Gundeninda Gudigantalu April 11th Episode: మీనాకు ప్రాణాపాయం, బాలు తిప్పలు, గుణ,రోహిణికి ఎండ్ కార్డు?

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠతో కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభం నుంచే రోహిణి భయం స్పష్టంగా కనిపిస్తుంది. తాను చేసిన దొంగతనం ఎప్పుడైనా బయటపడుతుందనే టెన్షన్ ఆమెను వెంటాడుతుంది. ముఖ్యంగా బాలు ఊరికి తిరిగి వస్తాడన్న విషయం ఆమెను మరింత కంగారు పెట్టేస్తుంది. 'గుణనే నన్ను కాపాడగలడు' అనే ఆలోచనతో వెంటనే అతనికి ఫోన్ చేస్తుంది. కానీ, గుణ మాత్రం దినేష్‌తో కలిసి మద్యం సేవిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. రోహిణి తన పరిస్థితిని వివరంగా చెప్పి, రెండు లక్షల కోసం ఒత్తిడి తెచ్చిన గుణ కారణంగానే తాను దొంగతనం చేసి డబ్బు ఇచ్చానని వెల్లడిస్తుంది. ఆ నింద మీనా మీద పడిందని, ఇప్పుడు బాలు వస్తే నిజం బయటపడుతుందని చెప్పి తన డబ్బు తిరిగి ఇవ్వమని వేడుకుంటుంది.

అయితే గుణ అసలు సహానుభూతి చూపకుండా, ఆ డబ్బు దినేష్ చికిత్స కోసం ఖర్చు చేశానని చెబుతూ ఆమెను నమ్మబలుకుతాడు. అంతేకాకుండా, మీనా-బాలు మీద తన పాత పగ తీర్చుకునే అవకాశం ఇదేనని భావించి ఒక ప్రమాదకర ప్లాన్ వేస్తాడు. దినేష్‌తో కలిసి మీనాను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. మొదట్లో భయపడిన దినేష్, చివరకు గుణ మాటలకు ఒప్పుకుని ఈ క్రిమినల్ ప్లాన్‌లో భాగమవుతాడు. ఇదే సమయంలో, మరోవైపు మీనా తనపై పడిన అపవాదును తట్టుకోలేక తీవ్రంగా బాధపడుతుంది. తనపై పడిన నిందను తుడిచేయాలని, నిజం బయటపెట్టాలని నిర్ణయించి ఎవరికీ చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు బయలుదేరుతుంది. కానీ ఇదే సమయంలో దినేష్ ఆమెను అడ్డగించి కిడ్నాప్ చేస్తాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ ముసలి దంపతులను కూడా కత్తితో బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. మీనా తప్పించుకునేందుకు ప్రయత్నించినా, దినేష్ బెదిరింపులతో ఆమెను బలవంతంగా తీసుకెళ్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 660 April 11th 2026 here is full story

photo courtesy jiohotstar

ఇంట్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. మీనా కనిపించకపోవడంతో శృతి ఆందోళన చెందుతుంది. కానీ, మనోజ్ మాత్రం అనాలోచితంగా 'మళ్లీ దొంగతనం చేయడానికి వెళ్లిందేమో' అంటూ మాట్లాడడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుంది. శృతి గట్టిగా స్పందిస్తూ మీనాపై ఇలా మాట్లాడడం సరికాదని హెచ్చరిస్తుంది. సత్యం కూడా అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని మనోజ్‌పై కోపంతో విరుచుకుపడతాడు. ప్రభావతి కూడా మీనాపై దారుణ ఆరోపణలు చేస్తుండటంతో సత్యం తీవ్రంగా స్పందిస్తూ ఆమెను గట్టిగా మందలిస్తాడు. ఇదే సమయంలో వైజాగ్ నుంచి తిరిగి వచ్చిన బాలు, ఇంట్లో పరిస్థితి చూసి షాక్ అవుతాడు. మీనా కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతాడు. ప్రభావతి మీనాపై దొంగతనం ఆరోపణలు చేయడంతో బాలు ఆగ్రహంతో ఊగిపోతాడు.

తన తల్లినే నిలదీస్తూ, 'నా భార్యపై ఇలా నిందలు వేయడం ఎలా?' అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. మనోజ్, ప్రభావతి గతం కూడా బయటపెట్టి వారిని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత మీనా కోసం వెతకాలని నిర్ణయించి ఇంటి నుంచి బయలుదేరుతాడు. బాలు తన స్నేహితుడు రాజేష్ సహాయంతో మీనాను వెతికే ప్రయత్నాలు మొదలుపెడతాడు. పుట్టింటికి ఫోన్ చేయడం నుంచి గుళ్లు, బంధువుల ఇళ్లు, పరిచయస్తుల దగ్గర వరకు అన్ని చోట్ల వెతికినా మీనా జాడ దొరకదు. దీంతో అతని ఆందోళన మరింత పెరుగుతుంది. మరోవైపు, మీనాను దినేష్ ఓ చీకటి గదిలో బంధిస్తాడు. "ఎవర్రా మీరు?" అని ప్రశ్నించినా సమాధానం ఇవ్వకుండా మౌనం పాటిస్తాడు. గుణ అక్కడికి వచ్చి ఆమెను కట్టుదిట్టంగా కాపాడాలని హెచ్చరిస్తాడు.

ఇదే సమయంలో రోహిణి గుణకు కాల్ చేసి మీనా గురించి అడగగా, గుణ చల్లగా "నేనే కిడ్నాప్ చేశాను" అని చెప్పడం షాకింగ్‌గా మారుతుంది. ఈ విషయం విన్న రోహిణి ఆనందపడటం మరింత క్రూరత్వాన్ని చూపిస్తుంది. అయితే ఆమె ఫ్రెండ్ విద్య మాత్రం మీనాపై జాలి చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక గుణ-దినేష్ మరోపక్క బాలు‌ను మానసికంగా ఇబ్బంది పెట్టే ఆట మొదలుపెడతారు. ఫోన్ చేసి తప్పు ప్రదేశాలకు పంపుతూ గందరగోళానికి గురిచేస్తారు. చివరకు "నీ భార్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి" అని బెదిరించి కాల్ కట్ చేస్తారు. దీంతో బాలు అనుమానం గుణపై పడుతుంది. కానీ రాజేష్ సలహాతో వెంటనే చర్య తీసుకోకుండా ఆగిపోతాడు. చివరగా, బాలు దేవుణ్ణి ప్రార్థిస్తూ మీనాను కాపాడాలని కోరుతాడు. మరోవైపు బంధించబడ్డ మీనా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ సహాయం కోరుతుంది. ఇలా ఇద్దరి భావోద్వేగాలతో ఎపిసోడ్ ముగియడం ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ పెంచింది.

రాబోయే ఎపిసోడ్‌లో గుండె నిండా గుడిగంటలు కథ మరింత ఉత్కంఠభరితంగా మలుపు తిరగబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు మీనా కిడ్నాప్‌తో టెన్షన్ పెరిగిన కథ, ఇక నుంచి రేస్క్యూ మిషన్‌గా మారబోతోంది. ముఖ్యంగా బాలు పాత్రలో వచ్చే భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మరింతగా కట్టిపడేయనున్నాయి. మీనా కోసం ఆత్రంగా వెతుకుతూ అలసిపోయిన బాలు, చివరి వరకూ వెనక్కి తగ్గకుండా పోరాడాలని నిర్ణయించుకుంటాడు. "ఎలాగైనా మీనాను ప్రాణాలతో తీసుకురావాలి" అనే సంకల్పంతో మరింత దూకుడుగా వెతుకులాట కొనసాగిస్తాడు. ఈ క్రమంలో కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. మీనా కిడ్నాప్ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ముసలి దంపతులు బాలు కంటపడతారు. వారు బాలును పిలిచి, జరిగిన విషయాన్ని వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది.

వారి చెప్పిన వివరాలు, క్లూస్ ఆధారంగా బాలు కొత్త మార్గంలో తన అన్వేషణను ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో మీనా చీరకు సంబంధించిన ఆనవాళ్లు ఒక ప్రాంతంలో కనిపించడం కథలో సస్పెన్స్‌ను మరింత పెంచుతుంది. ఆ క్లూ చూసిన బాలు, ఆ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తూ, ఒక్క అడుగు కూడా వదలకుండా వెతుకుతాడు. దీంతో మీనా ఉన్న ప్రదేశానికి అతను దగ్గరపడినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచే కథ అసలు హై వోల్టేజ్ మోడ్‌లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణ, దినేష్ చేతుల్లో బంధించబడిన మీనాను బాలు ఎలా రక్షిస్తాడు? వారిని ఎలా ఎదుర్కొంటాడు? అనేది ప్రధాన ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు మానసికంగా ఆడుకున్న గుణకు, బాలు ఎలా గుణపాఠం చెబుతాడు అన్నది ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఇక మరోవైపు రోహిణి పాత్ర కూడా కీలకంగా మారబోతోంది. ఇప్పటివరకు తన తప్పును దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు, గుణతో కలిసి వేసిన ప్లాన్లు అన్ని బయటపడే పరిస్థితి దగ్గరపడుతున్నాయి. ఒకవేళ మీనా సురక్షితంగా బయటపడితే, రోహిణి చేసిన దొంగతనం నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆమె బాగోతం బయటపడుతుందా? లేక మరో కొత్త కుట్రతో తప్పించుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంట్లో కూడా పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. బాలు నిజం బయటపెడితే, ప్రభావతి, మనోజ్‌లపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. సత్యం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, కుటుంబంలో పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాబోయే ఎపిసోడ్‌లో రేస్క్యూ డ్రామా, యాక్షన్, ఎమోషన్ అన్ని కలిపి కథను క్లైమాక్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. బాలు-మీనా ట్రాక్ ఎలా ముగుస్తుంది? గుణ-దినేష్‌కు ఎలాంటి శిక్ష పడుతుంది? రోహిణి అసలు రంగు బయటపడుతుందా? అనే ప్రశ్నలతో ప్రేక్షకులు తదుపరి ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X