Gundeninda Gudigantalu July 25th Episode: సుందరి పెళ్లిలో అడ్డంగా బుక్కైన మేకమామ.. రోహిణిని బాగోతం పడినట్టేనా?

Courtesy: jiohotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ పుట్టినరోజు వేడుకలు ఇంట్లో ఉద్రిక్తతకు దారితీశాయి. బాలు స్నేహితుడు రాజేష్‌ను మనోజ్ అవమానించడంతో బాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతిథులను గౌరవించలేదని మనోజ్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ సమయంలో మనోజ్, "జైలుకు వెళ్లడం నీకు కొత్త కాదు" అని బాలును రెచ్చగొట్టాడు. ఆ మాట విన్న బాలు తన చిన్ననాటి బాధను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కోపంతో వంటగదిలో నుంచి కత్తి తీసుకుని మనోజ్‌పైకి వెళ్లాడు. వెంటనే మీనా, రవి, శృతి అడ్డుకున్నారు. సత్యం వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాడు.

జరిగిన విషయాన్ని రవి వివరించగా, సత్యం మనోజ్‌ను గట్టిగా ప్రశ్నించాడు. బాలు అన్యాయంగా శిక్ష అనుభవించిన విషయం గుర్తు చేసి అతడిని నిలదీశాడు. ప్రభావతి కూడా మనోజ్ చిన్నప్పుడు చేసిన తప్పును ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పింది. ఆ తర్వాత సత్యం బాలును శాంతింపజేసి కుటుంబంలో గొడవలు వద్దని సూచించాడు. తర్వాత శృతి ఇంట్లో అందరూ కలిసిపోవాలని ఒక సరదా గేమ్ ప్లాన్ చేసింది. మీనా, బాలు, రవి, రోహిణి, మనోజ్ అందరూ అందులో పాల్గొన్నారు. ఒకరు చూపిన డ్యాన్స్ స్టెప్‌ను మరొకరు చెప్పే గేమ్‌లో చివరకు మనోజ్ పూర్తిగా మార్చి చూపించాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 735 July 25th 2025 here is full story
Courtesy: jiohotstar

అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. పుకార్లు ఎలా మారిపోతాయో రవి ఆ గేమ్ ద్వారా వివరించాడు. చాలా రోజుల తర్వాత బాలు, మనోజ్ కలిసి నవ్వుకోవడం కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించింది. గేమ్ ముగిసిన తర్వాత బాలు అందరి ముందే మీనాను ఎత్తుకుని తీసుకెళ్లడం హైలైట్‌గా నిలిచింది. మరోవైపు మనోజ్‌కు రోహిణి ప్రత్యేక పూజలు చేయించానంటూ ఒక తాయత్తు కట్టింది. కానీ అది కేవలం రూ.20 విలువైన తాయత్తు అని ప్రేక్షకులకు చూపించారు. చివర్లో మనోజ్ తమకు పిల్లలు కావాలని తన కోరిక చెప్పాడు. రోహిణి బయటకు అంగీకరించినట్లు నటించింది. సుందరి పెళ్లి నేపథ్యంలో కొత్త ట్విస్టులకు కథ సిద్ధమవుతూ ఎపిసోడ్ ముగిసింది.

రాబోయే ఎపిసోడ్ భారీ ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయనుంది. ఇన్నాళ్లుగా రోహిణి ఎంతో తెలివిగా దాచిపెట్టిన రహస్యం సుందరి పెళ్లి వేడుకలో బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మలేషియా నుంచి వచ్చాడని అందరికీ పరిచయం చేసిన మామయ్య అసలు ఎవరో తెలిసిపోవడంతో ఇంట్లో పెద్ద దుమారం చెలరేగబోతోంది. సుందరి పెళ్లికూతురు వేడుకకు ప్రభావతి కుటుంబ సభ్యులంతా ఆనందంగా బయలుదేరుతారు. అందరూ కొత్త దుస్తుల్లో ముస్తాబై ఫంక్షన్‌కు చేరుకుంటారు. మీనా పూల అలంకరణ బాధ్యతలు చూసుకుంటుండగా, రోహిణి మాత్రం సుందరి మేకప్ చూసుకుంటూ బిజీగా ఉంటుంది. మరోవైపు బాలు, మీనా, సత్యం, రవి, శృతి, మనోజ్, ప్రభావతి అందరూ వేడుకలో పాల్గొంటారు. బయటకు అంతా ప్రశాంతంగా కనిపించినా.. రోహిణి మాత్రం ఏదో జరగబోతుందనే టెన్షన్‌తో కనిపిస్తుంది.

ఇంతలో బాలు.. "మావయ్య.. నాన్న మీతో మాట్లాడాలంటున్నారు" అంటూ రంగాను పిలుస్తారు. సత్యం ప్రేమగా కొంత డబ్బు తీసి అతడి చేతిలో పెట్టి.. "సుందరి నాకు కూడా కూతురే. ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకో" అని చెబుతాడు. ఈ దృశ్యం చూస్తున్న ప్రభావతి మాత్రం అనుమానంగా అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఆమె వైఖరిని చూసిన శృతి.. "ఆంటీకి ఎప్పుడూ ఏదో ఒక అనుమానం ఉంటుంది" అంటూ సెటైర్లు వేస్తుంది. పెళ్లి కార్యక్రమం ప్రారంభం కావడంతో అందరూ అక్షింతలు వేయడానికి వరుసగా వెళ్తారు.

అదే సమయంలో రోహిణి ఎంతో భయపడుతున్న వ్యక్తి కూడా అక్కడికి చేరుకుంటాడు. అతడే మలేషియా మామయ్యగా అందరికీ పరిచయం చేసిన వ్యక్తి. నిజానికి అతడే మటన్ కొట్టు మాణిక్యం. అతడిని చూసిన రోహిణి ముఖంలో ఒక్కసారిగా టెన్షన్ కనిపిస్తుంది. "ఇప్పుడేమైనా జరిగిపోతుందా?" అన్న ఆందోళనతో దూరం నుంచే అతడిని గమనిస్తుంది. అయితే అక్షింతలు వేయడానికి వెళ్లిన సమయంలో మాణిక్యం ఎదురుగా బాలు, మీనా నిలబడతారు. వారిద్దరినీ చూసిన మాణిక్యం కూడా ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. బాలు మాత్రం అతడిని చూసిన వెంటనే అనుమానం నిజమైందని భావిస్తాడు. వెంటనే అతడి కాలర్ పట్టుకుని పక్కకు లాక్కెళ్లి ప్రశ్నలు వేస్తాడు.

"నువ్వు నిజంగా మలేషియా నుంచి వచ్చావా? మొదటి నుంచే నీ మీద నాకు అనుమానం ఉంది. అసలు నువ్వు ఎవరు? మా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు?" అంటూ బాలు నిలదీస్తాడు. బాలు ప్రశ్నలకు తట్టుకోలేకపోయిన మాణిక్యం చివరకు నిజం చెప్పేందుకు సిద్ధమవుతాడు. "నేను మలేషియా నుంచి రాలేదు. నేను రోహిణి మామయ్యను కూడా కాదు. నేను మటన్ కొట్టు మాణిక్యం" అని చెప్పడంతో అక్కడున్న బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రవి, శృతి కూడా ఆ మాటలు విని అవాక్కవుతారు. ఇన్నాళ్లు రోహిణి చెప్పిన కథ అంతా అబద్ధమేనని వారికి అర్థమవుతుంది.

కొద్దిసేపటికే సత్యం, ప్రభావతి కూడా అక్కడికి చేరుకుంటారు. "నిజం చెప్పు.. నువ్వు ఎవరు?" అని గట్టిగా ప్రశ్నించగా.. "నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని" అని మళ్లీ చెబుతాడు. ఆ సమాధానం విన్న ప్రభావతి, సత్యం ఇద్దరూ షాక్‌లో నిలిచిపోతారు. మరోవైపు రోహిణి మాత్రం ఏం చేయాలో అర్థంకాక భయంతో వణికిపోతుంది. "అంటే ఇన్నాళ్లు మలేషియా మామయ్య అని చెప్పింది అంతా అబద్ధమా? మమ్మల్ని ఇలా మోసం చేశావా?" అంటూ ప్రభావతి ఆవేదన వ్యక్తం చేస్తుంది.

సత్యం కూడా తీవ్ర ఆగ్రహంతో రోహిణిని ప్రశ్నించబోతాడు. మీనా సైతం.. "మామయ్య కాకపోతే ఇతను ఎవరు? ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావు? అసలు నీ ఉద్దేశం ఏంటి?" అంటూ నిలదీస్తుంది. ఇప్పటికే రోహిణి అల్లిన అబద్ధాల వల ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్న నేపథ్యంలో.. ఆమె అసలు నిజం ఒప్పుకుంటుందా? లేక మరో కొత్త అబద్ధంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? మాణిక్యం మొత్తం నిజం బయటపెడతాడా? రోహిణి బాగోతం సుందరి పెళ్లిలోనే అందరికీ తెలిసిపోతుందా? ప్రభావతి పరిస్థితి ఏంటీ? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే ఆసక్తికర పరిణామాలతో రాబోయే ఎపిసోడ్ సాగనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X