Gunde Ninda Gudi Gantalu November 4th Episode: ఆపరేషన్ సక్సెస్.. బాలుపై సత్యం ఆగ్రహం.. అసలు విషయం బయటపడేనా?
Gunde Ninda Gudi Gantalu November 4th Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరో లూక్కేయండి.
శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో రవి తన చెల్లి మౌనిక కు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని అడగగా.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, అన్నయ్యలు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతుంది. దీంతో వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఈ సమయంలో శృతి ఖర్చులకోసం అంటూ రెండు లక్షల రూపాయల చెక్ ఇచ్చి పంపిస్తుంది. మరోవైపు బాలు తన కారును అమ్మి 3 లక్షల రూపాయలను సమకూరుస్తాడు. ఇలా హాస్పటల్ లో రవిని చూసిన బాలు ఆగ్రహంతో ఊగిపోయి.. కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా.. అవమానించడంతో రవి వెళ్లిపోతాడు. మిగతా రెండు లక్షల రూపాయల కోసం ప్రభావతి తన బంగారు గాజులు, గొలుసు ఇచ్చి తాకట్టు పెట్టమని చెబుతోంది.

సోమవారం ఎపిసోడ్ లో సత్యం ను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్తారు. బాలు తన అమ్మ ప్రభావతి గాజులను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానని వెళ్తాడు. ఆపరేషన్ సక్సెస్ కావాలని పూజలు చేయడానికి గుడికి వెళ్తారు ప్రభావతి,రోహిణి. అప్పటికే మీనా అదే గుడికి వచ్చి.. తన మామయ్య ప్రాణాలు కాపాడమని దేవుని వేడుకుంటుంది. తన అత్తయ్య గుడికి రావడాన్ని గమనించి.. వారికి కనిపించకుండా దాక్కుంటుంది మీనా.ప్రభావతి తన భర్త ఆరోగ్యం మెరుగుపడాలని దేవుని కోరుకుంటూ కన్నీటి పర్యంతం అవుతుంది.
ఈ సమయంలో కూడా రవి, మీనాలను తిడుతూనే ఉంటుంది. వారి వల్లనే తన భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, రవి గాడి పెళ్లిని దగ్గరుండి జరిపించి, పైగా సాక్షి సంతకం పెట్టి.. సంసారం చేసుకోమని సాగనంపిందనీ మీనాపై నిందలు వేస్తుంది. ప్రభావతి గుడిలో ఉండడంతో ఇదే సరైన సమయమని తన మామయ్యకు తాయెత్తు కట్టడానికి హాస్పిటల్ లోపలికి వెళ్తుంది మీనా. ఇంతలోనే ఆపరేషన్ ముగించుకొని డాక్టర్లు బయటకు వస్తారు. ఆపరేషన్ సక్సెస్ అయిందనీ, ఆయనకు ఎలాంటి ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతారు.

దీంతో సంతోషం పట్టలేక బాలు డాక్టర్ కాళ్లపై పడతాడు. దీంతో డాక్టర్లు మా డ్యూటీ మేము చేశామని, మీ నాన్నను వెళ్లి చూడొచ్చని చెబుతారు. దీంతో బాలు, మనోజ్, రంగా కలిసి సత్యం ను చూడటానికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు.ఇంతలోనే నర్సు వచ్చి.. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని బాలు, మనోజ్ ను పిలుచుకొని వెళ్తుంది. ఇదే సరైన సమయమని మీనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తుంది. ఎవరు రాకుండా చూస్తానని సత్యం ఫ్రెండ్ రంగా వార్డు బయట ఉంటాడు. దీంతో మీనా వెళ్లి తన మామయ్యకు తాను తెచ్చిన కంకణం కడుతుంది.
మరో వైపు .. ప్రభావతి లోపలికి రావడంతో మీనాకు రంగా ఫోన్ చేసి బయటకు రమ్మని చెబుతాడు. దీంతో తన అత్తమ్మ కంటబడకుండా బయటకు వస్తుంది. ప్రభావతి వాళ్లు ఆపరేషన్ థియేటర్ల లోపలికి వెళ్లగానే మీనా వచ్చి రంగాకు థ్యాంకు చెప్పుతుంది. తనకు మంచి రోజుల వస్తాయనీ, భాదపడకని ధైర్యం చెప్పి.. మీనా అక్కడి నుంచి పంపిస్తాడు రంగా. మరోవైపు.. హాస్పటల్ లో జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు రవి.


Click it and Unblock the Notifications











