Gunde Ninda Gudi Gantalu: తండ్రి మాటకు బాలు తలొగ్గేనా? మీనాను సత్యం క్షమించేనా? ప్రభావతి ఇంట్లోకి రానిచ్చేనా?

Gunde Ninda Gudi Gantalu November 6th Episode: 'స్టార్ మా (Stra MAA)' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu ) సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రవి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తలుచుకుంటూ.. బాధ పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించిన శృతి తన దగ్గరికి వెళ్లి ఓదారుస్తూ రవికి ధైర్యం చెబుతుంది. మరోవైపు ఆపరేషన్ పూర్తి అయినా తరువాత సత్యం స్పృహలోకి వస్తాడు. దీంతో ప్రభావతి సంతోషం పట్టలేక ఏడుస్తుంది.

తన ఆరోగ్య పరిస్థితి గమనించిన డాక్టర్లు వర్గా ఉందని డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. ఇలా ఇంటికి చేరుకున్న సత్యం.. బాలుతో మొదటగా రోహిణికి సారీ చెప్పిస్తాడు. అలాగే ఆపరేషన్ డబ్బులు ఇలా కట్టారని ప్రశ్నించగా.. బాలు కారుని డబ్బులు సమకూర్చాలని చెబుతుంది. అంతా అవసరం వచ్చినప్పుడు ఇంటికి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తే సరిపోయేది కదా. అనవసరంగా కారు అమ్మాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు. డాక్యుమెంట్స్ తీసుకొని మీనా పారిపోయిందని ప్రభావతి ఆరోపిస్తోంది. ఆరోజు రాత్రి నేను తనకు డాక్యుమెంట్స్ ఇచ్చిందని అసలు విషయాన్ని బయటపడతాడు సత్యం. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 287 November 6th 2024 here is full story

ఇక నవంబర్ 6 గురువారం ఎపిసోడ్ లో బాలుతో సత్యం మాట్లాడుతూ.. మీనాను తీసుకొచ్చేంత వరకు తాను టాబ్లెట్లు వేసుకోమని గట్టిగా చెప్తాడు. ఈ క్రమంలో బాలు చెల్లి కూడా.. 'అన్నయ్య నువ్వు ఏం ఆలోచించొద్దు అమ్మ ఏదో ఒకటి చెప్పి చెడగొట్టక ముందే వదినను తీసుకురా' అంటూ చెబుతుంది. దీంతో ఏమి చేయాలో అర్థం కాని బాలు తన అత్తగారింటికి వెళ్తాడు. బాలును చూసిన తన అత్తగారు షాక్ అవుతారు. మరోవైపు తన కూతురిని తీసుకెళ్లడానికి వచ్చాడని సంతోషపడుతుంది. మీనా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.

ఈ క్రమంలో బాలుని ఇంట్లోకి పిలిచి, కూర్చోమని చెప్తుంది పార్వతి. మీ నాన్న కోసం మీనా గుడికి వెళ్లి దేవుని ప్రార్థించిందని, తాను కూడా వచ్చి మాట్లాడదామని అనుకున్నామని, కానీ ఇక్కడ కోపంగా మాట్లాడతారని ఆలోచించి ఆగిపోయామని చెబుతుంది. అన్ని బాగానే ఉన్నాయి గాని మీ కూతుర్ని పంపిస్తారా లేదా అంటూ బాలు అడుగుతాడు. ఇంటికి వెళ్దాం రమ్మని మీనా కు చెబుతాడు. కానీ, మీనా మాత్రం తాను రాను అంటూ మొండికేస్తుంది. పోలీస్ స్టేషన్ లో తనపై చేయి చేసుకున్నావని, ఇంటికి వస్తే మెడలు పట్టుకుని గెంటేసారని, హాస్పిటల్ కి వస్తే అవమానించి పంపించేసారని బాధపడుతుంది. తనకు ఆ ఇంట్లో మర్యాద లేదని, తాను రాను అంటూ బాలుకి చెబుతుంది.

మీనా మాటాలతో కోపం వచ్చిన బాలు తనకు కుడా తీసుకువెళ్లాలని లేదని, కానీ, తన పరిస్థితి బాగోలేక తీసుకువెళ్లాలని వచ్చాననీ ఆఇష్టంగా మాట్లాడుతాడు బాలు. ఇలా మాట్లాడితే ఎవరైనా వస్తారా అని మీనా ప్రశ్నిస్తుంది. నువ్వు కూడా ఇలా మాట్లాడితే బుద్ధి ఉన్న ఏ మగాడు కూడా తీసుకువెళ్లడని, కానీ, తాను మాత్రం తీసుకెళ్తానన్నాను. 'చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా' అన్నట్లు.. మా నాన్న నువ్వు రాకపోతే టాబ్లెట్లు వేసుకోని మొండిగా వ్యవహరిస్తున్నారనీ బాలు అసలు విషయాన్ని చెప్తాడు.

దీంతో మీనా ..' ఆదా అసలు సంగతి.. నన్ను తీసుకెళ్లాలని లేదు. నా మీద ఇష్టం లేదు. నా అంతటి నేను మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చినా రానిచ్చేవారు కాదు అంతేనా..' అంటూ మీనా ఫీల్ అవుతుంది. దీంతో కోపం వచ్చిన బాలు 'నిజాలు మాట్లాడుకోవడం మొదలు పెడితే.. రవిగాడి పెళ్లి నుండి.. సంతకం పెట్టి వారిని పంపించి వరుకు తాను అన్ని మాట్లాడాలి. ఆ విషయాలను మాట్లాడడం తనకు ఇష్టం లేదు' అంటూ వస్తావా? లేదా? అని మీనాను గట్టిగా ప్రశ్నిస్తాడు బాలు. మీనా తల్లి పార్వతి కూడా వెళ్తావా? లేదా? అంటూ బెదిరిస్తుంది. దీంతో మీనా చేసేది ఏమీ లేక.. 'మీ మీద ప్రేమతో కాదు.. మామయ్య గారి మీద గౌరవంతో వస్తా..' అంటూ బాలు కు చెబుతుంది.

అత్తగారింటికి పంపించే ముందు జాగ్రత్తగా ఉండాలని అంటూ మీనాకు పార్వతి మరీ మరి చెప్పి పంపిస్తుంది. మరోవైపు.. సత్యం తన కొడుకు మనోజ్ ను ఆఫీస్ కి వెళ్ళావా అంటే ప్రశ్నిస్తాడు. తాను లీవ్ పెట్టానని చెప్తాడు. అవసరం లేదు.. లీవ్ క్యాన్సల్ చేసుకొని చక్కగా ఆఫీసు వెళ్ళమని మనోజ్ కు చెబుతాడు. ఇంతలోనే మీనాను తీసుకొని బాలు ఇంటికి చేరుకుంటాడు. వచ్చి రాగానే ప్రభావతి మీనాపై నోరు పరేసుకుంటుంది. ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. ఏంటి ఆగిపోయావ్ అని సత్యం అనగా.. మీనా వచ్చి తన మామయ్య కాళ్లపై పడుతోంది. తాను ఏ తప్పు చేయలేదనీ, తనని క్షమించమని మీనా తన మామయ్య ను కోరుతుంది. ఈ పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడలేకపోతున్నానని, తన కొడుకులే తనని మోసం చేశారని, అంతా తలరాత అంటూ సత్యం బాధపడతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X