Gunde Ninda Gudi Gantalu November 5th Episode: సత్యం మాటలకు బాలు పశ్చాత్తాపపడేనా ? మీనాపై ప్రభావతి మరో కుట్ర ?

Gunde Ninda Gudi Gantalu November 5th Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్ కు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్న సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్స్ లో 'స్టార్ మా (Stra MAA)' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరో లూక్కేయండి.

సోమవారం ఎపిసోడ్లో తన తండ్రి హాట్ ఆపరేషన్ కొరకు బాలు తన తల్లి ప్రభావతి ఇచ్చిన గాజులను తాకట్టు పెట్టి డబ్బులను తీసుకొని వస్తాడు. ఆపరేషన్ సక్సెస్ కావాలని మీనా గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది. అదే గుడికి ప్రభావతి, రోహిణిలు వస్తారు. వారిని గమనించిన మీనా.. తన మామయ్యకు తాను తెచ్చిన కంకణం కట్టడానికి ఇదే సరైన సమయమని హాస్పిటల్ కి వెళుతుంది. మీనా హాస్పిటల్ చేరుకునే సమయానికి సత్యం ఆపరేషన్ పూర్తి అవుతుంది. డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని బాలు మనోజులకు చెబుతాడు. అదే సమయంలో తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడాలని డాక్టర్ వారిని పిలుస్తాడు. ఈ సమయంలో రంగ సహాయంతో తన మామయ్యకు మీనా తాయత్తు కట్టి వస్తుంది. సత్యం ఆపరేషన్ సక్సెస్ కావడంతో ప్రభావతి కూడా సంతోషపడుతుంది.

మంగళవారం ఎపిసోడ్ లో రవి హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చే బాధ పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించిన శృతి తన దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది. నువ్వేం మోసం చేయలేదని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, అన్ని త్వరలోనే సెట్ అవుతాయని రవికి ధైర్యం చెబుతుంది. మరోవైపు సత్యం స్పృహలోకి వస్తాడు. దీంతో ప్రభావతి సంతోషం పట్టలేక ఏడుస్తుంది. 'నేను బాగానే ఉన్నాను కదా.. ఎందుకు ఏడుస్తున్నావు? ' అని ప్రభావతిని సత్యం అడుగగా.. 'మీరు అలా గుండెపోటుతో కింద పడిపోతే.. ఎంతటి బాధను అనుభవించానో తెలుసా..' అని బదులిస్తుంది.

'నేను తలనొప్పితో బాధపడితేనే డ్యూటీకి వెళ్లొద్దని వాదించేదానివి. అలాంటివి గుండె నొప్పితో బాధపడుతుంటే.. నువ్వు ఎంతటి బాధను అనుభవించానో నేను అర్థం చేసుకోగలను' అని ప్రభావతిని సత్యం ఓదారుస్తాడు. ఇంతలోనే బాలు తన తండ్రి దగ్గరకు వస్తాడు.ఎలా ఉంది నాన్న ఆరోగ్యం అని ప్రశ్నిస్తాడు. 'ఇప్పుడు నేను బానే ఉన్నాను' అని చెప్పుతాడు తండ్రి సత్యం. వెంటనే బాలు ' క్షమించు నాన్న.. ఆ రోజు ఇంట్లో అలా గొడవ పడటం వల్లే నీకెలా...' అంటూ బాధపడతాడు. దీంతో సత్యం ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయరా .. దాని గురించి ఇప్పుడు ఎందుకు అంటూ బాలుకు నచ్చచెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 286 November 5th 2024 here is full story

ఇదే సమయంలో ఈరోజు డాక్టర్ డిశ్చార్జ్ చేయొచ్చని చెప్తాడు. ఇంతకీ రోహిణి, మనోజ్, మౌనిక, రవి మీనా ఎక్కడ ఉన్నారని సత్యం ప్రశ్నిస్తారు. మనల్ని కాదని వెళ్లిపోయిన వారి గురించి పట్టించుకోవద్దు అంటుంది ప్రభావతి. ఇంతలోనే బాలు తన తల్లికి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు. నిజంగా నాకే తెచ్చావా అని ప్రభావతి ప్రశ్నించగా.. నేను నా తల్లి శ్రీమతి ప్రభావతి దేవి కోసమైతే టిఫిన్ తెచ్చానని, నిన్నటి నుంచి నువ్వు ఏమి తినలేదు కదా అమ్మ తినమని బాలు చెప్తాడు.

'ఓ కీడు..మరో మేలు కోసమే' అన్నట్లు.. నాకు ఇలా జరగడం వల్ల ఓ తల్లి కొడుకులను ఇలా చూస్తున్న అంటూ సత్యం సంతోషపడతాడు. ఆ తరువాత .. సత్యంను డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకెళ్తారు. అనంతరం సత్యం దగ్గరికి బాలు వచ్చి 'నాన్న మీకు ఏమైనా కావాలని ప్రశ్నించగా.. నాకు ఓ మాట కావాలి' అంటాడు సత్యం. ఇంతకీ నీకు మనోజ్ ఏమౌతాడు. రోహిణి కు ఏమౌతోంది. అన్నా తండ్రితో సమానం.. వదిన తల్లి తర్వాత తల్లి అవుతుంది. వారికి క్షమపణ చెప్పమని బాలుకు అర్డర్ వేస్తాడు సత్యం.

Gunde Ninda Gudi Gantalu serial today episode 286 November 5th 2024 here is full story

దీంతో బాలు.. రోహిణి దగ్గరకు వెళ్లి.. నా కోపం ఎప్పుడూ వాడి మీద తప్ప..నీ మీద లేదు. క్షమించమని అడుగుతాడు. నాన్న వీడి గురించి పట్టించుకోవద్దు.. మళ్లీ మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే లక్షల్లో ఖర్చు అయింది అంటూ.. మనోజ్ హాస్పటల్ బిల్లు గురించి మాట్లాడుతాడు. దీంతో మౌనికకు కోపం వచ్చి.. ఒక రూపాయి అయినా తెచ్చి కట్టావా..? ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ కోపడుతుంది.

ఇంతకీ బిల్లు కట్టారని ప్రశ్నిస్తాడు సత్యం .. బాలు తన కారును అమ్మి బిల్లు కట్టాడని చెప్పుతుంది. అంత డబ్బా అవసరమైనప్పుడు ఇంటి పత్రాలు ఉన్నాయి కదా అవి తాకెట్టు పెట్టి తీసుకురావాల్సింది కదా అని సత్యం అడుగుతాడు. ఇంకెక్కడి పత్రాలు పోయేది అది పోక. మీనా పత్రాలు పట్టుకుని పారిపోయిందని ప్రభావతి నింద వేస్తుంది. మీనా ను అపార్థం చేసుకోవడం ఆపుతావా .. ఆ పత్రాలు అదే రోజు మీనా తనకు చేతికిచ్చిందని చెబుతాడు సత్యం. దీంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X