Gunde Ninda Gudi Gantalu october 7th Episode: సంజూను బకరా చేసిన శ్రుతి.. వదినను నమ్మించి మోసం చేసిన రవి
Gunde Ninda Gudi Gantalu october 7th Episode: బుల్లితెరపై ప్రసారమవుతోన్న సీరియళ్లకు రోజురోజుకు మంచి ఆదరణ వస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ సక్సెస్ పుల్ గా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో మీనా చెల్లెలు సుమతికి రవి ఫోన్ చేసి తన ఇంటి పక్కన ఉన్న శివాలయానికి కావాలని రిక్వెస్ట్ చేస్తాడు. తాను శ్రుతి ప్రేమించాననీ, తనను పెళ్లి చేసుకోవడానికి భావిస్తున్నానని, అందుకు తనకు సహాయం చేయాలని సుమతిని ప్రాదేయపడుతారు రవి. శ్రుతి, రవిల ప్లాన్ ప్రకారం.. సుమతి శ్రుతి వాళ్ల ఇంటికి వెళ్లి.. శ్రుతి తన చిన్ననాటి స్నేహితురాలనీ, మరో రెండు రోజుల్లో తన పెళ్లి ఉండదనీ, శ్రుతిని తప్పకుండా పెళ్లికి పంపించాలంటూ శోభనకు కోరుతుంది. కానీ, శోభన మాత్రం ఎవరి పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదని శ్రుతికి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు .. తనకు గిరాయి వచ్చిందనీ, తాను రెండు రోజులు టూర్ కు వెళ్తాడు. ఈ క్రమంలో రవిపై ఓ కన్నేసి ఉండంటూ మీనాకు చెప్పి వెళ్లాడు బాలు.

సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో .. శృతి తప్పించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తన మనసును మార్చుకున్నట్టు తన తల్లి ముందు నటిస్తుంది. ఈ క్రమంలో సంజును పావుగా వాడుకోవాలని శ్రుతి ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. సంజూకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని ఉంది. కానీ తన పేరెంట్స్ తనని పంపించలేదంటూ.. తననైనా బయటకు తీసుకువెళ్లాలని కోరుతుంది శ్రుతి. దీంతో సంజూ రియాక్ట్ అయి.. తనకు కాబోయే భార్యను అడ్డుకునే అర్హత ఎవరికి లేదంటూ.. తానే బయటికి తీసుకెళ్తానని శృతికి హామీ ఇస్తాడు. తాను పుట్టినప్పటి నుంచి ఇంత మంచితనం చూడలేదంటూ సంజూను పొగడ్తలతో ముంచేత్తేస్తుంది శృతి.
మరోవైపు.. మీనా బాలుకు ఫోన్ చేసి.. 'ఎక్కడున్నావ్.. ఏం చేస్తున్నావ్..' అంటూ బాలు బాగోగులు అడుగుతోంది. తాను బాగున్నానీ, అయినా వేరే దేశం వెళ్లినట్టు, ఏండ్లకు ఏండ్లు కనిపించపోయినట్టు అడుగుతున్నావని బాలు డిఫరెంట్ గా ప్రశ్నించగా.. ఎంత తాగావ్ అంటూ నిలదీస్తుంది మీనా. ' తాగితే తాగండి. కానీ, ఒళ్లు మరిచిపోయేంతగా తాగోద్దు. జాగ్రత్తగా ఉండండి' అంటూ సలహా ఇస్తుంది మీనా. ఆ తరువాత ఎప్పుడోస్తారని ప్రశ్నించగా.. ' పనులన్నీ పూర్తి కావాడానికి దాదాపు 2 రోజులు పట్టవచ్చు' సమాధానమిస్తాడు బాలు. ఈ క్రమంలోనే తనకు హోటల్ లోనికి ఆలో లేదంటూ.. కారులో పడుకోవాలని,హోటల్ పుడ్ నచ్చలేదంటూ తన కష్టాలను చెప్పుతూ, మీనాతో మాట్లాడకుంటూ అలానే కారులో పడుకుంటాడు బాలు.
ఆ తరువాత.. రవి తన వదిన మీనాకు ఫోన్ చేసి.. దాబాపైకి రమ్మని పిలుస్తారు. ' ఏదో మాట్లాడాలి అన్నవ్.. ఏమైంది' అంటూ ప్రశ్నిస్తుంది మీనా. శ్రుతి మ్యాటర్ చెప్పతాడు. శ్రుతి వాళ్ల ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనీ, ఆమె తనపై ఎన్నో ఆశలు పెట్టుకుందని ఎలాగైనా శ్రుతితో మాట్లాడి.. తనకు ధైర్యం చెప్పాలనీ, తనను రేపు గుడికి తీసుక వస్తానంటూ చెప్పుతాడు రవి. దీంతో షాక్ అయినా మీనా.. మీ లవ్ మ్యాటర్ లోకి తనని ఇన్వాల్వ్ చేయొద్దనీ, బాలు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారంటూ, తాను ఎలాంటి సహాయం చేయలేనని చెబుతోంది మీనా.
తనకు కూడా ఇంట్లో పరిస్థితి తెలుసుననీ, వాళ్ల పేరెంట్స్ తననీ ఇబ్బంది పెడుతున్నారనీ, దీంతో శృతి భయపడి పెళ్లికి ఎక్కువ తొందర పెడుతోందని రవి చెబుతాడు. 'ఎంత చెప్పినా.. ఎలా చెప్పినా.. మీ అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. మీ రెస్టారెంట్ వచ్చి ఎలా గొడవ పడ్డారో.. నీకు గుర్తుంది కదా మళ్ళీ అడిగితే నన్నేమంటారో ఒక్కసారి గుర్తు చేసుకో.. మీ నాన్నగారు నిన్ను చాలా నమ్ముతున్నారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో' అంటూ మీనా సలహా ఇస్తోంది రవికి. ఈ సమాధానంతో రవి సైలెంట్ అయిపోతాడు. దీంతో మీనా..'ఎదురుచూడండి రవి. ఇద్దరూ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. మాత్రం పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ ఉండవు' వార్నింగ్ ఇస్తుంది.
'ఏం లేదు వదిన. తాను అలాంటి పనులు చేయననీ, కానీ, రేపు నువ్వు గుడికి రావాలి. ఎలాగైనా శృతిని నువ్వే ఒప్పించాలని వదిన' అంటూ మీనాను రవి రిక్వెస్ట్ చేస్తాడు. 'అది కూడా నాకు తప్పుగానే అనిపిస్తుంది. కానీ, నువ్వు మీ నాన్న గురించి, అన్నయ్య గురించి ఆలోచించి తొందరపడటం లేదు. కాబట్టి, నేను నీకు సహాయం చేస్తాను. అంటూ మీనా హామీ ఇస్తుంది. ఈ క్రమంలో రవి తన మనసులో 'సారీ వదిన నీకు కూడా అబద్ధం చెప్పాల్సి వస్తోంది' అంటూ ఫీల్ అవుతాడు.
మరోవైపు శ్రుతి పిలవడంతో సంజూ ఇంటికి వస్తాడు. వస్తూవస్తూనే.. 'గుడ్ మార్నింగ్ అంకుల్ .. నాకు శృతి కావాలి, తనని నేను కలువాలి' అంటూ తన రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు సంజూ. దీంతో శ్రుతి తల్లి శోభన కంగారు పడుతుంది. తానే తీసుకవస్తానంటూ నచ్చజెప్పి శ్రుతిని తీసుకవస్తోంది. తన తింగరి వేశాలతో శ్రుతి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతాడు సంజూ. తన ఫ్రెండ్ పెళ్లి ఉండనీ, తాను శ్రుతిని బయటకు తీసుకవెళ్లానని, ఎలాంటి సెంటిమెంట్స్ పెట్టి తమకు అడ్డు చెప్పకూడదనీ, ఇబ్బంది పెడితే తాను తన నాన్నకి ఫోన్ చేసి చెప్తాననీ వార్నింగ్ ఇస్తాడు. అయితే.. పెళ్లికి మేము కూడా వస్తామని శ్రుతి పేరేంట్స్ అడడగా.. 'మీకు సిగ్గు ఉందా' అంటూ తిడుతాడు. ఈ తరువాత శ్రుతిని తీసుకోని బయటకు వెళ్లాడు సంజూ. మరోవైపు.. పెళ్లికి రవి రెడీ అవుతాడు.


Click it and Unblock the Notifications











