Gundeninda Gudigantalu May 2nd Episode: విల్లా ఓనర్స్ ఏంట్రీ.. బయటపడ్డ మోసం.. రంగంలోకి బాలు..

Photo courtesy : jio hotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కథ మరింత ఆసక్తికర మలుపులు తిరిగింది. ఒకవైపు చింతామణి వేసిన వ్యూహాలు, మరోవైపు మనోజ్ కుటుంబం విల్లాలోకి అడుగుపెట్టడం, అంతకుమించి అక్కడ జరిగిన అనుమానాస్పద పరిణామాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచాయి. మీనాకు రావాల్సిన పెళ్లి ఆర్డర్‌ను అడ్డుకునేందుకు చింతామణి తక్కువ కొటేషన్‌తో పెద్ద ప్లాన్ వేసింది. సగం ధరకు కోట్ ఇచ్చి ఆర్డర్‌ను తనవైపు తిప్పుకుంది. అయితే అసలు ప్లాన్ మరింత మోసపూరితంగా ఉంది.పెళ్లికి ముందు రోజు పూలు దొరకడం లేదని చెప్పి, అత్యవసర పరిస్థితిని ఉపయోగించుకుని ఎక్కువ డబ్బు వసూలు చేయాలని తన అసిస్టెంట్‌తో మాట్లాడుతుంది. ఈ విషయం మీనాకు తెలిసి షాక్ అవుతుంది. "ఆమె ఎప్పుడూ ఇలానే ఉంటుంది. వేరే వాళ్ల ఎదుగుదలను తట్టుకోదు" అని పని మనిషి చెప్పడంతో మీనా ఆలోచనల్లో పడుతుంది.

Also Read
Jetlee Day 1 Box Office Collection: జెట్‌లీ తొలి రోజు కలెక్షన్లు.. సత్య సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?
Jetlee Day 1 Box Office Collection: జెట్‌లీ తొలి రోజు కలెక్షన్లు.. సత్య సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?

ఇక మరోవైపు ప్రభావతి విల్లాకు వెళ్లేందుకు ఏ చీర కట్టుకోవాలో అని పెద్దగా ఆలోచిస్తూ ఉంటుంది. అన్ని చీరలను బయటకు తీసి సెలెక్షన్ మొదలు పెడుతుంది. ఈ సందర్భంలో సత్యం వేసే కౌంటర్లు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. "ఏ చీర కట్టుకున్నా బాగుండవు" అంటూ సరదాగా మాట్లాడటం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. చివరకు "ఏదైనా సరే కట్టుకో" అంటూ సత్యం తప్పించుకోవడం హాస్యాన్ని పెంచింది. ప్రభావతి తన కోడలు రోహిణిని పిలిచి చీరలు సెలెక్ట్ చేయమంటుంది. రోహిణి ఎంపిక చేసిన రెండు చీరలను చూసి ప్రభావతి మురిసిపోతుంది. "నీ సెలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది.. అందుకే నన్ను, మనోజ్‌ని సెలెక్ట్ చేశావ్" అంటూ పొగిడుతుంది. దీనికి సత్యం మళ్లీ కౌంటర్ వేయడం సన్నివేశానికి హాస్యరసాన్ని తెచ్చింది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 675 May 2nd 2026 here is full story

Photo courtesy : jio hotstar

Recommended For You
Jetlee Twitter Review: జెట్‌లీ మూవీ ట్విట్టర్ రివ్యూ..
Jetlee Twitter Review: జెట్‌లీ మూవీ ట్విట్టర్ రివ్యూ..

చింతామణి చేసిన మోసం గురించి మీనా బాధపడుతుంటే, బాలు ఆమెకు ధైర్యం చెబుతాడు. "వ్యాపారంలో ఇవన్నీ కామన్.. చివరకు న్యాయం గెలుస్తుంది" అంటూ మీనాలో నమ్మకం నింపుతాడు. ఈ సీన్‌లో భావోద్వేగం కూడా కనిపించింది. తరువాత రోజు మనోజ్ కుటుంబం విల్లాకు చేరుతుంది. విల్లా అందాలను చూసి ప్రభావతి ఆశ్చర్యపోతుంది. అయితే ఓనర్స్ ప్రవర్తన రవి, శ్రుతికి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. అయినా మనోజ్ మిగిలిన అడ్వాన్స్ రూ.25 లక్షలు ఇచ్చి, అగ్రిమెంట్‌పై సంతకం చేస్తాడు. డబ్బు తీసుకున్న వెంటనే ఓనర్స్ అక్కడి నుంచి వెళ్లిపోవడం మరింత అనుమానాలకు దారితీసింది.

You May Also Like
Kara Day 1 Box Office Collection: 'కర' మూవీ తొలి రోజు కలెక్షన్లు.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Kara Day 1 Box Office Collection: 'కర' మూవీ తొలి రోజు కలెక్షన్లు.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఓనర్లు వెళ్లే సమయంలో బాలు, మీనా అడ్డుకోవడంతో చిన్న గొడవ జరుగుతుంది. "ఇంటి ఓనర్లు అయితే క్యాబ్‌లో ఎందుకు వెళ్తున్నారు?" అని బాలు ప్రశ్నించడం కీలకంగా మారింది. కానీ ప్రభావతి మాత్రం బాలుని మాటలను లైట్ తీసుకుంటూ కౌంటర్లు వేస్తుంది. ఇక అందరూ విల్లాను ఎంజాయ్ చేస్తుండగా, బాలు మాత్రం ఏదో అనుమానంతో ఆలోచనల్లో పడిపోతాడు. ఇదే తర్వాతి ఎపిసోడ్‌లకు స్ట్రాంగ్ హింట్ గా మారింది. విల్లాలో పని గురించి మాట్లాడుతుండగా, "మంచి భార్య దొరికితే భర్త ఎదుగుతాడు" అంటూ ప్రభావతి చెప్పిన మాటలకు బాలు తిరిగి కౌంటర్ వేస్తాడు. "నాన్నకి మంచి భార్య దొరకలేదు కాబట్టి డ్రైవర్‌గానే మిగిలిపోయాడు" అని చెప్పడంతో ప్రభావతి కోపంగా మారుతుంది. సత్యం మళ్లీ సరదాగా మధ్యలో మాట్లాడి సీన్‌ను హైలైట్ చేశాడు.

మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం
మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం

కాఫీ పెట్టమని ప్రభావతి ఆర్డర్ ఇవ్వగా, పాలు లేవని మీనా చెబుతుంది. ఈ సమయంలో కామాక్షి కూడా అక్కడికి రావడం కథలో మరో చిన్న మలుపు. ఇంటికి మంచి పేరు పెట్టేందుకు న్యూమరాలజిస్ట్‌ను పిలుస్తారు. అతడు ముందుగా మనోజ్ పేరుపై షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. "మనోజ్ అంటే సున్నా.. నీకు విలువే లేదు" అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. రోహిణి, ప్రభావతి పేర్లతో కలిపి 'రోమతి' అనే వింత పేరు సూచిస్తాడు. ఈ పేరు కొందరికి నచ్చకపోయినా, ప్రభావతి మాత్రం ఒప్పుకుంటుంది. పేరు చెప్పిన తర్వాత ఫీజు రూ.20,000 అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. "సంఖ్యాశాస్త్రం సాధారణం కాదు" అంటూ అతడు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు.

 GaayaPadda Simham Twitter Review: గాయపడ్డ సింహం ట్విట్టర్ రివ్యూ..
GaayaPadda Simham Twitter Review: గాయపడ్డ సింహం ట్విట్టర్ రివ్యూ..

ఇక రాబోయే ఎపిసోడ్‌లో భారీ ట్విస్టులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటికి పేరు పెట్టేందుకు వచ్చిన న్యూమరాలజిస్ట్ 'రోమతి' అనే వింత పేరు సూచించి, రూ.20,000 ఫీజు అడగడంతో ఇంట్లో ఉన్నవారంతా షాక్‌కు గురవుతారు. ఈ సమయంలో బాలు ఆ న్యూమరాలజిస్ట్‌తో వాగ్వాదానికి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మనోజ్, రోహిణి మాత్రం అతడికి అడిగిన మొత్తం ఇచ్చి పంపించేస్తారని సమాచారం.

Dacoit OTT Release: ఓటీటీలోకి అడివి శేష్ 'డెకాయిట్'.. యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dacoit OTT Release: ఓటీటీలోకి అడివి శేష్ 'డెకాయిట్'.. యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇదే సమయంలో అసలు ట్విస్ట్ ఎంటర్ కానుంది. విల్లా విషయంలో అన్నీ సవ్యంగా జరిగాయని భావిస్తున్న మనోజ్‌కు ఊహించని షాక్ తగలబోతోంది. అసలు ఓనర్లు ఇంటికి వచ్చి హంగామా చేయడంతో, తాము మోసపోయిన విషయాన్ని కుటుంబం గ్రహిస్తుంది. అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.5 లక్షలు, తరువాత చెల్లించిన రూ.25 లక్షలు అన్ని కలిపి పెద్ద మోసం జరిగినట్టు బయటపడుతుంది. దీంతో ప్రభావతి సహా కుటుంబ సభ్యులందరూ షాక్‌లో మునిగిపోతారు.

నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. బిగ్ బాస్ సెలెబ్రిటీకి చేదు అనుభవం..
నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. బిగ్ బాస్ సెలెబ్రిటీకి చేదు అనుభవం..

ఈ పరిణామాల మధ్య బాలు మనోజ్‌పై తీవ్రంగా మండిపడి, అతని నిర్లక్ష్యాన్ని ఎండగడతాడు. చివరికి మార్గం లేక మనోజ్, బాలుని సహాయం కోరనున్నాడు. ఇక బాలు రంగంలోకి దిగుతూ ఆ కేటుగాళ్ల కోసం గాలింపు ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు మీనా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి చింతామణి కొత్త ప్లాన్ వేసినా, ఆమె మోసం గ్రహించిన కస్టమర్లు మళ్లీ మీనాకే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో మీనా-చింతామణి మధ్య పోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. మొత్తం మీద రాబోయే ఎపిసోడ్‌లు సస్పెన్స్, డ్రామా, ఎమోషన్‌తో రసవత్తరంగా సాగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X