Gunde Ninda Gudi Gantalu october 4th: సహయం చేయడానికి సుమతి గ్రీన్ సిగ్నల్.. తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వ

Gunde Ninda Gudi Gantalu october 4th: బుల్లితెరపై ప్రసారమవుతోన్న సీరియళ్లకు రోజురోజుకు మంచి ఆదరణ వస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ సక్సెస్ పుల్ గా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో సురేంద్ర .. సత్యం ను తన ఆఫీస్ కు పిలిచి తన కొడుకు రవి గురించి చెబుతాడు. తన కూతురికి పెళ్లి సెట్ అయ్యిందనీ, తన కూతురు జోలికి వస్తే.. మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తాడు సురేంద్ర. తన కొడుకు అలాంటి వాడు కాదని, నిశ్చితంగా పెళ్లి ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతాడు సత్యం. ఈ విషయాన్ని బాలు, మీనాలకు చెబుతాడు. ఆ విషయాన్ని తాను చూసుకుంటాననీ, ఎవరూ ఈ మ్యాటర్ ఇన్వాల్వ్ కాకుండదనీ చెప్పుతాడు. మరోవైపు మీనా చెల్లెలు సుమతికి ఫోన్ చేసి తన లవ్ మేటర్ మాట్లాడాలని, తన ఇంటి పక్కన ఉన్న శివాలయానికి కావాలని రిక్వెస్ట్ చేస్తాడు రవి.

Gunde Ninda Gudi Gantalu Serial October 4th Episode

ఇక నేటీ(శుక్రవారం) ఎపిసోడ్ లో.. రవి రిక్వెస్ట్ చేయడంతో సుమతి శివాలయానికి వస్తోంది. తాను శృతిని ప్రేమిస్తున్నానని, ఈ విషయం ఇంట్లో తెలిస్తే తమ పెళ్లినీ అడ్డుకుంటారని, ఎలాగైనా తనని సహాయం చేయాలని సుమతిని రిక్వెస్ట్ చేస్తాడు రవి. దీంతో షాక్ అయినా సుమతి తాను ఎలాంటి సహాయం చేయలేనని, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య విషయం కాదని, రెండు కుటుంబాలకు సంబంధించిన విషయమని తెగేసి చెబుతుంది. ఒకవేళ తాను సహాయం చేసినట్టు తెలిస్తే.. తన అక్క మీనా జీవితం కూడా చిక్కుల్లో పడుతుందని, జీవితాంతం తమ కుటుంబాన్ని వేలేస్తారని, తనని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దని సుమతి అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది.

కానీ, రవి మాత్రం .. తనకు నువ్వు తప్ప సహాయం చేసేవారు లేరని, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే.. తాను, శృతి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉందని, శ్రుతి లేకుండా తాను జీవించలేనని, తన లైఫ్ నీ చేతుల్లో పెడుతున్నానని రవి ప్రాధేయపడతాడు. ఇంతలోనే రవికి శృతి ఫోన్ చేసి సుమతిని కలిసావా అంటూ అడుగుతుంది. సుమతి తన పక్కనే ఉన్న అంటూ ఫోను సుమతికి ఇస్తాడు రవి. ఈ సమయంలో నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరనీ, రవిని తప్ప తను ఎవరిని పెళ్లి చేసుకోనని, తమ పెళ్ళికి పేరెంట్స్ జీవితంలో ఒప్పుకోరని, ఈ విషయంలో నువ్వు తప్ప ఎవరు సహాయం చేయలేరని సహాయం చేయకపోతే చావే దిక్కని ఎమోషనల్ అవుతుంది శృతి.

Gunde Ninda Gudi Gantalu Serial October 4th Episode

దిక్కుతోచని పరిస్థితిలో సరే ఏం చేయాలో అంటూ సుమతి అడగగా.. తన స్కూల్ ఫ్రెండ్ గా ఇంటికి రమ్మని, ఇంటికి వచ్చాక ఏం చేయాలో పూర్తిగా చెప్తానని సుమతికి శృతి చెబుతోంది. రవి కూడా సుమతిని ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చెబుతాడు. తన కోసం ఇదొక సహాయం చేయటం సుమతి చేతులు పట్టుకొని ప్రాధేయపడతాడు రవి. తప్పించుకోలేని పరిస్థితుల్లో సహాయం చేస్తానని సుమతి వారికి మాట ఇస్తుంది.

సుమతి చిన్ననాటి ఫ్రెండ్ గా ఇంటికి శ్రుతి వెళ్తుంది. శృతి తల్లి శోభన నానా ప్రశ్నలు అడుగు శృతిని కలవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత శృతి వచ్చి సుమతిని తన గదిలోకి తీసుకెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెబుతుంది. తనకు రెండు రోజుల్లో పెళ్లి అని, ఎలాగైనా బయటికి తీసుకెళ్లమంటూ ప్రాధేయపడుతుంది. సుమతి చేతిలో ఉన్న పెళ్లి కార్డును చూసిన శృతి వెంటనే ఓ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఆ పెళ్లి కార్డు తనదేనని, పెళ్లికి పిలవడానికి నా దగ్గరికి వచ్చానని తన పేరెంట్స్ చెప్పమని ప్లాన్ ఇస్తుంది శృతి.

Gunde Ninda Gudi Gantalu Serial October 4th Episode

శ్రుతి చెప్పినట్టుగానే.. సుమతి వారికి కార్డు ఇచ్చి.. శ్రుతిని తప్పకుండా పెళ్లికి పంపించాలంటూ చెప్పి వెళ్లిపోతుంది సుమతి. తన చిన్ననాటి ఫ్రెండు తన పెళ్లికి పిలవడానికి ఇంటికి వచ్చిందని, తాను కచ్చితంగా తన పెళ్లికి వెళ్తానని శృతి చెబుతోంది. వెంటనే రియాక్ట్ అయిన శోభన ఎవరి పెళ్లి వెళ్లాల్సిన అవసరం లేదని వార్నింగ్ ఇస్తుంది శోభన. మీకు డబ్బున్న అహంకారం బాగా ఎక్కువైపోయింది. తాను కచ్చితంగా పెళ్లికి వెళ్తానని తెగేసి చెబుతుంది శృతి. వెంటనే తన తల్లి శోభన సీరియస్ అయి సంజు తో పెళ్లి అయ్యేంతవరకు ఎక్కడికి వెళ్లే ప్రయత్నాలు చేయకంటూ వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు.. బాలు తనకు గిరాయి వచ్చిందనీ, తాను రెండు రోజులు బయటకు వెళ్తున్నానని మీనాకు చెప్పాడు. కానీ, మీనాకు బాలు బయటకు వెళ్లడం ఇష్టం లేదు. ఈ క్రమంలో రవిపై ఓ కన్నేసి ఉండంటూ మీనాకు చెప్పి వెళ్లాడు బాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X