Gunde Ninda Gudi Gantalu November 14th: పార్వతి వల్ల చిక్కులోపడ్డ రోహిణీ..ఆ గొడవతో రోడ్డున పడ్డ బాలు..

Gunde Ninda Gudi Gantalu November 14th Episode: బుధవారం ఎపిసోడ్ లో సత్యం తల్లి ఫోన్ చేసి.. దీపావళి పండుగకు ఇంటికి రమ్మని పిలుస్తోంది. తాను రవికి మంచి పిల్లను చూసానని, ఆ అమ్మాయిని చూడ్డానికి రండనీ చెప్పుతుంది. ఇప్పడు వద్దులే.. సంక్రాంతికి వస్తామని సత్యం సర్ది చెబుతాడు. మనోజ్ బోనస్ ఇచ్చారని తన తల్లి ఇచ్చిన డబ్బులను ఇస్తాడు. ఆ డబ్బులను తీసుకెళ్లి దినేష్ కు ఇస్తుంది, కానీ తాను అడిగిన అంత మొత్తం ఇవ్వకుండా ఆటలాడుతున్నావా అని బెదిరిస్తాడు.

తాను అడిగిన విధంగా 50 వేల రూపాయలు ఇస్తేనే తన సీక్రెట్లను బయటపెట్టకుండా ఉంటానని లేకపోతే.. తన రహస్యాలను బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరోవైపు.. పార్వతి తన కూతురు మీనా ఇంటికి వెళుతుంది. ఎందుకొచ్చావ్ అంటూ ప్రభావతి పార్వతిని అవమానిస్తుంది. ఇంటికి వచ్చిన వారిని అవమానించి పంపడం సంస్కారం కాదని ప్రభావాధిపై సత్యం అరుస్తాడు. పార్వతిని ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. తాను దీపావళి పండుగకి అల్లుని కూతుర్ని పండుగకు రమ్మని పిలవడానికి వచ్చానని చెబుతోంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 293 November 14th 2024 here is full story

గురువారం ఎపిసోడ్ లో పార్వతి.. అల్లుడు, కూతురుని పండుగకు రమ్మడంతో సత్యం సంతోష పడ్డాడు. అది ఆనవాయితీ, మన సంప్రదాయం. దాంట్లో తప్పేముందమ్మ.. తప్పకుండా తాను బాలు,మీనాలను పండుగకు పంపిస్తానని సత్యం మాటిస్తాడు. దీంతో బాలు .. ఇరకాటంలో పడతాడు. తనకు వెళ్లడం ఇష్టం లేకుండా..తన తండ్రి ఫీల్ అయితాడేమోననీ.. వస్తానని చెబుతాడు. దీంతో మీనా తల్లి సంతోషపడుతుంది. వెళ్ళేముందు.. పండుగకు వెళ్తున్నావమ్మ అంటూ రోహిణిని ప్రశ్నిస్తోంది. దీంతో కోపం వచ్చిన మీనా.. ఆ విషయాన్ని నీకు అవసరమా అంటుంది. లేదమ్మ వారు పండుగకు వెళ్లకపోతే.. మన ఇంటికి పిలుద్దామని అడిగాను. నాకు వేరే ఉద్దేశం లేదని చెబుతుంది పార్వతి.

ఆ మాటలతో ప్రభావతికి మండుతుంది. 'మీది ఫలక్నామ ప్యాలెస్ మరి..మీరు ఉండడానికి చోటు ఉండదు. నలుగురు వస్తే ఎక్కడు ఉంటారు'అంటూ పార్వతిని ఎగతాళి చేస్తుంది ప్రభావతి.దీంతో సైలెంట్ గా వెళ్లిపోతుంది పార్వతి. ఇలా మీనా అమ్మ వెళ్లగానే..మౌనిక మాట్లాడుతూ.. మీనా వదిన వాళ్ళ అమ్మ అన్నట్లుగా.. మీరు కూడా పండుగకు మలేషియా వెళ్తే.. చూడ్డానికి, ఆ అమ్మ నలుగురికి చెప్పడానికి చాలా బాగుంటుంది కాదా..' అని అంటుంది. దీంతో ప్రభావతి కూడా..'అవును.. రోహిణీ వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి మలేషియాకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేయమని చెప్పు. పండుగకు మీరు మలేషియా వెళుతున్నారంటే.. ఆ ఊహ ఎంతో బాగుంది' అంటుంది.

'పెళ్లయిన తర్వాత మీరు కూడా ఎటు వెళ్లలేదు. ఇలానైనా మలేషియా కు వెళ్తే.. అటు పండుగకు, ఇటు హనీమూన్ కు వెళ్లినట్లు ఉంటుంది. వెంటనే వెంటనే మీ నాన్నకు ఫోన్ చేయమ్మా' అని అంటుంది ప్రభావతి. ఇలా ఇరగటంలో పడ్డ రోహిణి సైలెంట్ గా రూమ్ లోకి వెళుతుంది. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుండగా.. మళ్లీ ప్రభావతి, మనోజ్ లు రూమ్ లోకి వెళ్తారు. 'ఏమైందమ్మా? మీ నాన్నకు ఫోన్ చేయమంటే.. సైలెంట్ గా వచ్చావు' అని ప్రశ్నిస్తుంది.

'మా నాన్న టూర్ లో ఉన్నాడు. అతడు టూర్ లో ఉంటే ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయరు. మీటింగ్స్ లో బిజీగా ఉంటారు' అని తప్పించుకొని ప్రయత్నం చేస్తుంది రోహిణి.'అయితే మీ మామయ్యకు ఫోన్ చేసి.. మాట్లాడు" అని ప్రభావతి అంటుంది. 'మామయ్య కూడా డాడీ తో కలిసి ట్రిప్ కి వెళ్లారు. వారి నెంబర్స్ కలవడం' అంటూ కవరింగ్ చేస్తుంది. దీంతో ప్రభావతి .. అంతేనా అంటూ నిరాశపడుతుంది.

మరోవైపు మీనాతో కలిసి బాలు పండుగకు అత్తగారింటికి వెళ్తాడు. మార్గమధ్యంలో ఆపి.. షాపింగ్ చేస్తారు. ఈ సమయంలో షాప్ కీపర్.. మీనా ను పొగుడుతుంటే.. బాలు కి కోపం వస్తుంది. వాడిని గట్టిగా క్లాస్ పీకుతాడు. షాపింగ్ పూర్తి అయినా తరువాత.. కారులో బయలు దేరుతారు. హ్యాపీగా కారులో వెళ్లుంటే.. సడెన్ గా ఫైనాన్స్ వాళ్లు కారును ఆపుతారు. ఫైనాన్స్ డబ్బులు కట్టలేదనీ, ఆ రోజు సెట్ తో గొడవపడి చాలా పెద్ద తప్పు చేశావ్. అందుకే .. నీ జీవితం రోడ్డుపై పడేలా.. కారు తీసుకరమ్మని సెట్ చెప్పాడని బౌన్సర్స్ చెప్పుతారు. తన భార్యను వదిలేసి వస్తానని చెప్పిన వినిపించుకోకుండా.. కారును తీసుకుని వెళ్లిపోతారు.

ఆరోజు ఇంటి పత్రాలు నాన్నకు ఇచ్చినట్లు చెబితే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని, అంతా నీ వల్లేనే ఇలా జరిగింది. నీ వల్లనే కొట్టాల్సి వచ్చిందనీ, అన్నింటికీ కారణం నువ్వేనంటూ మీనాను బాలు అవమానిస్తాడు. కారును ఫైనాన్స్ వాళ్ళు తీసుకువెళ్లడంతో.. చేసేదేమి లేక ఆటోలో అత్తగారింటికి వెళ్తాడు బాలు. ఇంటికి చేరుకోగానే.. కాస్త ఆగండి దిష్టి తీస్తానంటుంది పార్వతి. దీంతో బాలు.. 'నేనేమైనా కొత్త అల్లుడినా దిష్టి తీయడానికి .. కావాలంటే మీ అమ్మాయికి తీయండి దిష్టి.. సాధించింది కదా.. ప్రేమించిన వారికి పెళ్లి చేసింది. ఓ ఇంటి పరువు రోడ్డున పడేసింది' అంటూ మీనాను మరోసారి అవమానిస్తాడు బాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X