Gunde Ninda Gudi Gantalu oct 5th:పెళ్లి ఏర్పాట్లలో సుమతి..రవి తలకు గాయం..మరీ పెళ్లి ప్లాన్ వర్కవుట్ అయ్యేనా?

Gunde Ninda Gudi Gantalu october 5th: బుల్లితెరపై ప్రసారమవుతోన్న సీరియళ్లకు రోజురోజుకు మంచి ఆదరణ వస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ సక్సెస్ పుల్ గా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' శనివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో రవి, శ్రుతిలు తన ప్రేమ పెళ్లి విషయంలో సుమతిని సహాయం చేయాలని ప్రాదేయపడుతారు. తనని ఇరకటంతో పడేసే సరికి సుమతి కూడ అంగీకారం తెలుపుతోంది. పెళ్లి ప్లాన్ లో భాగంగా శ్రుతి వాళ్ల ఇంటికి వెళ్లిన సుమతి.. మరో రెండు రోజుల్లో తన పెళ్లి ఉండదనీ, శ్రుతిని తప్పకుండా పెళ్లికి పంపించాలంటూ శోభనకు కోరుతుంది. కానీ, శోభన మాత్రం ఎవరి పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు .. తనకు గిరాయి వచ్చిందనీ, తాను రెండు రోజులు వేరే ప్రాంతానికి వెళ్తాడు. ఈ క్రమంలో రవిపై ఓ కన్నేసి ఉండంటూ మీనాకు చెప్పి వెళ్లాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu Serial October 5th Episode

ఇక తాజా ఎపిసోడ్ లో శృతి ఇంటికి వెళ్లి వచ్చిన సుమతిని రవి కలిసి అక్కడి పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు. శృతి వాళ్ళ అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్ అని, వాళ్ళు ప్రతి విషయాన్ని అనుమానిస్తున్నారని, అక్కడి నుండి వెళ్లి వచ్చేవరకు తాను చాలా టెన్షన్ పడ్డానని చెబుతోంది సుమతి. ఇంతకీ శృతి ఎలా ఉందని ప్రశ్నించగా.. తను చాలా బాగుందని, తన ఫ్రెండ్స్ కూడా ఈ పెళ్లికి హెల్ప్ చేస్తారని, పెళ్లికి కావాల్సినవన్నీ వాళ్లే తెస్తానని కూడా చెప్పారని అక్కడ సమాచారాన్ని సుమతి చెబుతుంది. మరి బయటికి ఎలా వస్తుందని రవి ప్రశ్నించగా.. ఆ విషయం నాకు తన తెలియదని, కానీ పెళ్లి టైం వరకు కచ్చితంగా అక్కడికి వస్తానని శృతి తనకు చెప్పిందనీరవికి చెబుతుంది.

'ఇంతకీ పెళ్లి ఎక్కడ? ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసులో' అని సుమతి ప్రశ్నించగా.. కాదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళ నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారని బదులిస్తాడు. మరి ఎక్కడ చేసుకుంటారని సుమతి అడగగా.. 'దానికి కూడా నువ్వే సహాయం చేయాలి. మీరు పువ్వులమ్మే కొట్టు పక్కన ఉన్న ఆలయంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం, అందులో ఉన్న పూజారితో మాట్లాడు' అని రవి ప్రాధేయపడతాడు. రవి ప్లాన్ కు షాక్ అయిన సుమతి అక్కడ తన తల్లి ఉంటుందని, తన తల్లి ఆరోగ్యం బాగో లేకపోయినా కచ్చితంగా షాప్ కు వెళ్తుందని, తాను ఉండగా ఏం చేయలేనని సుమతి చెబుతుంది. ఎలాగోలా తాను పెళ్లి ఏర్పాట్లు చేయాలని రవి రిక్వెస్ట్ చేస్తాడు.

సరేలే .. మరి సాక్షి సంతకాలు ఎవరు పెడతారని సుమతి ప్రశ్నించగా.. అప్పటివరకు ఎవరో ఒకరు దొరుకుతారని రవి అంటాడు. దీంతో 'నీకు ఆ దేవుడే దిక్కు' అంటుంది సుమతి. 'ఈ దేవత సహాయం చేస్తుందిగా ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు' అని పొగడ్తాడు రవి. నాకు బిస్కెట్లు ఏమి అవసరం లేదని తన పంతులుతో మాట్లాడతానని, దండలు కూడా తానే తెస్తానని సుమతి హామీ ఇస్తుంది.

'ఏం జరుగుతుందో.. తలుచుకుంటేనే భయం వేస్తుంది. నా వల్ల మీ ఇంట్లో మా అక్కకి అవమానం జరిగిందని మా అమ్మకు తెలిస్తే.. నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా రవి. అయినా నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను' అని సుమతి అనగా.. సమస్య మీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాను అంటూ సుమతికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. సరేలే.. అమ్మని గుడికి రాకుండా చూసుకోవాలి అంటూ సుమతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

తర్వాత రోజు.. తాను గుడికి వెళుతున్నాననీ, తన వదిన కూడా రావాలని రవి కోరగా.. మీనా కూడా వస్తానని చెబుతోంది.దీంతో రవి పెళ్లికి రెడీ అయ్యి.. ఇంట్లో అసలు విషయం చెప్పకుండా.. ఇంటి నుండి బయలుదేరుతుండగా రవి తలకు దెబ్బ తగులుతుంది. దీంతో రవి తండ్రి సత్యం కంగారుపడుతూ.. ఇలా పనిమీద బయటికి వెళ్తూ దెబ్బ తగిలితే, ఆ పని జరగదని కాసేపు కూర్చుని వెళ్ళమని సలహా ఇస్తాడు. ఇక ప్రభావతి కూడా.. ఎప్పుడు లేనిది ఈరోజు బాగా రెడీ అయ్యావ్ ఎక్కడికి అని ప్రశ్నించగా సమాధానం ఇస్తూ బయటకు వస్తాడు.

ఇప్పుడు లేనిది ఇంట్లో అబద్ధం చెప్పి బయటికి వస్తున్నానంటూ మీనా అనగా.. రవి తన మనసులో మాట్లాడుకుంటూ.. సారీ వదిన మీ అందర్నీ మోసం చేస్తున్నానంటూ తనలో తాను ఫీల్ అవుతాడు. మరోవైపు బాలు కూడా ఏదో ప్రమాదం జరగబోతుందని అనిపిస్తుంది. అలాగే.. తన కారుకు పిల్లి అడ్డం రావడంతో ఏదో కీడు జరుగుతుందని కంగారుపడతాడు బాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X