Gundeninda Gudigantalu April 18th Episode: మీనా వార్నింగ్, రోహిణి బాగోతం బట్టబయలు, మనోజ్-ప్రభావతి కొత్త అవతారం

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే సత్యం తన నిర్ణయంపై నిలబడిన విధానం ఆకట్టుకుంది. బాలు ఎంత చెప్పినా వినకుండా, కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పని చేయాలని ఫిక్స్ అవుతాడు. తన స్నేహితుడు రంగారావుకు ఫోన్ చేసి విషయం చెప్పి, అతను ఇచ్చిన రిఫరెన్స్‌తో స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడి కరస్పాండెంట్ కూడా "ఇంత వరకు రంగా ఎవరికి రికమెండ్ చేయలేదు... మొదటిసారి మీ కోసం చెప్పాడు" అని చెప్పడం సత్యం మీద నమ్మకాన్ని చూపిస్తుంది. ఏ పని అయినా చేస్తానని, కానీ వయస్సు వల్ల మెట్లు ఎక్కువగా ఎక్కలేనని సత్యం చెప్పడం అతని నిజాయితీని తెలియజేస్తుంది. దానికి స్పందించిన స్కూల్ యాజమాన్యం అతనికి అకౌంటెంట్ ఉద్యోగం ఆఫర్ చేయడం కథలో మంచి పాజిటివ్ టర్న్. వారానికి ఒక్కరోజు పని, త్వరలో కొత్త బ్రాంచ్‌లో రెగ్యులర్ జాబ్ అవకాశం. ఇవి సత్యం జీవితంలో కొత్త ఆశలు నింపాయి.

అదే సమయంలో కథలో కీలకమైన సన్నివేశం చోటుచేసుకుంది. అదే స్కూల్‌కు రోహిణి తన కొడుకు చింటూని తీసుకువస్తుంది. "ఇదే నీ స్కూల్" అంటూ అతనికి కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. అయితే ఇదే సమయంలో సత్యం అక్కడి నుంచి బయటకు రావడం, రోహిణి లోపలికి వెళ్లడం ఇద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నా ఎదురుపడకపోవడం సస్పెన్స్‌ను పెంచింది. ఈ మిస్ అయ్యే మూమెంట్ భవిష్యత్తులో పెద్ద రివీల్‌కు దారి తీసేలా కనిపిస్తోంది. ఇక మీనా ట్రాక్ ఈ ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్. పూల డెలివరీ చేస్తూ వెళ్తున్న మీనాను ఒక అనుమానాస్పద వ్యక్తి ఫాలో అవడం టెన్షన్‌ను పెంచింది. ఆమె ఎక్కడ ఆగినా, అతను వెంటపడుతూనే ఉండడం మీనాను భయపెట్టింది. మొదట దొంగ అనుకుని భయపడినా, తరువాత పరిస్థితి సీరియస్ అవుతుందని గ్రహిస్తుంది. చివరకు సేఫ్ ప్లేస్‌గా విద్య ఇంటికి వెళ్లడం కథను మరింత ఆసక్తికరంగా మలిచింది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 665 April 18th 2026 here is full story

photo courtesy jiohotstar

అక్కడ ఇప్పటికే రోహిణి ఉండటం మరో ట్విస్ట్. బాలు ఫోన్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మీనా రావడంతో రోహిణి కంగారు పడుతుంది. వెంటనే ఫోన్ దాచేయడం, పరిస్థితిని కవర్ చేయడం ఆమె తెలివితేటలను చూపించింది. మీనా తనను ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పినా, ఈ విషయం బయటకు చెప్పొద్దని కోరుతుంది. రోహిణి మాత్రం "ఇలాంటివి కామన్" అంటూ లైట్ తీసుకున్నట్టుగా నటిస్తుంది. కానీ లోలోపల మాత్రం తన ప్లాన్ బయటపడుతుందేమోనన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. మీనాకు తెలియకుండా ఫోన్ దాచిన తర్వాత, రోహిణి విద్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "ఫోన్ వెంటనే తీసుకెళ్లి పడేయ్" అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. దీంతో విద్య భయంతో బయలుదేరుతుంది. కానీ మార్గమధ్యలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. చెప్పు తెగిపోవడం, బైక్ సమస్య ఇవన్నీ కలిసి ఆమెను ఇబ్బందుల్లో పడేస్తాయి. చివరకు చెప్పులు కుట్టే తాత వద్ద ఆగుతుంది. అదే సమయంలో కంగారులో బాలు ఫోన్ అక్కడే మరిచిపోతుంది. ఆ ఫోన్ ముసలి దంపతుల చేతికి చేరడం కథలో కీలక మలుపు.

ఇదే సమయంలో రోహిణి ఫోన్ చేసి ఫోన్ పడేశావా అని అడగగా, నిజం చెప్పడానికి భయపడ్డ విద్య అబద్ధం చెబుతుంది. దీంతో రోహిణి రిలీఫ్ ఫీల్ అవుతుంటే, విద్య మాత్రం లోలోపల టెన్షన్ పడుతుంది. ఈ ఫోన్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బాలు ట్రాక్ కూడా ఆసక్తికరంగా సాగింది. తన ఫ్రెండ్ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పడంతో బాలు "లవ్ గురు"గా మారి సలహాలు ఇస్తాడు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ దాగి ఉంది. ఆ అమ్మాయి మీనానే కావడం. బాలు ఇచ్చిన సలహాలతో ఆ వ్యక్తి మీనాతో మాట్లాడటానికి ప్రయత్నించడం కథలో సస్పెన్స్‌ను మరింత పెంచింది. "మీరు నా అదృష్ట దేవత" అంటూ అతను మీనాతో మాట్లాడటం సన్నివేశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఇక మనోజ్ ట్రాక్ భయానకంగా మారింది. షాప్ ముందు దొరికిన కవర్‌లో గుడ్లు ఉండటం, అవి చేతబడి చేసినవని చెప్పడం అతనిని షాక్‌కు గురిచేసింది. వర్కర్ చెప్పిన కథ ఇలాంటివి వల్ల తమ ఇంట్లో నష్టం జరిగిందని చెప్పడం. మనోజ్‌ను పూర్తిగా భయపెట్టింది. తన ఎదుగుదలను ఎవరో అడ్డుకోవాలని ఇలా చేశారని అనుమానపడటం అతని ఆందోళనను పెంచింది. ఈ భయంతో స్వామీజీ వద్దకు వెళ్లిన మనోజ్‌కు మరింత షాక్ ఎదురైంది. "మీరు సంపాదించిన పేరు, డబ్బు అంతా పోతుంది... అప్పుల పాలవుతారు... చివరకు రోడ్డున పడతారు" అంటూ స్వామీజీ చెప్పిన మాటలు అతన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. రోహిణి మాత్రం ఈ విషయాన్ని ప్రశ్నించినా, స్వామీజీ "నేను సత్యమే చెబుతాను" అని చెప్పడంతో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారింది.

ఇక అపకమ్మింగ్ ఎపిసోడ్ లో కథను మరింత ఉత్కంఠభరితంగా సాగబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే సస్పెన్స్, భావోద్వేగాలు, డ్రామాతో సాగుతున్న కథ... ఇకపై మరింత గట్టిగా మలుపులు తిరగబోతోంది. ముఖ్యంగా మనోజ్ ట్రాక్, రోహిణి రహస్యాలు, బాలు ఫోన్ మిస్టరీ అన్ని ఒకే దారిలో కలిసేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా మనోజ్ ట్రాక్ మరింత టెన్షన్‌ను పెంచబోతోంది. స్వామీజీ చెప్పిన మాటలతో ఇప్పటికే భయపడిపోయిన మనోజ్, ఆ గండం నుంచి బయటపడేందుకు మార్గం అడుగుతాడు. దీనికి స్వామీజీ చెప్పిన పరిహారం అతన్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. అమ్మవారికి బోనం చెల్లించాలి, వేపాకులతో చేసిన వస్త్రాలు ధరించాలి, కఠిన ఉపవాసాలు చేయాలి అని సూచిస్తాడు. ఇవి చేయకపోతే తనపై ఉన్న చేతబడి ప్రభావం తగ్గదని హెచ్చరిస్తాడు. వ్యాపారం పూర్తిగా కుదేలవుతుందని చెప్పడంతో మనోజ్ పూర్తిగా భయానికి లోనవుతాడు.

ఈ విషయాన్ని తన తల్లి ప్రభావతికి చెప్పినప్పుడు, మొదట ఆమె ఈ విషయాన్ని నమ్మకుండా తిరస్కరిస్తుంది. కానీ "ఈ గండం నీకూ ఉంది" అని మనోజ్ చెప్పడంతో పరిస్థితి మారిపోతుంది. తన కుటుంబానికి ప్రమాదం ఉందని భావించిన ప్రభావతి చివరకు ఒప్పుకుంటుంది. దీంతో తల్లి-కొడుకు ఇద్దరూ కలిసి కఠిన వ్రతాలు, పూజలు చేయడానికి సిద్ధమవుతారు. ఈ ట్రాక్‌లో భక్తి, భయం, అనుమానం అన్నికలిసి మరింత డ్రామాటిక్‌గా మారబోతున్నాయి.

మరోవైపు కథలో కీలకమైన మలుపు బాలు ఫోన్ మిస్టరీ. విద్య చేతి నుంచి జారిపోయిన ఆ ఫోన్ ఇప్పుడు ముసలి దంపతుల దగ్గర ఉంది. ఈ ఫోన్‌లో ఉన్న సమాచారమే రోహిణి ప్లాన్‌లకు కీ అని ఇప్పటికే తెలిసింది. ఇప్పుడు ఈ ఫోన్ మీనా లేదా బాలు చేతికి పడే అవకాశం ఉందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అది జరిగితే, ఇప్పటి వరకు దాచిన రహస్యాలన్నీ ఒక్కసారిగా బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రోహిణి జీవితంలో పెద్ద తుఫాన్ రావడం ఖాయం.

ఇక రోహిణి ట్రాక్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. తన కొడుకు చింటూను సత్యం పనిచేస్తున్న స్కూల్‌లోనే అడ్మిషన్ చేయించడం కథలో భారీ ట్విస్ట్. ఇప్పటివరకు ఒకరిని ఒకరు మిస్ అవుతున్న సత్యం, రోహిణి... ఇక అదే ప్రదేశంలో రోజూ కలిసే అవకాశాలు పెరిగాయి. దీంతో రోహిణి అసలు స్వరూపం బయటపడే సమయం దగ్గరపడుతున్నట్టు కనిపిస్తోంది. చింటూ ద్వారా లేదా స్కూల్‌లో జరిగే సంఘటనల ద్వారా సత్యంకి నిజం తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మీనాకు సంబంధించిన ట్రాక్ కూడా కీలక దశలోకి వెళ్లబోతోంది. ఇప్పటివరకు ఆమెను ఫాలో అవుతున్న వ్యక్తి వెనుక అసలు కథ బయటపడబోతోంది. అతను బాలు ఫ్రెండ్ తమ్ముడు అనే విషయం ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసినా, మీనాకు మాత్రం తెలియదు. ఇప్పుడు అతను బాలు ఇచ్చిన సలహాలతో మీనాతో దగ్గరవడానికి ప్రయత్నించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చబోతోంది. మీనా ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? బాలు తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X