Gunde Ninda Gudi Gantalu october 8th Episode: ఇంట్లో నుంచి శ్రుతి జంప్..రవికి పెళ్లి బంధాలు చూస్తున్న ప్రభావతి
బుల్లితెరపై ప్రసారమవుతోన్న ధారవాహికలకు రోజురోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అవుతోన్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి ఇంటి నుంచి తప్పించుకోవడానికి సంజూను పావుగా ఉపయోగించుకుంటుంది. తన ఫ్రెండ్ పెళ్లి ఉందనీ, తన ఫ్రెండ్స్ తనని చూడాలని సంజూను ఇంటికి రమ్మని పిలుస్తోంది. ఇంటికి వచ్చిన సంజూ.. తనకు కాబోయే భార్యను బయటకు తీసుకెళ్తున్నానని, తమను అడ్డుకోకుండా వెళ్లనివ్వడని సంజూ కోరడంతో శ్రుతి పేరెంట్స్ అడ్డు చెప్పలేకపోతారు. ఏం జరుగుతోనని శ్రుతి పేరెంట్స్ భయపడుతారు. మరోవైపు రవి తన వదినకు మాయ మాటలు చెప్పి.. గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు.

మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో త్వరగా గుడికి వెళ్లాలని, తన వదిన మీనాను తొందర పెడుతుంటారు రవి. దీంతో అనుమానం వచ్చిన మీనా.. 'మనం గుడికి వెళ్తున్నామా ? లేదా నీ పెళ్లికి వెళ్తున్నామా? ఎందుకీ తొందర. మనం మాట్లాడటానికే కదా ' అని ప్రశ్నిస్తుంది. అదేం లేదు వదినా.. శ్రుతి వస్తుందని ఏదోటి చెప్పి కవర్ చేశాడు రవి. ఇంతలో మీనాకు బాలు ఫోన్ చేసి.. 'రవి ఉన్నాడా.. వాడిపై ఓ కన్నేసి ఉంచు.. వాడు ఆ అమ్మాయిని మరిచిపోయాడుగా.. అమ్మాయిని మరిచిపోకపోతే బాగోదు' అని వార్నింగ్ ఇస్తాడు బాలు. అదేం లేదు అంతా బాగేనే ఉందని మీనా సమాధానమిస్తుంది మీనా.
' అయినా.. రవి గాడు మంచోడు.. వాడు నాకైనా.. నీకైనా గౌరవమిస్తాడు. నాన్న మాటను కూడా తూచా తప్పకుండా వింటాడు' అంటు బాలు అనడంతో రవి ఎమోషనల్ అవుతాడు. ఇదెలా ఉంటే.. హాలు కూర్చోని ఉన్న సత్యం 'ఎక్కడికి వెళ్తున్నావ్ రా ?' అని రవిని ప్రశ్నిస్తాడు. 'లేదు. నాన్న రెస్టారెంట్ కు వెళ్తున్న ' అని రవి బదులిస్తాడు. 'మీ మమ్మీ నీకు సంబంధాలు చూస్తుంది. త్వరగా లైఫ్ లో సెట్ కావాలి. ఇంకా ఎన్ని రోజులు ఆ రెస్టారెంట్ లో పని చేస్తావ్ ?' అని సత్యం నిలదీస్తాడు. 'లేదు నాన్న.. లోన్ కోసం ట్రై చేస్తున్నా.. లోన్ రాగానే హోటల్ బిజినెస్ స్టార్ చేస్తాను' రవి బదులిస్తాడు.
'లోన్ రాకపోతే చెప్పు ఇంటి కాగితాలు లిస్తా.. వాటిని పెట్టి లోన్ తీసుకో' అని బాలుకు ధైర్యమిస్తాడు తండ్రి సత్యం. ఇంతలో ప్రభావతి వచ్చి .. 'ఎంత బాగా రెడీ అయ్యావ్ రా.. నిన్ను ఇలా చూస్తే.. నా దిష్టి తగిలేలా ఉంది'అని అంటుంది. ఇంతలో కిందపడి ఉన్నా బైక్ కీ ను తీసుకునే ప్రయత్నంలో రవి తలకు దెబ్బ తగులుతుంది. ఈ సమయంలో ఫ్యామిలీ మొత్తం రియాక్షన్ అవుతోంది. ఒక కొడుకుకు దెబ్బ తగిలితే తల్లిదండ్రులు ఎలా రియాక్డ్ అవుతారో అనే అంశాన్ని డైరెక్టర్ బాగా చూపించారు. అలాగే.. బయటకు వెళ్లేటప్పుడు ఇలాంటి జరిగితే.. కాసేపు కూర్చోని వెళ్లాలని సత్యం సలహా ఇస్తాడు.
ఆ తరువాత మీనా వచ్చి.. 'తాను గుడి వెళ్తున్నా'..అని చెప్పగా.. 'మీ అమ్మను చూడటానికే కదా ..'అంటూ ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడుతోంది. 'ఇందులో తప్పేముంది. తన అమ్మను చూసి వస్తుంది' అని మీనాకు సపోర్డుగా మాట్లాడుతాడు సత్యం. ఈ క్రమంలో అటు వైపే వెళ్తున్నా వదినా నేను డ్రాప్ చేస్తాననీ రవి అని అనడంతో.. 'ఏం అవసరం లేదు. ఆటోలోనో.. బస్ లోనో వెళ్తుంది'అని ప్రభావతి కారడ్డం ఆడుతోంది. 'కుటుంబం అన్నకా.. ఒక్కరి ఒక్కొరూ సహయం చేసుకోవాలి. క్షేమంగా వెళ్లి లాభంగా రమ్మని ' సత్యం వారి సెడ్ ఆఫ్ ఇస్తాడు..
మరోవైపు.. సుమతి పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంటుంది. ఇంతలో పంతుల వచ్చి.. 'ఏమైందమ్మా.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంకా రాలేదు. ఏమైనా గొడవలు జరగవ్ కాదా. అలాంటి ఏమైనా ఉంటే.. ముందే చెప్పమని, తాను అలాంటి పెళ్లిళ్లు చేయను' అని అంటాడు. అదేం లేదు గొడవలు ఏం జరగవు. మీరు టెన్షన్ పడకండి అని పంతులకు నచ్చజెప్పుతుంది సుమతి.
మరోవైపు శ్రుతి.. తన ప్లాన్ ప్రకారం. సంజూతో గుడికి వస్తుంది. ఈ సమయంలో సంజూ టార్చర్ భరించలేకపోతుంది. తన ముందు ఫోన్ యూజ్ చేయొద్దనీ, తాను ఏం చేసిన ఒకే అనాలని వార్నింగ్ ఇస్తాడు. కాదు లేదు అని సమాధానమిస్తే.. తనకు అసలు నచ్చదనీ, తన ముందు అతి చేస్తే.. గన్ తీశానని భయపెడుతాడు. తాను అరిస్తే.. భరించాలనీ, టచ్ చేస్తే.. టచ్ చేయనివ్వాలని శ్రుతిని టర్చర్ చేస్తాడు సంజూ. పెళ్లి తరువాత ఎలా కావాలంటే.. అలా ఉంటాననీ, త్వరగా వెళ్లమని లేకపోతే.. పెళ్లి అయిపోతుందని సంజూతో శ్రుతి చెబుతోంది. దీంతో శ్రుతి తన మాట వింటుందనీ సంజూ రష్ గా కారును డ్రైవ్ చేసుకుంటూ గుడికి వెళ్తాడు.
గుడి దగ్గర దించగానే తాను గిప్టు మరిచిపోయాననీ, ఓ కాస్లీ గిప్టు తీసుకరమ్మని సంజూను రిక్వెస్ట్ చేస్తుంది శ్రుతి. తాను తన వర్కర్స్ తో గిప్టు తెప్పిస్తానని చెప్పుతాడు సంజూ. దీంతో లేదు లేదు నీ సెలక్షన్ బాగుంటుందనీ ఓ రేంజ్ పొగడ్తలతో ముంచేస్తుంది. దీంతో సంజూ.. ఊహాలలో తెలుతూ.. గిప్టు తీసుకురావడానికి వెళ్తాడు. మరోవైపు.. సుమతి, శ్రుతి ఫ్రెండ్స్ పెళ్లికి ఏర్పాటు చేస్తుంది.
ఇంతలో రవి తన వదిన మీనాను తీసుకెళ్లి గుడికి వెళ్లాడు. కానీ, గుడిలోకి రానివ్వకుండా బయటనే ఉంచి వెళ్తాడు. రవి ఫ్రెండ్స్ కూడా పెళ్లి బట్టలు తీసుకవచ్చి ఇస్తారు. పంతులన్ని తర్వగా పెళ్లి మంత్రాలు చదవమని, ఆత్రుత పెడితే.. ఏమైనా సమస్య ఉంటే.. తాను పెళ్లి చేయనని పంతులు అనడంతో లేదు అంటూ కవర్ చేస్తాడు రవి. ఇంతలోనే రవికి బాలు ఫోన్ చేస్తాడు. మరి ఫోన్ లిప్ట్ చేస్తాడా ? లేదా? అనేది మరో ఎపిసోడ్ లో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











