Gunde Ninda Gudi Gantalu November 7th Episode: మీనాపై ప్రభావతి ప్రతీకారం.. బాలుకు క్లాస్ పీకిన సత్యం..

Gunde Ninda Gudi Gantalu November 7th Episode: స్టార్ మా (Stra MAA) ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu ) సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో దీంతో బాలు తన అత్తగారింటికి వెళ్లి మీనా ను పంపించానని అడుగుతాడు. కానీ తాను మాత్రం ఆ ఇంట్లో కాలు పెట్టనని, చెయ్యనీ తప్పుకు తనని నిందిస్తున్నారని బాధపడుతుంది. పోలీస్ స్టేషన్లో తనపై చేయి చేసుకున్నారని, ఇంట్లో నుండి మెడలు పట్టుకుని బయటికి గెంటేసారని, హాస్పిటల్లో అవమానించి పంపించారని ఆవేదన చెబుతోంది.

తనకు తీసుకువెళ్లాలని లేదనీ, కానీ, తన తండ్రి మీనా వచ్చే వరకు టాబ్లెట్ వేసుకుని భీష్మంచి కూర్చొన్నాడని బాలు చెప్తాడు. అదా అసలు విషయం అంటూ.. అలాంటి ఇంట్లో తాను ఎలా కాలు పెట్టాలని ప్రశ్నిస్తుంది. ఈ క్రమం మీనా తల్లి పార్వతి తనకు నచ్చజెప్పి అత్తగారింటికి పంపిస్తుంది. ఇలా ఇంటికి చేరుకున్న మీనా ను చూడగానే ప్రభావతి మరోసారి తిడుతూ అవమానిస్తుంది. ఈ క్రమంలో మీనా.. తనని క్షమించమని తన మామయ్య కాళ్ళ మీద పడుతుంది. ఈ పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడలేకపోతున్నానని, తన కొడుకులే తనని మోసం చేశారని, అంతా తలరాత అంటూ సత్యం బాధపడతాడు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 288 November 7th 2024 here is full story

ఇక నవంబర్ 7 తేదీన గురువారం నాడు ఎపిసోడ్ లో ఇంటికి తిరిగి వచ్చిన మీనాపై ప్రభావతి నిందలు వేస్తుంది. రవికి దగ్గరుండి పెళ్లి చేసి, కుటుంబం పరువు బజార్ కు ఈడిచ్చిందని, దీని వల్లనే తన భర్త ఆరోగ్యం క్షీణించిందని, ఇంట్లో జరుగుతున్న అనర్ధాలకు మీనా అనే కారణం అంటూ నానా మాటలూ అంటుంది ప్రభావతి. మనోజ్ కూడా.. 'సాక్షి సంతకం చేసావంటేనే.. నువ్వే దగ్గరుండి.. మరి పెళ్లి చేశావని అర్థమవుతుంది' అని నిందిస్తాడు. ఇలా కుటుంబం మొత్తం మీనాపై నిందలు వేస్తుంది.

వారి సూటిపోటీ మాటలు వినలేక సత్యం కోపంతో.. 'ఇక చాలు.. మీ మాటలు ఆపుతారా.. మీరు ఎంత అవమానించినా.. తిరిగి ఇంటికి వచ్చిందంటేనే మీనా ఏ తప్పు చేయలేదని అర్థం అవుతుంది. మీరు ఎన్నిసార్లు తిట్టి పంపించినా.. నా ఆరోగ్యం బాగుండాలని తాయత్తు కట్టిందంటేనే కావాలని ఏ పొరపాటు చేయలేదని అర్థమవుతుంది' అంటూ మీనాను సపోర్టుగా నిలుస్తాడు సత్యం. ఈ క్రమంలో మరోసారి క్షమించమని తన మామయ్యను అడుగుతుంది. ఈ క్రమంలో సత్యం తన పంతం వీడి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఇలా మొత్తానికి మీనా తన అత్తగారింటికి తిరిగి వస్తుంది.

అనంతరం తన బెడ్ రూమ్ కి వెళ్లి.. 'ఇదే నా ఇల్లు.. ఇక్కడే నా జీవితం ఇప్పుడు బాలు కోపాన్ని తట్టుకునే శక్తి నాకు కావాలి 'అంటూ ఆ దేవున్ని ప్రార్థిస్తుంది. ఇంతలోనే బాలు కూడా బెడ్ రూమ్ కు వస్తాడు. 'తిన్నారా' అని బాలును ప్రశ్నించగా.. ' నాతో ఇక నుంచి మాట్లాడకు. రూమ్ లో బెడ్ ఉన్నట్టు.. ఆ బీరువా ఉన్నట్టు.. ఆ మూలన పడి ఉండు. నువ్వు కూడా ఒక వస్తువే నా దృష్టిలో'అంటూ మీనాను అవమానిస్తాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 288 November 7th 2024 here is full story

'ఆ ప్రేమంటే ఏమైంది? ' మీనా ప్రశ్నించగా.. 'పోలీస్ స్టేషన్ లోనే ఆ ప్రేమ పోయిందనీ, మా నాన్న నిన్ను క్షమించినా.. నేను మాత్రం క్షమించను' అని తేల్చి చెబుతాడు. దీంతో మీనా బాధపడుతూ.. కనీసం ఏ పరిస్థితి అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి అయినా.. ప్రశ్నించారా? అని అడుగుతుంది. దీంతో బాలుకు మరింత కోపం వస్తుంది. 'గుడికి వెళ్లి పంతులు అడగాలా.. రెస్టారెంట్ కెళ్ళి ఆ పెళ్లి కొడుకు అడగాలా.. సాక్షి సంతకం చేసిన రిజిస్టర్ ను అడగాలా.. ఎవరిని అడిగి ఏం జరిగిందో తెలుసుకోవాలి' అంటూ గట్టిగా అరుస్తాడు బాలు.

'నన్ను కత్తితో పొడిచి.. ఏ పరిస్థితుల్లో పోల్చానో తెలుసా.. అని అడిగినట్టుంది' అని మీనాను తిడుతాడు బాలు. దీంతో మీనాకు కోపంతో 'అపార్థం చేసుకుంటూనే ఉండండి. జీవితంలో మీరు బాగుపడరు' అంటూనే బాధపడుతుంది. అయినా జీవితాంతం నిన్ను క్షమించను అని తేల్చి చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు బాలు. హాల్ లోకి వచ్చే సరికి .. అక్కడ తన తండ్రి సత్యం హాల్లో కూర్చుని ఉంటాడు. తన తండ్రిని చూసిన బాలు.. ఇంకా పడుకోలేదా నాన్న అని ప్రశ్నిస్తాడు. 'లేదు రా.. నిద్ర రావట్లేదు' అని సత్యం సమాధానం ఇస్తాడు.

'దేని గురించి ఆలోచిస్తున్నావ్ నాన్న' అని మరోసారి తన తండ్రిని అడుగుతాడు బాలు. 'నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తున్నాను. నా కొడుకు కాపురం గురించి నేను ఆలోచిస్తున్నాను. అనవసరంగా ఇతరుల మాటలు పట్టించుకోని.. నీ జీవితాన్ని ఆగం చేసుకోకు. ఎవరో చేసిన తప్పు కు .. మీనా ను బలి చేయకు. మీనాతో సరిగా ఉండు అంటూ చెప్తాడు సత్యం. తన తండ్రి మాటలతో ఏకీభవించని బాలు...' నాన్న నువ్వు ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు. అలాంటి ఆ పోలీస్ స్టేషన్ లో అలా కూర్చోవడం నాకు బాధేస్తుంది' అని చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 288 November 7th 2024 here is full story

' రవి చేసిన తప్పును దాచి ఉంచాలని మీనా చూసింది తప్ప.. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని, నాకంత అవమానం జరగాలని ఎందుకు అనుకుంటున్నారా.. ఎన్నడూ తప్పు చేయని వాళ్ళు.. ఎవరైనా తప్పు చేస్తే.. ఎందుకు చేశారో అని అవతలి వాళ్లకు కూడా ఆలోచించాలిరా ' అంటూ బాలుకు క్లాస్ పీకుతాడు సత్యం. అయినా ఆ మాటాలకు కన్వీవీస్ కానీ బాలు.. ' నేను రవిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాను. అయినా.. దగ్గరుండి ఇలా చేసింది. నాన్న నీకు క్షమించే మనసు. ఉండవచ్చు. కానీ నాకు మాత్రం ఆ మనసు లేదు' అని మీనా తిడుతాడు బాలు.

మీనా తండ్రి లేని బిడ్డ... బాధ కలిగిన చెప్పుకోవడానికి ఇక్కడ నువ్వే అండగా ఉండాలి రా.. బిడ్డలు తప్పు చేస్తే తండ్రి ఎలా కడుపులో పెట్టుకుంటాడో .. భార్య వల్ల పొరపాటు జరిగితే భర్త కూడా క్షమించి వదిలేయాలిరా.. మీ అమ్మ నాకు తెలియకుండా ఇంటిని తాకట్టు పెట్టింది. అదే మీ అమ్మ పోలీస్ స్టేషన్ లోనూ .. హాస్పిటల్లోనూ నా కోసం గుండె పగిలేలా ఏడ్చింది ఎందుకురా' అంటూ బాలును కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు సత్యం. మరోవైపు.. రవి, శ్రుతిలు దీపావళి పండుగ జరుపుకోవడానికి షాపింగ్ చేస్తాడు. ఈ సమయంలో రవికి శ్రుతి గోల్డ్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X