Gunde Ninda Gudi Gantalu Oct30th Episode: మీనాపై మరో నేరం పడుతుందా..? ఇంటి డాక్యుమెంట్స్ దొంగిలించింది ఎవరు?

Gunde Ninda Gudi Gantalu October 30th Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లూక్కేయండి.

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం కు హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్లో చేర్చుతారు. అయితే..అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. మీనాకు ఈ విషయం తెలియడంతో వెంటనే హాస్పిటల్ కు చేరుకుంటుంది. కానీ ప్రభావతి, మనోజ్ లు ఎందుకు వచ్చావ్.. నీవల్లే కుటుంబ పరువు రోడ్డున పడిందని,ఆ బాధతోనే హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ అవమానిస్తారు. దీంతో తన మామయ్యను చూడకుండానే మీనా అక్కడినుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 282 October 30th 2024 here is full story

బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో. సత్యం ను వైద్యులు పరీక్షించిన తర్వాత.. అతనికి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని , అతని రెండు వాల్ప్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయని, ఆపరేషన్ చేయాలని, ఈ ఆపరేషన్ కు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని హెచ్చరిస్తారు. నాలుగు లక్షలు అంటే ఏం చేయాలో అర్థం కాక బాలు తల పట్టుకొని కూర్చొంటాడు ప్రభావతి అండ్ ఫ్యామిలీ.

ఈ సమయంలో మనోజ్.. ప్రభావతిని పక్కకు తీసుకువెళ్లి.. ఆపరేషన్ కోసం నాలుగు లక్షలు అంటున్నారు.. ఏం చేద్దాం? ఏమైనా డబ్బులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తాడు. 'నా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే నువ్వే కాదారా ఉడ్చేశావ్ .. ఇంటి ఖర్చులు కూడా బాలు రోహిణిలు చూసుకుంటున్నారు' అంటుంది ప్రభావతి. సాయంత్రం లోపు కట్టాలమ్మా.. తన దగ్గర రూపాయి కూడా లేదంటూ మనోజ్ చేతులెత్తేస్తాడు.

మరోవైపు.. తన మామయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని మీనా ఏడ్చుకుంటూ గుడికి వస్తుంది. తన తల్లి, చెల్లి ఎంత పిలుస్తున్నా వినకుండా గుళ్లోకి వెళ్తుంది. 'మా మామయ్యకు ఏం కాకుండా చూడు.. మా నాన్న చనిపోయాక నాకంటూ తోడుగా నిలబడింది ఆయన మాత్రమే.. ఆయనకు ఏం కాకుండా చూడు. నీకు పుణ్యం ఉంటుంది' అంటూ దేవుని వేడుకుంటుంది.

ఏమైందని తన తల్లి పార్వతి ప్రశ్నించగా.. తన మామయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందనీ, హాస్పిటల్లో చేర్పించారు చాలా భయంగా ఉందని చెప్పుతుంది. 'అక్క నువ్వు హాస్పిటల్ కి వెళ్ళావా? ఆయన పరిస్థితి ఎలా ఉంది? అంటూ సుమతి మీనా ను ప్రశ్నించగా.. 'ఆయన పరిస్థితి కి తానే కారణం అంటూ తన అత్త తనని హాస్పిటల్ నుండి గెంటేసిందంటూ మీనా బాధపడుతుంది.

'ఓ వైపు కొడుకు మోసం చేసి పెళ్లి చేసుకుంటే.. చెయ్యని నేరానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎలా ఉంటుందో.. ఆ బాధ ఆలోచించండి. ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే కూడా అయ్యారు' అంటూ తన కూతుళ్లను తిడుతుంది పార్వతి.'ఇలా జరుగుతుందని.. నిజంగా తాను ఆలోచించలేదు' అని మీనా చెల్లె బాధపడుతుంది. ఏదైనా పని చేసే ముందు కచ్చితంగా ఆలోచించాలని, ముఖ్యంగా అక్కను ఇచ్చిన ఇంటి గురించి కచ్చితంగా ఆలోచించాలి, ఆయనకు ఏమైనా అయితే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది అంటూ మీనా తల్లి పార్వతి బాధపడుతుంది. మళ్లీ ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి చూద్దామని సుమతి అనగా.. వాళ్లు నన్ను హాస్పిటల్ కూడా కాలు పెట్టనివ్వరని, తనను చూస్తునే అసహ్యించుకుంటున్నారని, అంతా నా కర్మ అంటూ మీనా బాధపడుతుంది. తన మామయ్య కోసం గుళ్లో పూజలు చేస్తూ ఉంది మీనా.

మరోవైపు.. సత్యం స్నేహితుడు రంగా హాస్పిటల్ కు చేరుకుంటాడు. ఆరోగ్యంగా ఉండే ఆయనకు ఎలా హార్ట్ ఎటాక్ వచ్చింది అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో వెంటనే మనోజ్ మాట్లాడుతూ.. బాలు గాడు తాగి వచ్చి గొడవ చేయడం వల్లే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అంటాడు. దీంతో రంగాకు కోపం వచ్చి.. 'ఇక్కడ కూడానా.. మీ అన్నదమ్ముల కొట్లాటలు ఆపండ్రా.. ఇప్పుడు మీరు కొట్లాడుకోవడం కాదు.. మీ నాన్నను ఇలా బతికించుకుంటారు అది ఆలోచించండి' అంటూ గట్టిగా క్లాస్ పీకుతాడు. సహాయం చేద్దాం అంటే.. స్నేహితుడిగా బాధపడడం తప్ప.. తన దగ్గర కూడా డబ్బు లేదురా అంటూ భయపడతాడు రంగా.

ఇంతలో సత్యం ఆరోగ్యం మరింత విషమిస్తుంది. వెంటనే డాక్టర్లు వచ్చి మరోసారి పరీక్షిస్తారు. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకి ప్రమాదం అంటూ డాక్టర్ మరోసారి హెచ్చరిస్తాడు. వెంటనే డబ్బులు కట్టమని చెబుతాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉంటుంది ప్రభావతి కుటుంబం. వాళ్ళందరూ ఏదో కారణం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. బాలు కూడా 4000 లో.. 40,000లో కాదు.. నాలుగు లక్షలు ఎలా కట్టాలని అంటూ బాధపడతాడు.

కొడుకు మాటలు విన్న ప్రభావతి..'ఆయనకు ఊపిరి అందడం లేదు. ఇలాగేనా తన పసుపు కుంకుమలు నిలబెట్టండి రా' అంటూ ప్రాధేయపడుతుంది. ఈ క్రమంలో రోహిణి దగ్గరకు ప్రభావతి వెళ్లి.. తన నాన్నను డబ్బులు అడగమని కోరుతుంది. తన నాన్న ప్రస్తుతం మలేషియాలో లేడని, వేరే కంట్రీకి వెళ్ళాడని, తన నాన్న ఫోన్ నెంబర్ లేదంటూ తప్పించుకుంటుంది రోహిణి. కనీసం మీ మామయ్యను అయినా అడగమ్మా అంటూ ప్రాధేయపడుతుంది ప్రభావతి. ఆయన కూడా తన తండ్రితో ఫారెన్ వెళ్లిపోయాడని చెబుతోంది.

ఈ మాటలు విన్న బాలు.. బ్యూటీ పార్లర్ అమ్మేదామా? అంటూ బాలు ఐడియా ఇస్తాడు. అది రెంట్ కదా.. కేవలం అందులోని ఎక్విప్మెంట్ అమ్మితే.. అంత డబ్బు రాదంటూ రోహిణి బదిలిస్తుంది. మొత్తానికి తన బండారం బయట పడకుండా జాగ్రత్త పడుతోంది. పైగా.. ఇంటి పత్రాలు ఉన్నాయి కదా అంటూ ఐడియా ఇస్తుంది. దీంతో వెంటనే బాలు ఇంటికి వెళ్లి ..డబ్బులతో తిరిగి వస్తానంటూ వెళ్లిపోతాడు. ఇంటి డాక్యుమెంట్ కోసం ఇల్లు మొత్తం గాలిస్తాడు బాలు. ఎంత వెతికినా ఇంటి డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో.. ఆగ్రహంతో బాలు మీనాకు ఫోన్ చేస్తాడు. కానీ, మీనా గుళ్లో పూజ చేస్తుండడంతో ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అయినా ఇంటి డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో మనోజ్ పై బాలుకు అనుమానం వస్తోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ క్లోజ్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X