Gunde Ninda Gudi Gantalu october 11th Episode: పోలీస్ స్టేషన్ లో సత్యంకు అవమానం.. చిక్కులో పడ్డ మీనా
Gunde Ninda Gudi Gantalu october 11th Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ మెయిన్. ప్రధానంగా మహిళల నుంచి ఈ సీరియల్స్ కు రోజురోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అవుతోన్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో శుత్రి , రవిల పెళ్లికి పెద్దగా మీనా సంతకం పెట్టి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో మనం ఇంటికి వెళ్తే.. గొడవలు జరుగుతాయనీ, నాలుగైదు రోజులు తరువాత గొడవలు సర్దుకున్న తరువాత ఇంటికి వెళ్దామని రవిని తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తుంది శ్రుతి. ఈ క్రమంలో వారు తమ ఫోన్లు స్వీచ్ ఆఫ్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర ఆగ్రహంతో సత్యం ఇంటికి వెళ్లి తన కూతురు ఎక్కడ ఉందని నానా హంగామా చేస్తాడు. ఈ క్రమంలో పోలీసులను కూడా పిలిస్తాడు. అనంతరం స్టేట్ మెంట్ పేరిట సత్యం నుంచి అదుపులోకి తీసుకుంటారు. పోలీసులు.

శుక్రవారం ఎపిసోడ్ లో.. పోలీసులు సత్యం ను స్టేషన్ కు రమ్మని పిలిస్తారు. 'తాను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడననీ, పోలీసులు స్టేషన్ రమ్మనంటున్నారు. నాకు తెలిసింది రాసి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ' అంటూ సత్యం పోలీసులతో వెళ్లడానికి సిద్ధపడతాడు. దీంతో..' మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముందు రవిని పిలిపించి.. అసలు విషయం తేల్చేద్దాం' అంటూ ప్రభావతి అంటుంది. 'పోలీసులు కోపరేట్ చేయమంటున్నారు కదా.. మన వైపు తప్పు లేనప్పుడు మనం ఎందుకు భయపడడం' అంటూ తిరిగి సమాధానం ఇస్తాడు సత్యం.
ఇలా సత్యాన్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తారు. సత్యంతో పాటు ప్రభావతి ఫ్యామిలీ కూడా పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. ఇంతలోనే మీనా ఇంటికి వస్తుంది. ఏమైంది చుట్టుపక్కల వారని అడగగా 'మీ మామయ్య ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారు' అంటూ సమాధానమిస్తాడు. 'ఆయనకి ఏం తప్పు తెలియదు. ఆయన అలాంటివాడు కాదు కావాలని ఎవరో ఇలా చేస్తున్నారు' అంటూ చెప్పి వచ్చి ఆటోలోని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది మీనా. మార్గమధ్యంలో బాలుకు ఫోన్ చేసి.. పోలీసులు మామయ్యను అరెస్టు చేశారని చెబుతుంది. ఇంతలోనే బాలు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో కంగారు కంగారుగా బాలు బయలుదేరుతాడు.

మరోవైపు పోలీస్ స్టేషన్లో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ముందు స్టేట్మెంట్ అని తీసుకొచ్చిన పోలీసులు శృతి దొరికేంతవరకు విడిచి పెట్టేది లేదంటూ వార్నింగ్ ఇస్తారు. ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా.. ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తామంటూ ప్రభావతి మనోజ్ లకు వార్నింగ్ ఇస్తాడు ఎస్ఐ.'మీ వాడు.. ఏ తప్పు చేయకపోతే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు' అంటూ ఎస్సై ప్రశ్నిస్తాడు. మరోవైపు సురేంద్ర కూడా తన కూతురి కావాలని కిడ్నాప్ చేశారని తనపై కుట్ర చేశారని, తన కూతురు పెళ్లి చెడగొట్టాలని ఇలా చేశారంటూ ఆరోపిస్తాడు.
'తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తే.. తప్పు ఒప్పు కాదు. చేయని తప్పుకు ఇబ్బంది పెట్టడం సరి కాదు' అంటూ సురేంద్రకు సత్యం వార్నింగ్ ఇస్తాడు. 'మా అబ్బాయి వస్తే.. నేనే తీసుకొచ్చి అసలు విషయం చెప్పిస్తానం'టూ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఎస్ఐ.. ఇదేమైనా గెస్ట్ హౌస్ అనుకున్నావా.. మీ అబ్బాయి వచ్చి సరెండర్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలంటూ వార్నింగ్ ఇస్తుంది. ఈ క్రమంలో పోలీసులు సత్యాన్ని తోసేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ప్రభావతి బోరుమని ఏడుస్తుంది. స్టేషన్లో ఎవరు ఉండదంటూ పోలీసులు ప్రభావతి కుటుంబాన్ని బయటికి పంపిస్తారు. మరోవైపు గుడికి వెళ్లి ఎంక్వయిరీ చేయమంటూ కానిస్టేబుల్ లను పురమయిస్తాడు.

సత్యం ను పోలీసులు అరెస్టు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతుంది ప్రభావతి. ఈ క్రమంలో మనోజ్ భార్య తన మామయ్యను బయటకు తీసుకురావడానికి తన ఫ్రెండ్స్ సహాయం కోరుతుంది. మనోజ్ మాత్రం తనకు ఏమి పట్టనట్లుగా తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తాడు. దీంట్లో ప్రభావతి తన కొడుకు మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తను మీ తండ్రి.. పట్టింపు లేకుండా ఇలా ఎలా ఉంటున్నారా? అంటూ నిలదీస్తుంది. మీకోసం మన ఇంటికి పత్రాలను తాకట్టు పెట్టినప్పుడు మీ నాన్న ఎంత కష్టపడ్డాడు తెలుసు కదా. ముగ్గురు కొడుకులు కన్నా తనకు ఎలాంటి సంతోషం లేదంటూ బాధపడుతుంది.
ఇంతలోనే మీనా పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది. తన మామయ్య దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందంటూ అడుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తోంది.


Click it and Unblock the Notifications











