Gunde Ninda Gudi Gantalu November 8th Episode: అవమానించిన ప్రభావతి.. ముక్కలైన మీనా మనసు.. రోహిణీ బండారం
Gunde Ninda Gudi Gantalu November 8th Episode: స్టార్ మా (Stra MAA) ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu ) సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇంటికి తిరిగి వచ్చిన మీనాపై ప్రభావతి నిందలు వేస్తుంది. ఇంట్లో జరుగుతున్న అనర్ధాలకు మీనా అనే కారణమంటూ తిడుతోంది. సూటిపోటీ మాటలు చాలు అని ప్రభావతిపై సత్యం కోపాడుతాడు. మీనాను క్షమించి ఇంట్లోకి రమ్మంటాడు సత్యం. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బాలు .. బెడ్ రూమ్ కు వెళ్లిన తరువాత నానా మాటలు అంటూ అవమానిస్తాడు. తనతో మాట్లాడవద్దని వార్నింగ్ ఇస్తాడు.
రవి పెళ్లి తాను చేయలేదని మీనా చెప్పిన బాలు అసలు వినిపించుకోడు. ఈ విషయాన్ని గమనించిన సత్యం.. అనవసరంగా ఇతరుల మాటలు పట్టుకుని నీ జీవితాన్ని ఆగం చేసుకోకు. రవి చేసిన తప్పుకు మీనా ను బలి చేయకు అని, మీనా కేవలం రవి చేసిన తప్పును దాచి ఉంచాలని చూసింది. కానీ, పోలీస్ స్టేషన్ లో పరువు తీయాలని భావించలేదు. ఎన్నడూ తప్పు చేయని మీనా తప్పు చేసిందని ఎలా అనుకుంటున్నావ్ అని బాలుకు క్లాస్ పీకుతాడు సత్యం. ఈ సమయంలో మీనాకు నువ్వే అండగా ఉండాని బాలుకు చెబుతాడు.

నవంబర్ 8 శుక్రవారం ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర మీనా రెచ్చిపోతుంది. బ్రేక్ఫాస్ట్ గా పూరి ఎందుకు చేసావని, పూరి తింటే అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందని,మామయ్య ఆరోగ్యం చెడిపోతుందని అవమానిస్తుంది. తాను మామయ్య కోసం ఇడ్లీ చేశాననీ, పూరీలు అంటే బాలుకు ఇష్టమని చేశానని చెబుతుంది. రోహిణి మాటలకు సత్యం కు కోపం వస్తోంది. 'పేరుపేరునా అడిగి ఆర్డర్ తీసుకోవడానికి ఇదేమైనా హోటల్ లా ? అని ప్రశ్నిస్తాడు. దీంతో రోహిణి కాస్తా సైలెంట్ అవుతోంది.
ఇంతలోనే బాలు వచ్చి 'నేనేమైనా పూరి చేయమని చెప్పానా? అని ప్రశ్నిస్తాడు. ఇదే అవకాశం అన్నట్లు ప్రభావతి.. 'అది చేసిన తప్పులను మర్చిపోవడానికి నీ మీద ఇలా ప్రయోగం చేస్తుంది? ' అని మీనాను ఎత్తిపొడుస్తుంది. అయినా.. మీనా చేతితో ఏది పెట్టిన తాను తిననిని టిఫిన్ చేయకుండా బాలు వెళ్లిపోతాడు. ఇంతలోనే మనోజ్ వచ్చి..' ఏం టిఫిన్ చేశారు? నన్ను పిలవరా?' అంటూ రోహిణి అడుగుతాడు. పక్కనే ఉన్న మౌనిక ..ఈరోజు పూరి చేశారని చెప్పగానే.. 'పూరి అంటే నాకు ఇష్టం' అని తినడానికి వస్తాడు మనోజ్. దీంతో రోహిణి అడ్డుపడి.. ఆయిల్ ఫుడ్ తింటే ఆరోగ్యం చెడిపోతుందని తాను వేరే టిఫిన్ చేస్తానని ప్రభావతి, మనోజ్ లను తీసుకొని వెళ్ళిపోతుంది రోహిణి. అయినా.. వాళ్లకు తినే అదృష్టం లేదమ్మ అంటూ మీనాకు సపోర్ట్ గా నిలుస్తాడు సత్యం.

ఇదిలా ఉంటే.. ఫైనాన్షియరుకు డబ్బులు కట్టాలని, తన ఫ్రెండ్ రాజేశ్ ను సహాయం కోరుతాడు బాలు. అనవసరంగా వాడితో గొడవపడి.. ఇక్కడ వరకు తెచ్చుకున్నావ్.. నీ కోపమే నీకు శత్రువుగా మారుతుంది. ఆ కోపాన్ని తగ్గించుకోరా.. అని బాలుకి సలహా ఇస్తాడు రాజేశ్. ఇంతలోనే బాలు కారు కొన్న వ్యక్తి కారు తీసుకొని వారి దగ్గరికి వస్తాడు. ఆ కారును చూసిన బాలు చాలా సంతోషపడతాడు. ఒకసారి డ్రైవ్ చేసి ఇస్తానని, కారును తీసుకెళ్తాడు. ఈ సమయంలో ఆ కారుతో తనకున్న అనుబంధాన్ని బాలు గుర్తుచేసుకుంటాడు. తనకు ఇష్టమైన కారు తన నుంచి మిస్ అయిందని చాలా ఫీల్ అవుతాడు బాలు. ఆ తర్వాత డాక్యుమెంట్ మీద సంతకాలు చేసి కారును అప్పగిస్తాడు.
ఇక మరోసారి బాలు పుల్ గా తాగి ఇంటికి చేరుకుంటాడు. ఈ విషయాన్ని గమనించిన మీనా గేట్ తీసి.. సైలెంట్ గా ఇంట్లోకి తీసుకెళ్తుంది. తినమని ఎంత బతికులాడిన బాలు తినకుండా.. మీనాను నానా మాటలు అంటాడు. మీనా వల్లనే తన ఇంట్లో నానా అనర్థాలు జరుగుతున్నాయనీ, ఆరోగ్యంగా ఉన్న తన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, కావాలని రవి శృతిల పెళ్లి చేశావని నిందిస్తాడు. ఈ క్రమంలో మీనా ఎంత చెప్పినా.. బాలు వినిపించుకోడు.పైగా తన వల్లనే తనకు ఇష్టమైనా కారును అమ్మేయాల్సి వచ్చిందనీ, తాను చచ్చే వరకు నమ్మను అని మీనాను మరోసారి అవమానిస్తాడు బాలు.
ఇంతలోనే పార్వతి తన కూతురు మీనాకు ఫోన్ చేస్తుంది. అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? వారు ఎలా చూసుకుంటున్నారు? అంటూ ప్రశ్నిస్తుంది. తన మామయ్య ఆరోగ్యం బాగుపడిందని, అందరూ తనని బాగా చూసుకుంటున్నారని తన తన తల్లికి అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మీనా తన తల్లితో ఫోన్ మాట్లాడిన విషయాన్ని చాటుగా ప్రభావతి గమనిస్తుంది. కోపంతో మీనా దగ్గరికి వచ్చి.. 'నీ తల్లికి ఏం చెప్తున్నావు ?'అంటూ మీనా ను నిలదీస్తుంది ప్రభావతి.

'ఇక్కడ విషయాలు అక్కడకి చేరవేస్తున్నావా? ' అంటూ తిడుతుంది. కుటుంబ పరువును రోడ్డుకీడ్చావ్.. అయినా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టావ్ అని అవమానిస్తోంది. 'అయినా..ఇంట్లో నీ ప్లాన్ ప్రకారమే నడుస్తుంది కదా.. ఏమీ తెలియని నా మొగుడిని నీ మాయమాటలతో మభ్య పెడుతున్నావ్.. కావాలని రవి శృతిలకు పెళ్లి చేశావ్.. ఇప్పుడు రోహిణి, మనోజులకు మధ్య గొడవలు సృష్టిస్తున్నావ్..' అంటూ మీనాపై నిందలు వేస్తోంది ప్రభావతి. అంతటితో కాకుండా.. 'మీ అమ్మ సూత్రధారి.. నువ్వు నాటకదారి' అంటూ మీనా తల్లిని కూడా తిడుతుంది. ఎన్నాళ్ళైనా నీ నాటకాలు ఇక్కడ సాగవు అంటూ.. ముల్లేముఠా సదురుకొని పోవాల్సిందే అంటూ.. మీనాను ప్రభావతి హెచ్చరిస్తుంది.


Click it and Unblock the Notifications











