Gundeninda Gudigantalu May 9th Episode: రోహిణి గుట్టురట్టు, ప్రభావతి షాకింగ్ నిర్ణయం, విల్లా మోసంలో ట్విస్ట్,

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ పూర్తి స్థాయిలో భావోద్వేగాలు, కుటుంబ ఘర్షణలు, షాకింగ్ ట్విస్టులతో సాగింది. ఇంతకాలంగా ఇంట్లో అందరికీ అనుమానంగా ఉన్న 40 లక్షల వ్యవహారం చివరకు పెద్ద బాంబులా పేలింది. బాలు ఒక్కొక్కటిగా నిజాలను బయటపెడుతూ మనోజ్‌, రోహిణిల అసలు రూపాన్ని కుటుంబ సభ్యుల ముందుంచాడు. ముఖ్యంగా మనోజ్ మాజీ ప్రియురాలు కల్పన ఎంట్రీతో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఎపిసోడ్ మొత్తం కోర్ట్‌రూమ్ డ్రామాను తలపించేలా సాగి ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచింది.

ఎపిసోడ్ ప్రారంభం నుంచే బాలు చాలా సీరియస్‌గా కనిపించాడు. "ఆ 40 లక్షలు ఏమయ్యాయి?" అంటూ నేరుగా మనోజ్‌ను ప్రశ్నించడంతో అతడు ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యాడు. ఇంతకాలం కుటుంబ సభ్యులందరినీ మభ్యపెడుతూ వచ్చిన మనోజ్‌, ఈసారి మాత్రం బాలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడిపోయాడు. పరిస్థితిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన రోహిణి వెంటనే "సాక్ష్యం ఏంటి?" అంటూ బాలును నిలదీయడానికి ప్రయత్నించింది. కానీ బాలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా "సాక్ష్యం మాత్రమే కాదు.. సాక్ష్యం చెప్పేవాళ్లు కూడా వస్తారు" అంటూ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. అదే సమయంలో "మనోజ్ మాజీ ప్రేయసి కల్పన వస్తుంది" అని చెప్పడంతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 680 May 9th 2026 here is full story

Photo courtesy jiohotstar

కల్పన పేరు వినగానే మనోజ్‌, రోహిణిల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. కల్పన కెనడాలో ఉందని, ఇండియాకు రాదని మనోజ్ చెప్పినా.. బాలు మాత్రం ఆమె ఇప్పటికే ఇండియాకు వచ్చిందని, నిజాలు బయటపెట్టేందుకే వస్తోందని చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక బాలు "కల్పన.. లోపలికి రా" అని పిలవగానే ఆమె ఇంట్లోకి అడుగుపెట్టడం ఎపిసోడ్‌లో అత్యంత కీలక సన్నివేశంగా నిలిచింది.

ఇంట్లోకి వచ్చిన కల్పన ముందుగా సత్యం, ప్రభావతిల వద్దకు వెళ్లి క్షమాపణలు కోరింది. "మీ డబ్బులు తీసుకెళ్లినందుకు క్షమించండి" అంటూ బాధపడింది. అయితే సత్యం మాత్రం తీవ్ర ఆవేదనతో స్పందించాడు. "అది నా జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు.. ఒక్కసారి సారీ చెప్పేస్తే సరిపోతుందా?" అంటూ ఆవేశపడిపోయాడు. ప్రభావతి కూడా కల్పనపై తీవ్ర స్థాయిలో మండిపడింది. "నా కొడుకుని మోసం చేసి డబ్బులు తీసుకెళ్లావ్.. నీకు అసలు మనసుందా?" అంటూ తిడుతూ అవమానించింది. అయితే అక్కడే కథ అసలు మలుపు తిరిగింది. కల్పన ప్రశాంతంగా మాట్లాడుతూ "నేను తీసుకెళ్లిన డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశాను. 40 లక్షలు కాదు.. 45 లక్షలు ఇచ్చాను" అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్‌కు గురయ్యారు. ప్రభావతి ఆశ్చర్యంగా "ఎవరికి ఇచ్చావ్?" అని అడగగా, "మీ కొడుకు మనోజ్‌, మీ కోడలు రోహిణికే ఇచ్చాను. పైగా వడ్డీ పేరుతో మరో 5 లక్షలు కూడా తీసుకున్నారు" అని చెప్పడంతో రోహిణి కంగుతిన్నది.

ఇంతకాలం నిజాన్ని దాచిపెట్టిన మనోజ్‌, రోహిణిల అసలు రూపం బయటపడుతుండటంతో ఇంట్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. రోహిణి మాత్రం ఇదంతా బాలు ఆడుతున్న నాటకమని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ కల్పన దగ్గర ఉన్న సాక్ష్యాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. పోలీస్ స్టేషన్‌లో జరిగిన సెటిల్మెంట్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చూపిస్తూ "45 లక్షలు ఇచ్చినట్లు ఇందులో రికార్డు ఉంది" అని చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ చూసిన రవి కూడా అవి నిజమేనని చెప్పడంతో మనోజ్‌, రోహిణిలకు షాక్ మీద షాక్ తగిలింది. అయినా కూడా మనోజ్ చివరి వరకు అబద్ధాలతో బయటపడేందుకు ప్రయత్నించాడు. "ఇవి ఫేక్ డాక్యుమెంట్స్" అంటూ మాటలు మార్చాడు. దీంతో కల్పన కూడా గట్టిగానే స్పందిస్తూ "పోలీసులను పిలవమంటావా? నీ అసలు బాగోతం మొత్తం బయటపెడతా" అంటూ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బయటకు రావడంతో మనోజ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఆ డబ్బులు నిజంగానే అతడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయినట్టు తేలిపోవడంతో కుటుంబ సభ్యులంతా కోపంతో ఊగిపోయారు.

ఈ సమయంలో రవి కూడా తన సహనాన్ని కోల్పోయాడు. "45 లక్షలు ఏం చేశావురా? ఎందుకు అమ్మా నాన్నలను మోసం చేశావ్?" అంటూ మనోజ్‌ను తీవ్రంగా నిలదీశాడు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే రవి కూడా ఈసారి ఆగ్రహంతో మాట్లాడడం ప్రేక్షకులను ఎమోషనల్ చేసింది. మరోవైపు శృతి కూడా రోహిణిపై విరుచుకుపడింది. "ఆలుమగల్లో ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు ఆపాలి. కానీ మీరు మాత్రం తోడుదొంగల్లా మారిపోయారు" అంటూ ఘాటుగా ప్రశ్నించింది. అయితే అసలు భావోద్వేగ సన్నివేశం మీనా మాటలతో మొదలైంది. "అత్తగారు.. అప్పట్లో 25 లక్షలు రోహిణి వాళ్ల నాన్న ఇచ్చాడని నన్నెంత అవమానించారో గుర్తుందా? ఇప్పుడు అసలు నిజం బయటపడింది కదా" అంటూ ప్రభావతిని ప్రశ్నించింది. దీంతో ప్రభావతి పూర్తిగా కుంగిపోయింది. ఇంతకాలం నిజమని నమ్మిన ప్రతి విషయం అబద్ధమని తెలుసుకుని ఆమె ఆవేదనకు గురైంది.

సత్యం అయితే తీవ్రంగా ఎమోషనల్ అయ్యాడు. "కన్న తండ్రిని మోసం చేయాలనిపించిందా? నువ్వు నా కొడుకనే చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది" అంటూ మనోజ్‌పై ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇంట్లో ఉన్న వారందరూ కంగుతిన్నారు. సత్యం కళ్లలో కనిపించిన బాధ ప్రేక్షకుల హృదయాలను కూడా కదిలించింది. ఇక చివరకు మనోజ్ కూడా నిజం ఒప్పుకోక తప్పలేదు. "ఇదంతా రోహిణి ప్లాన్" అంటూ భార్యపైనే నెపం మోపాడు. డబ్బుల విషయం ఇంట్లో చెబితే తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, రోహిణే అబద్ధం చెప్పమని చెప్పిందని వెల్లడించాడు. దీంతో అందరి చూపులు ఒక్కసారిగా రోహిణిపై పడ్డాయి. ఇంతకాలం అమాయకంగా నటించిన ఆమెనే అసలు మాస్టర్‌మైండ్ అని తెలిసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

ఈ నిజం తెలుసుకున్న ప్రభావతి పూర్తిగా ఆగ్రహంతో ఊగిపోయింది. "నా భర్త కష్టార్జితాన్ని వాడుకుని నన్నే మోసం చేస్తావా?" అంటూ రోహిణిపై విరుచుకుపడింది. చెంపలు వాయిస్తూ తీవ్రంగా అవమానించింది. రోహిణి మాత్రం చివరి వరకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ "షాప్ పెట్టాక నిజం చెబుదామని అనుకున్నాం" అంటూ కొత్త కథలు చెప్పింది. కానీ ప్రభావతి మాత్రం ఏమాత్రం నమ్మలేదు. ఎపిసోడ్ చివర్లో మనోజ్‌, రోహిణిల మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. "నువ్వు నా కోసం నిలబడలేదు" అంటూ రోహిణి మనోజ్‌పై మండిపడగా.. "నువ్వు తప్పు చేశావ్ కాబట్టే మాట్లాడలేకపోయా" అంటూ మనోజ్ చెప్పడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఇంతకాలం కలిసి అందరినీ మోసం చేసిన ఈ జంట ఇప్పుడు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకోవడం కథలో కొత్త మలుపుకు దారి తీసింది.

ఇక అప్కమ్మింగ్ ఎపిసోడ్ లో కుటుంబ బంధాలు, నమ్మకం, మోసం, ఆవేదనల మేళవింపుగా సాగింది. ముఖ్యంగా కల్పన ఎంట్రీ, 45 లక్షల నిజం బయటపడటం, ప్రభావతి ఆగ్రహం, సత్యం భావోద్వేగం ప్రేక్షకులను బాగా కదిలించాయి. ఇక రాబోయే ఎపిసోడ్స్‌లో మనోజ్‌, రోహిణిలను కుటుంబం క్షమిస్తుందా? లేక ఈ విభేదాలు మరింత పెరుగుతాయా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X