Gunde Ninda Gudi Gantalu october 10th Episode: పారిపోయిన కొత్తజంట.. సంజూ వార్నింగ్.. సత్యం అరెస్ట్

Gunde Ninda Gudi Gantalu october 10th Episode: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతోన్న ధారవాహికలకు రోజురోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతితో పెళ్లి విషయం మాట్లాడాలని మీనాను నమ్మించి గుడికి తీసుకెళ్లాడు రవి. కానీ, గుళ్లో తన పెళ్లి ఏర్పాటు జరుగుతున్నాయనే విషయం చెప్పకుండా.. మీనాకు బయటనే ఉంచేస్తాడు. మరోవైపు శ్రుతి కూడా సంజూకు మాయమాటలు చెప్పి గుడిలోకి రాకుండా చేస్తుంది. ఇలా రవి-శ్రుతిలు గుడిలో పెళ్లి చేసుకుంటారు. తనని నమ్మించి పెళ్లి చేసుకున్న రవిని చూసి ఆగ్రహంతో మండిపడుతుంది. తనని, ఇంట్లో వారిని ఎందుకు మోసం చేశావ్ అంటూ భాదపడుతోంది మీనా. అందరూ ప్రాధేయపడటంతో పెళ్లిపెద్దగా సంతకం పెట్టి వెళ్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 268 October 10th 2024 here is full story

ఇక బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో పెళ్లి పెద్దగా మీనా సంతకం పెడుతుంది. ఇంటికి వచ్చి అత్తమామల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తారు కానీ జరిగిన విషయం చెప్పే లోపే.. వస్తున్న అంటూఫోన్ కట్ చేస్తాడు. మీనా చెప్పినట్టు ఇంటికి వెళ్లిపోదామంటూ రవి అడగగా.. అవసరం లేదు. తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు వెళ్లదామని , నాలుగైదు రోజులు పోతే.. అని గొడవలు సెట్ అవుతాయని శ్రుతి నచ్చజెప్పి.. రవిని తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తుంది.

మరోవైపు సంజు గుడికి వస్తాడు. శృతి కనిపించకపోవడంతో ఆగ్రహంతో వెతకడం ప్రారంభిస్తాడు. కానీ, ఎంత వెతికిన శ్రుతి కనిపించకపోవడంతో ఆగ్రహంతో సురేంద్ర ఇంటికి వెళ్తాడు సంజూ. శృతి ఎక్కడ? ఎటు వెళ్ళింది? తనను మోసం చేసి తన ఫ్రెండ్ పెళ్లి అంటూ గుడికి తీసుకెళ్లిందంటూ అసలు విషయాన్ని చెప్పేస్తాడు సంజూ. దీంతో సురేంద్ర .. తాను డబ్బింగ్ నుండి కాల్ వస్తే.. ఎవరికి చెప్పకుండా ఇలానే వెళ్ళిపోతుందంటూ ఏదో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ తనకు ఇలాంటి పనులు నచ్చవని, తాను ఎంగేజ్మెంట్ కు ముందే.. అన్ని విషయాలు క్లియర్ గా చెప్పానని, మరోసారి ఇలాంటి పనులు చేస్తూ తన డాడీ కి చెబుతానని వార్నింగ్ ఇచ్చి అక్కనుండి వెళ్ళిపోతాడు.

సంజూనే ఇలాగా వార్నింగ్ ఇస్తే.. సంజూ తండ్రి నీలకంఠ ఏకంగా గన్ తో షూట్ చేసి పడేస్తాడనీ భయపడుతాడు సురేంద్ర. కచ్చితంగా తన కూతుర్ని రవి తీసుకెళ్తాడని ఫిక్స్ అయితాడు. వెంటనే రవి ఇంటికి వెళ్లాడు. తన కూతురు ఎక్కడ ఉందంటూ సత్యంను ప్రశ్నిస్తాడు. ఈ క్రమంలో అసలు విషయం చెప్పకుండా.. లేనిపోని ఆరోపణలు చేస్తే బాగోదంటూ వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి కూడా తన కొడుకు రవి అలాంటి వాడు కాదనీ, లేని పోని ఆరోపణలు చేస్తే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. మనోజ్ కూడా తన తండ్రి గురించి, తన తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడితే.. పోలీసు కంప్లిట్ ఇస్తానని వార్నింగ్ ఇస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 268 October 10th 2024 here is full story

ఈ క్రమంలో రవికి ఫోన్ చేయక శ్రుతి ఫోన్ తీసుకుని స్వీచ్ ఆఫ్ వస్తుంది. పెంచన్ ఆపాననీ, తన కూతుర్నీ రవితో కిడ్నాప్ చేయించాడంటూ సత్యం, సురేంద్రకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో పోలీసులు ఎంటర్ అవుతారు. రవి ఎక్కడ ఉన్నాడు? తన కూతురు మిస్ అయ్యిందని సురేంద్ర కంప్లెయింట్ ఇచ్చాడని పోలీసులు చెప్పుతారు. ఇది అమ్మాయి విషయం పోలీసు స్టేషన్ కు తీసుకవెళ్లకపోతే.. సమస్య తీవ్రమతుందనీ, కేవలం స్టేట్ మెంట్ తీసుకుని విడిచిపెడుతామనీ పోలీసులు నమ్మిస్తారు.తాను కూడా ఎలాంటి తప్పు చేయలేదనీ, ఎక్కడికి రమ్మన్న వస్తానని సత్యం అంటారు. దీంతో సత్యం ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X