Gunde Ninda Gudi Gantalu November 13: రోహిణీకి మరోసారి బెదిరింపులు.. మీనా తల్లికి అవమానం.. బాలుకు బిగ్ షాక్.
Gunde Ninda Gudi Gantalu November 13 Episode: మంగళవారం ఎపిసోడ్ లో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రభావతి చూసి జాలిపడుతుంది మీనాక్షి. తన దగ్గర అంత మొత్తం లేదని, కావాలంటే రూ.25,000 ఇస్తుంది. కోటీశ్వరాలు అయినా శృతిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే.. ప్రతి విషయానికి ఇతరులను డబ్బు అడిగే ప్రసక్తి రాదని, శృతిని రవిని ఇంటికి పిలువమని, లేకపోతే రవిని శృతి ఇల్లరికం తీసుకపోతుందని మీనాక్షి చెబుతోంది. మీనాక్షి చెప్పిన మాటలకు ఆలోచనలో పడుతుంది ప్రభావతి.
అలా ఇంటికి చేరుకున్న రవిని ఎలా పిలవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఇంటికి వస్తాడు. అతనికి డబ్బు ఇచ్చి.. ఇకనుండి తనని డబ్బులు అడగవద్దని, ఏదైనా ఉద్యోగం చూసుకోమని ప్రభావతి మనోజ్ కు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు తినకుండా వెళ్లిన బాలుకి మీనా భోజనం తీసుకొని వెళ్తుంది. తాను తిననని మొండికేస్తాడు. కానీ, తన ఫ్రెండ్స్ మీనా తెచ్చిన భోజనాన్ని తనకు మిగిల్చకుండా తింటుండడంతో బాలు కూడా వెళ్లి తింటాడు.

బుధవారం ఎపిసోడ్ లో సత్యం తల్లి ఫోన్ చేసి.. అతని యోగక్షేమాలను అడుగుతుంది. తనకు రోజు పీడ కలలు వస్తున్నాయని, తనకు ఆందోళనగా ఉందని చెబుతోంది. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం సెట్ అయిందని సత్యం చెబుతాడు. అయితే.. దీపావళి పండుగకు ఇంటికి రమ్మని సత్యం తల్లి పిలుస్తుంది. కానీ ప్రభావతి రాలేమని చెబుతోంది. తాను రవికి మంచి పిల్లను చూసానని, ఒకసారి ఆ అమ్మాయిని చూడ్డానికి రమ్మని, దీపావళి కూడా అందరం కలిసి చేసుకోవచ్చని చెబుతోంది. తాము సంక్రాంతికి ఎలాగో వస్తామని, ఇప్పుడు అనవసరంగా ఖర్చులు ఎందుకని సత్యం సర్ది చెబుతాడు.
ఇదెలా ఉంటే.. మనోజ్.. రోహిణి దగ్గరకు వెళ్లి.. తనకు బోనస్ ఇచ్చారని తన తల్లి ఇచ్చిన డబ్బులను ఇస్తాడు. సంక్రాంతికి కూడా బోనస్ ఇస్తారు అప్పడు కూడా ఖచ్చితంగా అడిగి తీసుకోమ్మని చెప్పుతోంది రోహిణీ. ఇక ఎక్కువ మాట్లాడితే.. అసలు విషయం బయటపడుతోందని, తనకు పని ఉందని బయటపడుతాడు మనోజ్.. ఆ తర్వాత రోహిణీ .. దినేష్ కు ఫోన్ చేసి డబ్బులు రెడీ చేశానని చెబుతుంది. దీంతో తాను చొప్పున చోటు రమ్మని చెబుతాడు.

రోహిణీ టెన్షన్ పడుతూ.. డబ్బులు తీసుకెళ్లి దినేష్ కు ఇస్తుంది. ' నేను అడిగినంత ఇవ్వకుండా.. కేవలం 25 వేలు మాత్రమే ఇవ్వడమేంటి? నేనేమైనా బిచ్చగాడినా? నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది? నేనిప్పుడు అడిగితే.. అప్పుడు డబ్బులు ఇవ్వాలి' అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో చిరాకు వచ్చిన రోహిణి 'ఏం చేసుకుంటావో.. చేసుకోపో' అని అంటుంది. దీంతో దినేష్ కు మరింత కోపం వస్తుంది. 'అయితే.. జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉంటే.. ఇకనుండి వెళ్ళిపో..' అని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
దీనేష్ మాటలకు రోహిణీ ఆగిపోతుంది. తనకు వీలైనంత డబ్బులు సమకూర్చానని, తన దగ్గర డబ్బులు లేవని రిక్వెస్ట్ చేసుకుంటుంది. తనకు మాత్రం డబ్బుల విషయంలో చాలా స్ట్రీట్ గా ఉంటాననీ, మరో వారం 10 రోజులలో మిగతా డబ్బు సమకూర్చమని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు దీనేష్.
మరోవైపు పార్వతి.. మీనా ఇంటికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తోంది. నీలాంటి వాళ్లు నా ఇంట్లో కాలు పెడితే మనశ్శాంతి ఇంట్లో నుండి పోతుందని అవమానిస్తుంది. దీంతో తన తల్లిని వెళ్లిపొమ్మని మీనా చెబుతోంది.

ఈ విషయాన్ని గమనించడం సత్యం.. ఇంటికి వచ్చిన వారిని అవమానించి పంపించడం సంస్కారం కాదని ప్రభావతిపై అరుస్తాడు. పార్వతిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తాడు సత్యం. అలా ఇంట్లోకి వచ్చిన పార్వతి.. సత్యం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటుంది. తాను దీపావళి పండుగకు బిడ్డ అల్లుళ్ళను పిలుస్తామని వచ్చానని చెబుతుంది. ' అది ఆనవాయితీ కదా అమ్మ.. నీ కూతుర్ని అల్లుళ్ళు పండక్కి తీసుకువెళ్లు ' అంటూ సత్యం పర్మిషన్ చేస్తాడు. కానీ బాలు మాత్రం తాను వెళ్ళనని మొండికేస్తాడు.


Click it and Unblock the Notifications











