Gundeninda Gudigantalu July 11th Episode: మనోజ్‌కు బుద్ది చెప్పిన బాలు.. రోహిణిపై ప్రభావతికి అనుమానం..

Photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో రసవత్తరంగా సాగింది. హాస్పిటల్‌లో తనను అందరి ముందు దొంగలా అవమానించిన మనోజ్‌పై బాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి సాయం చేసినా తనను నమ్మకుండా మాట్లాడాడని బాధపడతాడు. మీనా ఎంత సముదాయించినా బాలు కోపం తగ్గదు. ఇదే సమయంలో మనోజ్ కళ్లకు కట్టిన బ్యాండేజ్ తీయబోతున్నారని తెలుసుకున్న బాలు, నర్సుకు డబ్బులు ఇచ్చి మరో రెండు రోజులు బ్యాండేజ్ విప్పొద్దని ఒప్పిస్తాడు. నర్సు అదే విషయాన్ని మనోజ్‌కు చెప్పడంతో అతడు భయంతో పాటు అనుమానాలకు గురవుతాడు.

ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాలు తన చిలిపి పనులతో మనోజ్‌ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. గేట్‌కు ఢీకొని పడిపోయిన మనోజ్‌కు హారతి ఇస్తున్న సమయంలో కూడా బాలు సరదాగా పళ్లెం పైకెత్తడంతో మనోజ్ చేయి కాలుతుంది. తర్వాత టిఫిన్‌లో ఇడ్లీకి పచ్చిమిర్చి పెట్టి అతడిని మరింత ఆట పట్టిస్తాడు. దీంతో మనోజ్ ప్రతి ఘటన వెనుక బాలు, మీనాలే ఉన్నారని ఆరోపిస్తూనే ఉంటాడు. హాస్పిటల్ బిల్లుల్లో కూడా వారు మోసం చేసి డబ్బులు దోచుకున్నారని రోహిణితో అనుమానాలు వ్యక్తం చేస్తాడు. అయితే రోహిణి మాత్రం అతడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 725 May 11th 2026 here is full story

photo courtesy jiohotstar

మరోవైపు రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఆమె తల్లి శోభన ఆగ్రహానికి గురవుతుంది. కోడలు బయట కష్టపడుతుంటే అత్తమామలు ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటని రవిని నిలదీస్తుంది. కానీ శ్రుతి మాత్రం ఈ ఉద్యోగం తన ఇష్టంతో చేస్తున్నానని, కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దని తల్లికి గట్టిగా చెబుతుంది. రవి కూడా తాము ఎప్పుడూ శ్రుతిని ఉద్యోగం చేయమని బలవంతం చేయలేదని స్పష్టం చేస్తాడు. చివర్లో మురళీ-విద్య మధ్య సాన్నిహిత్యం పెరిగే సన్నివేశాలు ఆకట్టుకోగా, మనోజ్ మరోసారి బాలు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నాడని ప్రభావతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రభావతి ఈసారి కొడుకుకే గట్టిగా క్లాస్ తీస్తుంది. చివరగా పాటలు వినాలనుకున్న మనోజ్ ఫోన్‌ను దూరంగా పెట్టి బాలు చేసిన అల్లరి నవ్వులు పూయిస్తూ ఎపిసోడ్‌కు ముగింపు పలికింది.

రాబోయే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మనోజ్‌కు తిరిగి చూపు రావడంతో ఇంట్లో సంతోష వాతావరణం నెలకొనగా, మరోవైపు అతడి అనుమానాలు మాత్రం ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇదే సమయంలో ప్రభావతి తీసుకోబోయే ఒక నిర్ణయం కథను మరో ఆసక్తికరమైన మలుపు తిప్పనుండగా, మీనా జీవితంలో కూడా భారీ వ్యాపార అవకాశం రావడంతో పాటు కొత్త సమస్యలు ఎదురుకానున్నాయి.

మనోజ్‌కు కళ్ల చూపు తిరిగి వచ్చినా అతడి మనసులోని అనుమానాలు మాత్రం అలాగే కొనసాగుతాయి. తన ఆపరేషన్‌కు అయిన ఖర్చు విషయంలో బాలు, మీనా నిజాయితీగా వ్యవహరించలేదని అతడు ఇంకా నమ్ముతూనే ఉంటాడు. వాళ్లు నకిలీ లెక్కలు చూపించి డబ్బులు దాచుకున్నారని రోహిణితో చర్చిస్తూ, ఎలాగైనా ఆ డబ్బుల వ్యవహారాన్ని బయటపెడతానని చెబుతాడు. తాను ఒక్క రూపాయి కూడా వాళ్లకు బాకీ ఉండకూడదని, ఎంత ఖర్చయిందో అంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని మనోజ్ పట్టుదలగా కనిపిస్తాడు.

ఇక ఇంట్లో వరుసగా జరుగుతున్న సంఘటనలతో ప్రభావతి తీవ్ర ఆందోళనకు గురవుతుంది. కొడుకు ప్రమాదం, కుటుంబంలో పెరుగుతున్న విభేదాలు, ఇంట్లో నెలకొన్న అశాంతి ఆమెను మానసికంగా కలవరపెడతాయి. దీంతో దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని భావించిన ప్రభావతి గుడికి వెళ్తుంది. అక్కడ ఆమెకు మీనాక్షి ఎదురవుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా మనోజ్ ప్రమాదం గురించి ప్రభావతి బాధతో వివరిస్తుంది.

ఈ క్రమంలో మీనాక్షి ఆపరేషన్ ఖర్చు గురించి ప్రశ్నిస్తుంది. "మనోజ్ ఆపరేషన్‌కు డబ్బులు ఎవరు చెల్లించారు?" అని అడగగా, ప్రభావతి పెద్దగా పట్టించుకోకుండా "బాలు, మీనా కట్టారులే" అన్నట్టుగా సమాధానం చెబుతుంది. అయితే మీనాక్షి మాత్రం ప్రభావతికి గట్టిగానే బుద్ధి చెబుతుంది. "నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసే బాలు, మీనాలే అవసరమైన సమయంలో కుటుంబం కోసం నిలబడ్డారు. ఇంటి బాధ్యత అంటే ఏంటో వాళ్లు చేసి చూపించారు. కనీసం ఇప్పటికైనా వాళ్ల మంచితనం అర్థం చేసుకో" అని హితవు పలుకుతుంది. అయినప్పటికీ ప్రభావతి మాత్రం తన మనస్తత్వాన్ని మార్చుకోకుండా ఆ మాటలను పట్టించుకోకుండా మాట్లాడుతుంది.

వీరిద్దరి సంభాషణను గమనించిన గుడి పూజారి వారి వద్దకు వస్తాడు. ప్రభావతి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను గమనించి కారణం అడుగుతాడు. జరిగిన విషయాన్ని విన్న పూజారి ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాడు. "రేపు హిమాలయాల నుంచి ఒక మహానుభావుడు, సాధువు ఇక్కడికి వస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ నిజమవుతాయి. మీ కొడుకు, కోడలి జాతకాలు తీసుకొచ్చి చూపించండి. ఏవైనా దోషాలు ఉంటే పరిహారాలు కూడా చెబుతారు" అని సూచిస్తాడు. పూజారి మాటలు విన్న ప్రభావతి వెంటనే మరుసటి రోజు మనోజ్, రోహిణి జాతకాలు తీసుకుని వస్తానని మాట ఇస్తుంది. దీంతో ఈ సాధువు చెప్పే మాటలు కథలో ఎలాంటి సంచలనాలకు దారి తీస్తాయో అనే ఆసక్తి నెలకొంటుంది.

మరోవైపు బాలు వేసిన ప్లాన్ ప్రకారం రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నర్స్ ఇంటికి వచ్చి మనోజ్ కళ్లకు కట్టిన బ్యాండేజ్‌ను తొలగిస్తుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మనోజ్‌కు తిరిగి చూపు రావడంతో ఇంట్లో అందరూ ఆనందంలో మునిగిపోతారు. ముఖ్యంగా సత్యం తన కొడుకు మళ్లీ చూడగలగడం చూసి భావోద్వేగానికి గురవుతాడు. అయితే మనోజ్ మాత్రం ముందుగా తన తల్లి ప్రభావతి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

ఇంతలో గుడి నుంచి ఇంటికి చేరుకున్న ప్రభావతి తన కొడుకు కళ్లతో చూస్తుండటం చూసి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. దేవుడి కృప వల్లే ఇది సాధ్యమైందని భావిస్తూ వెంటనే గుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించాలని చెబుతుంది. అదే సమయంలో గుడిలో పూజారి చెప్పిన విషయాన్ని కూడా మనోజ్‌కు వివరిస్తుంది. "నీ జాతకాన్ని ఒకసారి ఆ సాధువుకు చూపిద్దాం. ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుందాం" అని చెప్పగా మనోజ్ కూడా వెంటనే అంగీకరిస్తాడు. "మన జీవితంలో వరుసగా ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసుకోవాలి. అవసరమైతే పరిహారాలు కూడా చేద్దాం" అని అంటాడు. దీంతో సాధువు చెప్పబోయే విషయాలు కథలో కీలకంగా మారనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మీనా వ్యాపారం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. ఆమె కష్టానికి గుర్తింపుగా ఈసారి దాదాపు రూ.10 లక్షల విలువైన భారీ ఆర్డర్ వస్తుంది. అయితే కస్టమర్లు అడ్వాన్స్‌గా కేవలం 10 శాతం మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన పనులు పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. డబ్బు కోసం ఎవరిని ఆశ్రయించాలో అర్థంకాక మీనా తీవ్ర ఆలోచనలో పడుతుంది.

ఆ సమయంలో ఆమెకు బ్యాంక్ లోన్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇప్పటికే తన పేరుతో అకౌంట్, చెక్‌బుక్ ఉండటంతో సులభంగా లోన్ వస్తుందని భావించి బ్యాంకుకు వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఊహించని షాక్ ఎదురవుతుంది. బ్యాంకు అధికారులు తాకట్టు పెట్టడానికి ఆస్తి లేదా సరైన సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తారు. "అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈజీగా లోన్ వస్తుందని చెప్పారు కదా" అని మీనా ప్రశ్నించినా, బ్యాంకు నిబంధనల ప్రకారం సెక్యూరిటీ లేకుండా రుణం మంజూరు చేయలేమని అధికారులు తేల్చి చెబుతారు. దీంతో నిరాశతో మీనా అక్కడి నుంచి వెనుదిరుగుతుంది.

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె తమ్ముడు శివ అక్క బాధను గమనించి కారణం అడుగుతాడు. జరిగిన విషయం మొత్తం చెప్పిన మీనాకు ధైర్యం చెబుతూ, "నాకు తెలిసిన వాళ్లు ఉన్నారు. చాలా తక్కువ వడ్డీకి అప్పు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు" అని భరోసా ఇస్తాడు. శివ సహాయం మీనాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అతడు చెప్పిన వ్యక్తులు నిజంగానే సాయం చేస్తారా? లేక ఈ నిర్ణయం కొత్త సమస్యలకు దారి తీస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

మొత్తానికి రాబోయే ఎపిసోడ్‌లో ప్రభావతి మనోజ్-రోహిణి జాతకాలు తీసుకుని హిమాలయాల నుంచి వచ్చిన సాధువును కలవడం, సాధువు చెప్పే మాటలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు భారీ బిజినెస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీనా చేసే ప్రయత్నాలు, ఆమెకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి. ఈ పరిణామాల మధ్య రోహిణి అసలు బాగోతం బయటపడుతుందా? సాధువు చెప్పే జాతక రహస్యాలు కుటుంబంలో కొత్త తుఫాన్‌కు కారణమవుతాయా? అన్నది తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్‌ను తప్పక చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X