Gunde Ninda Gudi Gantalu: డబ్బు కోసం ప్రభావతి తిప్పలు.. రోహిణి బాగోతం బయటపడేనా ?

Gunde Ninda Gudi Gantalu: స్టార్ మా (Star Maa)ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో.. మీనాపై రోహిణి రెచ్చిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు లాంటి ఆయిల్ ఫుడ్ చేయొద్దని, అలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదని మీనా పై ఫైర్ అవుతోంది. ఈ సమయంలో ప్రభావతి తన పెద్దకోడలు రోహిణికి సపోర్టుగా మాట్లాడుతుంది. ఆయిల్ ఫుడ్ తినడం వల్లే తన భర్త ఆరోగ్యం కూడా చెడిపోయిందని రోహిణికి వత్తాసు పలుకుతుంది.

తాను బాలు కోసం పూరీలు చేశానని చెప్పగా.. ఆ మాట విన్న బాలు నేను ఏమైనా చేయమని చెప్పానా ? అంటూ మీనా పై కోప్పడతాడు. మీనా ప్రేమతో చేసిన టిపిన్ తినకుండానే వెళ్లిపోతాడు. రోహిణీ, ప్రభావతి లు కూడా మీనా చేసిన టిఫిన్ నచ్చలేదంటూ.. అక్కడి నుండి వెళ్ళిపోతుంది.వారికి నీ చేతితో చేసిన పూరీలు తినే అద్రుష్టం లేదని మీనాకు సర్థి చెప్పుతాడు సత్యం. మరోసారి బాలు ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు.ఈ సమయంలో మీనాకు బాలుకు మధ్య వాద్వాగ్దం జరుగుతోంది. మీనా తన తల్లితో ఫోన్ మాట్లాడడానికి చూసిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. ఎన్నటికైనా ఇంట్లో నుండి వెళ్లి పోవాల్సి ఉంటుందని, మూళ్లే ముఠా సర్దుకొని సిద్దంగా ఉండమని మీనా ను హెచ్చరిస్తుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial today episode 290 November 11th 2024 here is full story

సోమవారం ఎపిసోడ్ లో ప్రభావతి చెప్పినట్లుగానే మీనా నడుచుకుంది. ప్రభావతి వంటింట్లోకి వచ్చి ఏం టిఫిన్ చేసావే.. అని మీనాను ప్రశ్నించగా.. 'మీరు ఏం చేయమంటే అది చేస్తాను అత్తయ్య' అంటూ బదులిస్తుంది. అయితే.. దోశలు పోయి..ఆర్డర్ చేస్తుంది ప్రభావతి. 'ఆ విషయం ముందే చెప్తే.. పిండి సిద్ధం చేసే దాన్ని' అని రిప్లై ఇస్తుంది. 'సరేలే ఇడ్లీ చెయ్యి..' అంటుంది. ఇడ్లీ రవ్వ లేదు అత్తమ్మ అంటూ మీనా సమాధానం ఇస్తుంది. 'ఇంకేముంది.. పూరీలు చేయి' అనగానే రోహిణి తన అత్తమ్మను చూస్తోంది. దీంతో ఏ టిఫిన్ వద్దులే అంటూ వంటింట్లో నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి. రోహిణి చేసే టిఫిన్ నచ్చక మనోజ్ ఆఫీస్ కి వెళ్తున్నానని బయటికి వెళ్లిపోతాడు.

ఇంతలో రోహిణి బాయ్ ఫ్రెండ్ దినేష్ కొరియర్ బాయ్ వేషంలో ఇంటికి చేరుకుంటాడు. కొరియర్ వచ్చిందంటూ పిలుస్తాడు. తొలుత మీనా వచ్చి ఏంటని ప్రశ్నిస్తుంది. 'రోహిణి అంటే మీరేనా? మీకు పార్సిల్ వచ్చింది' అని చెప్తాడు. దీంతో మీనా ఇంట్లోకి వెళ్లి .. 'నీకు పార్సిల్ వచ్చింది' అని రోహిణికి చెబుతోంది. 'నాకెవరు పార్సల్ పంపిస్తారు?' అని కంగారుపడుతుంది రోహిణి. 'మీ నాన్న గిట్ల .. దీపావళి పండుగ సందర్భంగా ఏమైనా గిఫ్ట్ పంపించాడేమో' అంటూ రోహిణి పంపిస్తుంది ప్రభావతి.

కొరియర్ బాయ్ గా వచ్చిన దినేష్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. అంతలోనే ప్రభావతి కూడా వచ్చి.. ఏం వచ్చింది? అని ప్రశ్నిస్తుంది. తాను ఏటీఎం కార్డు కోసం అప్లై చేశానని, అందుకు సంబంధించిన కొరియర్ అని చెప్పి తన తన అత్తయ్యను లోపలికి పంపిస్తుంది రోహిణీ.

Gunde Ninda Gudi Gantalu serial today episode 290 November 11th 2024 here is full story

ఆ తర్వాత.. అసలు నువ్వెందుకు ఇంటికి వచ్చావని, నా సంసారం నేను చేసుకుంటున్నా .. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావని దీనేష్ ను ప్రశ్నిస్తుంది రోహిణి. 'నువ్వు హ్యాపీగానే ఉన్నావ్.. నా జీవితం మాత్రం రోడ్డున పడేవ్.. అంతా నీ వల్లే. నా నెంబర్ బ్లాక్ చేస్తే.. ఇంటికి రాకుండా ఇంకా ఏం చేయాలి. నాకు డబ్బు కావాలి.. ఇస్తే వెళ్తా..' అని వర్ధన్ చెబుతాడు. దీంతో రోహిణికి కోపం వస్తుంది.. 'నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు.. నువ్వు డబ్బులు అడుగుతే.. ఎక్కడినుండి తీసుకురావాలి' అంటుంది.

'నా దగ్గర నీ రహస్యం ఉంది. ఆ సీక్రెట్ మీ ఇంట్లో వాళ్లకు చెప్పనా... లేదా రూ. 50000 ఇస్తావా..' అంటూ బ్లాక్ మైల్ చేస్తాడు దీనేష్. దీంతో 'ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తాను. దయచేసి ఎక్కడి నుండి వెళ్లిపో' అని దీనేష్ ను రిక్వెస్ట్ చేస్తుంది రోహిణి. 'రేపు సాయంత్రం లోగా.. డబ్బు ఇవ్వకపోతే సీక్రెట్ మీ ఇంట్లో వారికి చెప్తా' అని మరోసారి వార్నింగ్ ఇస్తాడు. అంతలోనే మీనా అక్కడికి చేరుకుంటుంది. తన సీక్రెట్ ఎక్కడ బయటపడిందోనని, టెన్షన్ పడుతుంది రోహిణి.

రోహిణి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే మనోజ్ వస్తాడు. ఇది మంచి సమయమని, పార్లర్ లో ఎంప్లాయిస్ కు దీపావళి బోనస్ ఇవ్వాలంటూ.. మనోజ్ ను డబ్బులు అడుగుతుంది రోహిణి. దీంతో దిక్కుతోనీ పరిస్థితిలో తన తల్లిని డబ్బులు కావాలని మనోజ్ బ్రతిమలాడుతాడు. చేసేది ఏమీ లేక సరేలే తాను చూస్తానని మనోజ్ కు మాట ఇస్తుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial today episode 290 November 11th 2024 here is full story

మరోవైపు బాలు హ్యాంగ్ అవర్ తో బాధపడుతుంటాడు. ఇంతలోనే మీనా వెళ్లి మజ్జిగ ఇస్తోంది. కానీ, మీనా ఇచ్చిన మజ్జిగ తాగడం ఇష్టం లేక తానే.. మజ్జిగ రెడీ చేసుకుంటానని కిందికి వస్తాడు బాలు. ఈ సమయంలో తన తండ్రి ఎదురుపడి ఏమైందని ప్రశ్నిస్తాడు. కాస్త తలనొప్పిగా ఉందని, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని డొంకతిరుడుగా సమాధానం ఇస్తాడు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న సత్యం మీనాను మజ్జిగ తీసుకురమ్మని చెబుతాడు. మీనా వెంటనే మజ్జిగ తీసుకువచ్చి ఇస్తుంది. దీంతో చేసేది ఏమీ లేక.. మీనా చేసిన మజ్జిగనే తాగి బాలు సైలెంట్ గా వెళ్ళిపోతాడు.

ఈ సమయంలో బాలు ఎలా ఉంటున్నానని సత్యం ప్రశ్నిస్తాడు. కాస్త టైం పడుతుంది, అయినా ఆయనకు తనపై కోపం కంటే.. నీపైనే ఎక్కువ గౌరవం ఉందని చెబుతోంది మీనా. 'నీ సహనమే నీకు శ్రీరామరక్ష' అని మీనాకు ధైర్యం చెప్పి పంపిస్తాడు సత్యం. మరోవైపు ప్రభావతి.. కామాక్షి దగ్గరికి వెళ్లి అప్పుగా డబ్బులు కావాలని అడుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X