Gunde Ninda Gudi Gantalu November12: కామాక్షి ఉచిత సలహా.. ప్రభావతి మాస్టర్ ప్లాన్..

Gunde Ninda Gudi Gantalu November12 episode: సోమవారం ఎపిసోడ్లో రోహిణి బాయ్ ఫ్రెండ్ దినేష్ కొరియర్ బాయ్ వేషంలో ఇంటికి వచ్చి బెదిరిస్తాడు. తనకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తాడు. లేదంటే తన రహస్యాలను బయటపెడతానని రోహిణీని బ్లాక్ మెయిల్ చేస్తాడు. రెండు రోజులలో తనకు రూ. 50,000 లు ఇవ్వాలని, లేకపోతే.. తన బండారం బయటపెడుతానని బెదిరిస్తాడు. దీంతో ఎలాగైనా డబ్బులు సమకూర్చాలని రోహిణి ఆలోచిస్తుంది. ఈ సమయంలో తన భర్త మనోజు దగ్గరకు వెళ్లి.. పార్లర్ లో ఎంప్లాయిస్ కు పండుగ బోనస్ ఇవ్వాలని, తనకు రూ. 50,000 ఇవ్వమని అడుగుతుంది.

తన దగ్గర డబ్బులు లేవంటే.. ఎక్కడ తాను జాబ్ చెయ్యట్లేదనే విషయం బయట పడుతుందని మనోజ్ సరే అంటాడు. ఆ తరువాత మనోజ్ తన తల్లి ప్రభావతి దగ్గరి వెళ్లి.. జరిగిన విషయం చెప్పుతాడు. ఎలాగైనా డబ్బులు సమకూర్చాలని బ్రతిమలాడుతాడు. దీంతో కొడుకు సీక్రెట్ ఎక్కడ బట్టపడుతుందోననీ సరే అని మాటిస్తోంది ప్రభావతి. ఈ క్రమంలో మీనాక్షిని గుడి రమ్మని పిలుస్తోంది ప్రభావతి. తనకు రూ. 50000 కావాలని, ఎలాగైనా సర్దుబాటు చేయమని బ్రతిమిలాడుతోంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 291 November 12th 2024 here is full story

ఇక మంగళవారం ఎపిసోడ్ లో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రభావతి చూసి జాలిపడుతుంది మీనాక్షి. తన దగ్గర అంత మొత్తం లేదని కావాలంటే 25000 ఇస్తానని చెబుతోంది. ఈ సమయంలో ఓ ఉచితం సలహా ఇస్తోంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తానంటే వెళ్లగొడుతున్నావని, తలుపులు తెరిచి ఇంట్లోకి ఆహ్వానించని చెబుతుంది మీనాక్షి. ఆ మాటలు ప్రభావతి అర్థం కావు.. లక్ష్మీదేవి ఏంటి? నేను అడ్డుకోవడం ఏంటి? అని కామాక్షిని తిరిగి ప్రశ్నిస్తోంది. 'అదే మీ చిన్న కోడలు..రవి గాడి పెళ్ళాం.. వాళ్ళు కోట్లకు పడగలెత్తినవాళ్లు. శృతి నాన్న సురేంద్రకు అమరావతిలో ఎన్నో ఎకరాల భూమి ఉన్నాయి' అని మీనాక్షికి చెబుతోంది

అలాంటి కోడలును ఇంటికి తెచ్చి పెట్టుకుంటే.. సమస్యలన్నీ పోతాయని పైగా నువ్వే లక్షలు లక్షలు డబ్బులను మిత్తిలకు తిప్పవచ్చునని ప్రభావతికి మీనాక్షి సలహాస్తోంది. అసలు మీనా మంచి పని చేసిందనీ, కోటిశ్వరాలుతో రవి పెళ్లి చేసిందని, నీకు కోడలుగా తీసుకవచ్చిందని చెబుతోంది. మీనా చేసింది క్షమించరాని తప్పు అని వారిస్తోంది. కానీ, మీనాక్షి మాటలతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. తనకు రవిని ఇంట్లోకి రమ్మని పిలవాలని ఉన్నా.. బాలు, మనోజ్ లు చాలా సీరియస్ గా ఉన్నారని, బాలు ఎట్టి పరిస్థితుల్లో రవిని ఇంట్లోకి రానివ్వరని చెబుతోంది ప్రభావతి. ఇలాంటి సమయంలోనే తెలివిగా వ్యవహరించాలని, గుమ్మం వరకు వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలువమని మీనాక్షి చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 291 November 12th 2024 here is full story

మరోవైపు తినకు వెళ్లిన బాలుకు మీనా టిఫిన్ తీసుకొని వెళ్తుంది. దీంతో బాలుకు మళ్లీ కోపం వస్తోంది. తనకు ఆకలిగా లేదని, టిఫిన్ ఎందుకు తీసుకొచ్చావని ఫైర్ అవుతాడు బాలు. ఎంతో కష్టపడి, నీకు ఇష్టమైన చాపల కూర వండుకొని తీసుకోవచ్చానని మీనా చెబుతోంది. అయినా తనకు ఆకలిగా లేదని మొండిగా చెబుతాడు బాలు. చేపల కూర అనగానే.. బాలు ఫ్రెండ్ అరవింద్ టెమ్ట్ అవుతాడు. వాడు తినకపోతే తినపోనీయమ్మ.. నేను తిని పెడుతాను అంటూ.. చేపల కూరను ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు.

బాలు మరో ఫ్రెండ్ రాజేష్ కూడా.. చేపల కూర చూసి ఆగలేక..తనకు కూడ పెట్టమని వెళ్లి..చాపల కూరను లొట్టలు వేసుకుంటూ తింటాడు. మీనా ను పొగడ్తలతో ముంచెత్తుతారు. తాను ఇక్కడే ఉంటే బాలు తినడానికి.. అర్థం చేసుకొని మీనా ఇంటికి వెళ్లిపోతుంది. మీనా వెళ్ళగానే.. తన కోపాన్ని, పంతాలను, పట్టింపులన్నింటిని పక్కనపెట్టి వచ్చి బాలు కూడా వచ్చి తింటాడు. ఇలా బాలు ఆకలి తీరుస్తోంది మీనా.

Gunde Ninda Gudi Gantalu serial today episode 291 November 12th 2024 here is full story

మరోవైపు శృతి రవిలను ఇంటికి ఎలా తీసుకురావాలని ప్రభావతి ఆలోచిస్తుంది. ఈ సమయంలోనే మనోజ్ ఇంటికి వస్తాడు. పిలిచి మనోజ్ కు డబ్బులు ఇస్తుంది ప్రభావతి. ప్రతిసారి ఇలా డబ్బులు అడిగి తనని ఇబ్బందులకు పెట్టవద్దనీ, ఇప్పటికైనా ఎదొక జాబ్ చూసుకోమని మనోజ్ కు సలహా ఇస్తుంది. సరే అంటూ తన తల్లి ఇచ్చిన డబ్బులను తీసుకుని వెళ్లాడు మనోజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X