Gunde Ninda Gudi Gantalu October 31th Episode: తండ్రి ఆపరేషన్ కోసం బాలు షాకింగ్ డెసిషన్.. మరీ మీనా ప్రయత్నాలు
Gunde Ninda Gudi Gantalu October 31th Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లూక్కేయండి.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం ను వైద్యులు పరీక్షించిన తర్వాత.. అతనికి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని, ఈ ఆపరేషన్ కు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు.ఆపరేషన్ కోసం డబ్బు ఎలా సమకూర్చాలో ప్రభావతి ఫ్యామిలీ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్లి.. తన నాన్నను గాని, మామయ్యను గాని డబ్బు సమకూర్చమని కోరుతుంది. కానీ రోహిణి వారు ఎక్కడున్నారో తనకు తెలియదంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుంది. పైగా ఇంటి దస్తావేజులు ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చొచ్చు అంటూ సలహా ఇస్తుంది. ఈ సలహా మేరకు బాలు ఇంటికి వెళ్లి దస్తావేజుల కోసం వెతుకుతాడు. కానీ, ఆ దస్తావేజులు కనిపించవు. ఈ క్రమంలో మీనాకు బాబు ఫోన్ చేస్తాడు. మీనా తన మామయ్య ఆరోగ్యం బాగుపడాలని పూజ చేస్తూ ఉండిపోతుండటంతో బాలు కాల్ ను లిఫ్ట్ చేయదు. దీంతో మీ నాపై మరోసారి బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు

బుధవారం ఎపిసోడ్ ప్రారంభం కాగానే బాలు ఫ్రెండ్ రంగా వచ్చి యూనియన్ ఆఫీసులో కూడా తాను అడిగి చూసాననీ, కానీ, వారు లోన్ ఇవ్వలేమంటూ నిరాకరించారని చెప్పుతాడు. దీంతో ఉన్న ఆశ కూడా పోయిందా.. అంటూ ప్రభావతి బాధపడుతుంది. ఏమైనా చేసి.. నాన్నను కాపాడండి రా అంటూ మనోజ్ ను ప్రాధేయపడుతుంది. ఇంతలో బాలు నిరాశతో హాస్పిటల్ కు చేరుకుంటాడు. పత్రాలు తాకట్టుపెట్టి.. డబ్బులు తీసుకొచ్చావా? అంటూ తన తల్లి ప్రభావతి ప్రశ్నించగా.. పత్రాలు కనిపించడం లేదని, తనకు మనోజ్ పై అనుమానం వస్తుందని అంటాడు. పక్కనే ఉన్న మనోజ్ కలర్ పట్టుకొని ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావ్ రా? అని ప్రశ్నిస్తాడు.
దీంతో.. కోపం వచ్చినా రోహిణి ఇంటి సభ్యుల ముందు ఆ పత్రాలను మీనాకే ఇచ్చాడుగా . అంటూ గట్టిగా సమాధానమిస్తుంది. పక్కనే ఉన్న రంగ..' ఇప్పుడు మీరు కొట్టుకోవడం కాదురా.. ముందు డబ్బు ఎలా సమకూరుతుందో .. ఆ విషయం గురించి ఆలోచించండి. మీ తండ్రిని రక్షించుకోండి 'అని ఇద్దరికీ గట్టిగా క్లాస్ పికుతాడు. ప్రభావతి కూడా ముందు మీనా ఇంటికి వెళ్లి పత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని రా అంటూ బాలుని పంపిస్తుంది. తీరా ఇంటికి వెళ్లేసరికి మీనా కనిపించకపోవడంతో బాలు వెంటనే గుడికి వెళ్తాడు. కానీ గుడి దగ్గర కూడా కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక బాలు నెత్తి పట్టుకుంటాడు. పైగా ఫోన్ కూడా లిప్ట్ చేయదు. ఈ క్రమంలో డబ్బు కోసం బాలు తనకు తెలిసిన వారిని అడుగుతుంటాడు.

మరోవైపు.. మీనా తన తల్లి ఓ పూజారినీ దగ్గరికి .. మీనా జాతకం గురించి అడిగి తెలుసుకుంటారు. మా అమ్మాయి అడుగు పెట్టిన ఇంట్లో ఎప్పుడూ గొడవలే జరుగుతున్నాయని, ఇప్పుడు వాళ్ళ మామయ్యకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో ఉన్నారని, దాన్ని కూడా తన కూతురే కారణం అంటూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టారనీ.. ఆ తల్లికి చెప్పి బాధపడతారు. 'నువ్వు ఏం అధైర్య పడకు. కాలం నిన్ను పరీక్షిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు మా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. మీ మామయ్య త్వరలోనే కోరుకుంటాడు అంటూ భవిష్యవాణి చెబుతుంది. అయితే ఈ సమయంలో ఓ కంకణం ఇచ్చి తన మామయ్య కు కట్టమని చెబుతుంది. ఆ తల్లి చెప్పినట్లుగా.. ఆ కంకణాన్ని తన మామయ్యకు కట్టాలని హాస్పిటల్ కు బయలుదేరుతుంది మీనా.
మరోవైపు బాలు తన కారు ఓనర్ దగ్గరికి వెళ్లి అర్జెంటుగా తనకు నాలుగు లక్షలు కావాలని, తన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతాడు. దీంతో ఆ ఓనర్... నువ్వు అడిగితే నాలుగు లక్షలు ఏంటి.. పది లక్షలైనా ఇస్తాను. కానీ, ఇంటి పత్రాలు తీసుకురమ్మని, ఆ పత్రాలపై కుటుంబ సభ్యులంతా సంతకం చేయాలి అంటూ కండిషన్ పెడతాడు.. ఎంత రిక్వెస్ట్ చేసిన పట్టించుకోడు. తాను మనుషుల్ని నమ్మనని, పేపర్స్ ని మాత్రమే నమ్ముతాననీ చెబుతాడు. తన బాధ అర్థం చేసుకోమని ఎంత ప్రాధేయపడిన ఓనర్ పట్టించుకోడు పైగా వారి కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తాడు దీంతో ఆగ్రహం వచ్చిన బాలు. తన ఓనర్ ను కొడుతాడు. దీంతో సెక్యూరిటీ వచ్చి బాలును బయటకు గెంటివేస్తారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బాలుకి కాల్ చేసి.. కారు అమ్ముతావా అని అడుగుతాడు. వెంటనే ఓకే చెప్తాడు బాయ్. మరోవైపు రవి తన చెల్లికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతాడు. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని మీనా చెప్పడంతో రవి హాస్పిటల్ కి బయలుదేరుతాడు.


Click it and Unblock the Notifications











