప్రభావతిని రెచ్చగొడుతుంది. దీంతో ప్రభావతి మనసులో భయం పెరిగి, వెంటనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. కానీ తన స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి బయటే ఆగి, మనోజ్‌ను పిలిచి "నన్ను బలవంతంగా తీసుకెళ్లినట్టు నటించండి" అని ప్లాన్ చేస్తుంది. మనోజ్, రోహిణి కలిసి ఆమెను లోపలికి తీసుకువస్తారు.

Biker Movie Public Talk: బైకర్ మూవీ పబ్లిక్ టాక్.. శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
Biker Movie Public Talk: బైకర్ మూవీ పబ్లిక్ టాక్.. శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?

ఇక్కడ మరోసారి బాలు కామెడీతో ఎంట్రీ ఇస్తాడు. "మా అమ్మవతి వచ్చేసింది.. తుఫాన్ వచ్చేసింది" అంటూ ఆటపట్టిస్తాడు. ప్రభావతి కోపంతో ఊగిపోతున్నా, చివరికి ఇంట్లోకి అడుగుపెడుతుంది. మీనా హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది. అయితే బాలు అతి చేయడంతో ప్రభావతి అతడిని కొట్టే సీన్ కామెడీగా సాగుతుంది. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే. ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభావతి ఒక షరతు పెడుతుంది. "మీనా ఈ ఇంట్లో ఉండటానికి అభ్యంతరం లేదు.. కానీ ఆమె పుట్టింటివారు ఇకపై ఇంట్లోకి రావద్దు" అని కండీషన్ పెడుతుంది. అందరికీ షాక్ ఇచ్చేలా మీనా ఆ షరతును అంగీకరిస్తుంది. "వాళ్లు ఇక్కడికి వచ్చి అవమానాలు పడటంకంటే దూరంగా ఉండడమే మంచిది" అని చెప్పడం భావోద్వేగంగా మారింది.

Biker Movie Day 1 collections: బైకర్ మూవీ కలెక్షన్స్.. శర్వానంద్ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?
Biker Movie Day 1 collections: బైకర్ మూవీ కలెక్షన్స్.. శర్వానంద్ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?

ఇదిలా ఉంటే, బాలు చెప్పిన రెండో పెళ్లి విషయం గురించి ప్రభావతి సత్యాన్ని అడుగుతుంది. సత్యం కూడా బాలు ప్లాన్‌కి సపోర్ట్ చేస్తూ "అవును.. ఎంతకాలం ఒంటరిగా ఉండాలి?" అని చెప్పడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రభావతి షాక్ అవుతుంటే, బాలు సరదాగా "అమ్మ నాన్నకంటే పెద్దది" అంటూ కామెడీ పంచుతాడు. మరోవైపు రోహిణి మనసులో అనుమానం మొదలవుతుంది. ప్రభావతి అంత సులభంగా కేసు వెనక్కి తీసుకోవడం వెనుక ఏదో కారణం ఉందని అనుకుంటుంది. అదే సమయంలో గుణ నుంచి వచ్చే ఫోన్ కాల్‌తో ఆమె టెన్షన్‌లో పడుతుంది. రెండు లక్షలు ఇవ్వాలని గుణ బ్లాక్ మెయిల్ చేయడంతో కథలో మరో ట్విస్ట్ గా మారింది.

ఆ భయంతోనే సీరియల్స్ మానేశా.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన
ఆ భయంతోనే సీరియల్స్ మానేశా.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన

ఇక అపకమ్మింగ్ ఎపిసోడ్‌లో బాలు-మీనా మధ్య జరిగిన సంభాషణలో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తాయి. ప్రభావతి పెట్టిన షరతు బాలుకు అంతగా నచ్చదు. ఈ విషయం గురించి అతడు మీనాను నేరుగా ప్రశ్నిస్తాడు. ' మా అమ్మ అలా మాట్లాడినా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు?'అని కొంచెం ఆవేశంతో అడుగుతాడు. దీనికి మీనా చాలా ప్రశాంతంగా, 'నేను ఈ ఇంట్లో కోడలిని, నాకు బాధ్యతలు ఉన్నాయి. కానీ నా అమ్మానాన్నల గౌరవం కూడా అంతే ముఖ్యమైంది. వాళ్లు ఇక్కడికి వచ్చి అవమానాలు పడటంకంటే, వాళ్లను దూరంగా ఉంచడమే మంచిది' అని చెబుతుంది. 'గౌరవం లేని చోట ప్రేమ ఉండదు' అని మీనా చెప్పిన బాలు హర్ట్ కు టచ్ అవుతాయి.

 50 నిద్రమాత్రలతో సూసైడ్ అటెంప్ట్.. ఆ అమ్మాయి వల్లే..
50 నిద్రమాత్రలతో సూసైడ్ అటెంప్ట్.. ఆ అమ్మాయి వల్లే..

ఈ సమయంలో మీనా మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి. ఇంట్లో జరుగుతున్న కలహాల మధ్య, అసలు సమస్య అయిన అప్పుల గురించి మీనా మళ్లీ ప్రస్తావిస్తుంది. 'మన సమస్యలు ఇలా మాట్లాడుకుంటూ సర్దుకోవడం సరిపోదు... డబ్బు సమస్యను కూడా పరిష్కరించాలి'అని చెబుతుంది. ఈ సమయంలో తన కొత్త వ్యాపారం ఆలోచనను ముందుకు తీసుకువస్తుంది. "మనకు ఉన్న పరిచయాలు, మనుషులు... ఇవన్నీ ఉపయోగించుకుంటే మనమే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్, ఈవెంట్స్‌కి డెకరేషన్ ఆర్డర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది?" అని అడుగుతుంది. ఈ ఐడియా కేవలం మాటల్లోనే కాకుండా, ఒక అవకాశంగా కనిపిస్తుంది.

మీనా ఆలోచనలో ప్రాక్టికాలిటీ ఉంది. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగలిగే పని, అలాగే డిమాండ్ కూడా ఎక్కువగా ఉండే రంగం కావడంతో ఇది కుటుంబానికి మంచి ఆదాయం తీసుకురాగలదని ఆమె వివరిస్తుంది. బాలు ఈ ఐడియాను విన్న తర్వాత మొదట ఆశ్చర్యపోతాడు. "మనకు అది సాధ్యమా?" అనే సందేహం కనిపిస్తుంది. కానీ మీనా మాత్రం నమ్మకంగా ఉంటుంది. "మనిద్దరం కలిసి ప్రయత్నిస్తే సాధ్యమే" అని చెప్పి అతడికి ధైర్యం ఇస్తుంది. ఇలా తమ కొత్త వ్యాపారం ప్రారంభం దిశగా అడుగులేస్తారు.

'కింగ్ 100'లో నాగార్జున ప్రయోగం.. టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ అలా..
'కింగ్ 100'లో నాగార్జున ప్రయోగం.. టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ అలా..

మరోవైపు.. రోహిణికి తన అత్త ప్రభావతిపై మరింత అనుమానం పెరుగుతుంది. ఇక చివరగా రోహిణి నిజం తెలుసుకోవాలని కామాక్షిని టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంటుంది.ఈ క్రమంలో రోహిణి.. మీనాక్షి ఇంటికి వెళ్లి తన అత్త గట్టు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో 2 లక్షల డీల్ గురించి.. మీనాక్షి బయటపెడుతుందా? ఒక వేళ ఆ విషయం బయటపడితే.. తన అత్త ప్రభావతిని ఇన్ డైరెక్ట్ గా రెండు లక్షలు అడిగి, ఆ డబ్బును గుణకు ఇవ్వాలని ప్రయత్నిస్తుందా? అనేది రాబోయే ఎపిసోడ్‌లపై మరింత ఆసక్తి పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X