Gunde Ninda Gudi Gantalu November 1st Episode: మరోసారి రవికి ఘోర అవమానం.. సత్యం ఆపరేషన్ కోసం ప్రభావతి త్యాగం..
Gunde Ninda Gudi Gantalu November 1st Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లూక్కేయండి.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం ఫ్రెండ్ రంగా వచ్చి యూనియన్ ఆఫీసులో కూడా తాను అడిగి చూసాననీ, కానీ వాళ్లు లోన్ ఇవ్వలేమంటూ నిరాకరించారని చెప్పుతాడు. ఇంటి డాక్యుమెంట్ దొరకపోవడంతో నిరాశతో హాస్పిటల్ కు చేరుకుంటాడు. ఈ సమయంలో మనోజ్ పై అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో మరోసారి బాలుకు మనోజ్ లకు గొడవ జరుగుతోంది. మరోవైపు .. మీనా తన మామయ్య గురించి పూజలు చేస్తోంది. ఈ సమయంలో ఓ అమ్మ కంకణం ఇచ్చి తన మామయ్యకు కట్టామని చెబుతోంది. డబ్బు కోసం వెళ్లగా.. బాలుకు తన బాస్ కు మధ్య గొడవ జరుగుతోంది. దిక్కు తోచని పరిస్థితి బాలు తన కారును అమ్మకానికి పెడుతాడు. మరోవైపు రవి తన చెల్లికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతాడు. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని మీనా చెప్పడంతో రవి హాస్పిటల్ కి బయలుదేరుతాడు.

శుక్రవారం ఏపిసోడ్ .. శుక్రవారం సీరియల్ ప్రారంభం కాగానే రవి తన చెల్లికి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటాడు. తాను ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారని, మెయిన్ గా నాన్న తనని వెళ్ళగొట్టడం చాలా బాధేస్తుంది. ఒక్కసారి తనతో మాట్లాడాలని ఉంది అంటాడు. దీంతో ఎమోషనల్ అయినా మౌనిక.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, డబ్బుల కోసం అన్నయ్య తిరుగుతున్నాడని, పరిస్థితి దారుణంగా ఉందని చెబుతుంది. దీంతో రవి తాను వెంటనే వస్తున్నానని చెప్తాడు. ఈ విషయం శృతికి చెప్పడంతో.. శ్రుతి రెండు లక్షలు ఇచ్చి హాస్పిటల్ కి పంపిస్తోంది.
మరోవైపు బాలు తాను ఇష్టంగా కొన్న కారు అమ్మేస్తాడు. ఇలా ఆపరేషన్ కు మూడు లక్షలు సమకూరుస్తాడు. మరోసారి ప్రభావతి.. రోహిణి దగ్గరికి వచ్చి మీ నాన్నకి ఫోన్ చేసి అడిగావా? అని ప్రశ్నిస్తుంది. తాను చాలా ప్రయత్నించననీ, కానీ, తన నాన్న ఫోన్ కలవడం లేదంటూ మరోసారి అబద్దం చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో నే డాక్టర్ వచ్చి, పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని ఆపరేషన్ కు డబ్బులు కట్టారా? లేదా? అంటూ ప్రశ్నిస్తాను.
ప్రభావతి లేదని సమాధానం ఇవ్వడంతో మీకు అసలు సీరియస్ నెస్ లేదంటే డాక్టర్ తిడతాడు.

ఇంతలోనే బాలు హాస్పిటల్ కు చేరుకుంటాడు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చావా? అని ప్రభావతి ప్రశ్నించగా.. ఆ పత్రాలు దొరకలేదు.. మీనా కూడా దొరకలేదు అంటూ సమాధానం చెప్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని పారిపోయిందా? అంటూ మీనాపై ప్రభావతి నింద వేస్తుంది. దీంతో బాలుకి కోపం వచ్చి.. వాటిని తీసుకెళ్లి నాలుక గీసుకుంటున్నది. ఎవరి సంతకాలు లేకుండా ఏం చేయలేము అంటూ ఎగళాలి చేస్తాడు. ప్రస్తుతం తాను 3 లక్షల రూపాయలు తీసుకువచ్చానని చెప్తాడు.
దీంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు.ఎంత డబ్బు ఎలా తీసుకొచ్చావ్ అంటూ ప్రశ్నిస్తారు. తనకు ఇష్టమైన కారు అమ్మేసానని ఆ కారు అమ్మగా మూడు లక్షలు రూపాయలు వచ్చాయనీ, నాన్న కంటే తనకు ఎక్కువ లేదంటాడు. ఆ డబ్బులు కట్టడానికి రిసెప్షన్ కు వెళ్తాడు. ఈ విషయాన్ని మీనా దూరంగా ఉంది పరీక్షిస్తుంది. ఇంతలో రవి హాస్పిటల్ కు చేరుకుంటాడు.రవిని చూడగానే ప్రభావతికి ఎక్కడలేని కోపం వస్తుంది. నీ వల్లే తన తండ్రి కి ఈ పరిస్థితి వచ్చిందని, అటు వీధిలో పరువు, సమాజంలో గౌరవం పోయిందని నానా మాటలు తిడుతుంది. ఈ క్రమంలో మనోజ్ కూడా సీరియస్ అవుతాడు. నీకు నాకు ఎప్పుడు గొడవ లేదు. కానీ, నువ్వు ఇక్కడి నుండి వెళ్లకపోతే.. తానే కొట్టి పంపిస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు. తాను మనం చూడాలని ఎక్కడ ఉన్నాడో.. తన పరిస్థితి ఎలా ఉందో చెప్పమని తన తల్లినీ రిక్వెస్ట్ చేస్తాడు రవి.

మనోజ్ గాడు ఇంట్లో నుండి వెళ్లినప్పుడు డబ్బు మాత్రమే అయిపోయింది. నువ్వు ఇంట్లో ఉండి వెళ్ళిపోతే.. నాన్న నేను కాపాడుకుంటూ వస్తున్న పరువు మర్యాద గౌరవం అన్ని పోయి.. ఆఖరికి చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా ఏం చూడాలని ఇక్కడికి వచ్చావు అంటూ రవి పై బాలు మండిపడతాడు. అయినా రవి..తాను కచ్చితంగా నానని చూసే వెళ్తాననీ అంటాడు. నువ్వు ఎప్పటికైనా నా చేతుల్లోనే చావాలని, అదే కోరుకుంటే ఇక్కడే ఉండు. అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఐసీయూలోకి వెళ్దామని రవి ప్రయత్నించగా.. ఒక్కసారిగా రవిని లాగి కింద పడేస్తాడు. కొట్టుకోవడానికి విషయం కాదంటూ అంటాడు.
నాన్న ఆపరేషన్ కోసం తాను డబ్బులు తెచ్చానని, ఆ డబ్బులు కట్టి బ్రతికించండి అంటూ రవి రిక్వెస్ట్ చేస్తాడు. అయినా అక్కనుండి ముందు వెళ్లి పొమ్మంటూ అందరూ చెప్పడంతో ఏం మాట్లాడాలో లేక సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మరి మిగతా రెండు లక్షల కోసం ప్రభావతి తన గాజులు బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది. ఆయన కన్నా తనకు బంగారం ఎక్కువ కాదని ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని బాలుకి ప్రభావతి చెప్తుంది.


Click it and Unblock the Notifications











