Gunde Ninda Gudi Gantalu october 9th Episode: గుడిలో శ్రుతి, రవి పెళ్లి.. ఆగ్రహం మండిపడ్డ మీనా..
తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతోన్న ధారవాహికలకు రోజురోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అవుతోన్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఇంట్లో తల్లిదండ్రులకు అబద్దం చెప్పి గుడికి వెళ్తాడు. ఈ సమయంలో తన వదిన మీనాను కూడా నమ్మించి గుడికి తీసుకెళ్లాడు. శ్రుతితో మాట్లాడుతాననీ బయటనే ఉంచుతాడు. మరోవైపు.. శ్రుతికు మాయ మాటలు చెప్పి సంజూతో గుడికి వస్తుంది. ఈ సమయంలో తన ప్రెంఢ్ పెళ్లికి కాస్లీ గిఫ్ట్ తీసుకురావాలని బయటకు పంపిస్తోంది. లోపల సుమతి పెళ్లి ఏర్పాటు చేస్తోంది.

ఇక బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో మీనా బయటనే వేయిట్ చేస్తుంటుంది. సుమతి తన పూల షాపు దగ్గర కనిపించకపోవడంతో పూలమ్ముకుంటూ అక్కడే ఉండిపోతుంది. మరోవైపు సుమతి పెళ్లి ఏర్పాట్లను చేస్తుంది. త్వరగా పెళ్లి చేయించాలని పంతులు కోరగా ఏదైనా సమస్య ఉందంటూ ఆరా తీస్తాడు. అదేం లేదు అంటూ రవి సమాధానం ఇస్తాడు. రవి పెళ్లి పీటల మీద డల్ గా కూర్చోవడంతో ఏమైంది పెళ్లి ఇష్టం లేదా? అంటూ శృతి ప్రశ్నిస్తుంది. ఈ విషయం ఇంట్లో తెలుస్తే ఎలా ఫీలవుతారు అంటూ బాధపడతాడు. అన్ని సమస్యలు సర్దుకుపోతాయి అంటూ ఏమి టెన్షన్ పడద్దని శృతి నచ్చ చెబుతుంది
త్వరగా తాళి కట్టించండి అంటూ పందులు కూడా ఎందుకమ్మా తొందర పెళ్లికంటూ పూర్తి కావాలి కదా.. అయినా ఆశీర్వదించడానికి పెళ్లయిన వారు ఒకరు కూడా లేరంటే పంతులు అడుగుతారు.' ఒకరున్నారంటూ పెళ్లి సమయానికి వారే వస్తారు' అని శృతి సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయినా సుమతి ఇంతకీ ఆ పెళ్లయిన వ్యక్తి ఎవరంటూ ప్రశ్నిస్తుంది. 'నువ్వే చూస్తావు వెయిట్ చెయ్యి' అంటూ రవి అంటాడు.
ఇదిలా ఉంటే మరోవైపు రవికి బాలు ఫోన్ చేశాడు. దీంతో పెళ్లి విషయం తెలిసిపోయిందంటూ కంగారూ పడుతాడు. శ్రుతి ఫోన్ లిప్ట్ చేయకని అంటుంది. శ్రుతి మాట విని రవి ఫోన్ లిప్ట్ చేయడు. దీంతో బాలు.. వెంటనే మీనాకు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావ్ అని ప్రశ్నిస్తాడు. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది మీనా. 'నువ్వు గుళ్లో ఉన్నావనే విషయం తనకు తెలుసు' అని, రవికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ అందుకే నీకు ఫోన్ చేశానని అంటాడు బాలు. తనకోసం గాజులు తీసుకుంటున్నారంటూ అందుకే ఫోన్ చేశానని వెంటనే రవి ఫోన్ నుండి తనకు వీడియో కాల్ చేయాలంటూ బాలు మీనాను అంటాడు.

దీంతో కంగారుపడుతూ మీనా గుడిలో లోపలికి వెళుతుంది. అప్పటికే రవి, శ్రుతిల పెళ్లి అయిపోతుంది. ఈ పెళ్లిని చూసి.. మీనా నిర్గాతపోతుంది. ఆగ్రహంతో ఊగిపోతోంది. మొత్తానికి షాక్ అవుతోంది మీనా. తనని నమ్మించి గుడికి ఎందుకు తీసుకొచ్చావని అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అంటూ ఆగ్రహంతో మండిపడుతుంది మీనా. మీనా ను కన్విన్స్ చేయడానికి రవి ప్రయత్నించగా.. ఏం మాట్లాడకని వార్నింగ్ ఇస్తుంది. ఒక్క నిమిషం తన గుండె ఆగిపోయింది. ఈ విషయం చెప్పాలని ఇంట్లో చెప్పాలని అనిపించలేదా? తనను గుడికి తీసుకొచ్చేటప్పుడైనా నిజం చెప్పాలనిపించలేదా తల్లిదండ్రుల గురించి అన్నయ్య గురించి అసలు ఆలోచించావా అంటూ మీనా నిలదీస్తుంది.
ఈ సమయంలో మీనాకు నచ్చ చెప్పడానికి శృతి కూడా ప్రయత్నిస్తుంది. తనని కూడా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది. రవి ఇలా దొంగ చాటున పెళ్లి చేసుకున్నాడంటే అసలు కారణం నువ్వే అంటూ శృతిని కూడా ఏకిపారేస్తుంది మీనా. అసలు విషయం ఆనాడే ఇంట్లో చెబితే.. సమస్య ఇక్కడ వరకు వచ్చేది కాదంటూ ఆగ్రహంతో మండిపడుతుంది మీనా. సుమతి కూడా తన అక్కని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించగా మీనా ఆవేశం మరింత కట్టలు తెచ్చుకుంటుంది. తన జీవితం గురించి, తన ఫ్యామిలీ గురించి ఒక్కసారి అయినా ఆలోచించావా.. అంటూ సుమతిని కొడుతుంది మీనా.
అసలు తల్లిదండ్రులను మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది? భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించావా ? ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఎలా ఫీలవుతాడో ఒక్కసారైనా ఆలోచించావా? తన తల్లికి ఈ విషయం తెలిస్తే తనని ఇంట్లో ఉండనిస్తుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనని ఇంతలా ఎందుకు మోసం చేసావ్? అంటూ మండిపడుతుంది.మరోవైపు ఆ గుడి పంతులు వచ్చి సాక్ష్య సంతకాలు పెట్టాలంటూ అడుగుతాడు. సాక్షిగా మీనా సంతకం అడగడంతో ఈ విషయం తన ఇంట్లో తెలుస్తే తన బతకనివ్వరని, తన భర్త తనని విడిచిపెడతాడంటూ సమాధానం ఇస్తుంది. కానీ, బాలు, శ్రుతిలు ప్రాధేయ పడడంతో చివరికి సంతకం పెట్టి.. ఏడ్చుకుంటూ.. అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా.


Click it and Unblock the Notifications










