Gunde Ninda Gudi Gantalu November 15th: బాలు మాస్ వార్నింగ్.. రోహిణీకి ఉచ్చు బిగుస్తున్న దినేష్..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్ లో బాలు, మీనాలను పండుగకు ఇంటికి పంపామని పార్వతి అడగగా సరేనని సత్యం మాటిస్తాడు. తన తండ్రి భాదపడుతాడని సరే అంటాడు బాలు. పార్వతి ఇంటికి బయలుదేరేముందు .. పండుగకు పుట్టింటికి వెళ్లడం లేదమ్మా అంటూ రోహిణి అడుగుతుంది. దీంతో ఆగ్రహానికి లోనైనా ప్రభావతి.. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దంటూ పార్వతికి వార్నింగ్ ఇస్తుంది. మీనా వాళ్ళ అమ్మ అన్నట్లుగా పండుగకు అన్న వదినలు మలేషియా వెళ్తే బాగుంటుంది కదా అని రోహిణి నీ ఇరకాటంలో పడేస్తుంది మౌనిక.
ప్రభావతి కూడా.. 'పెళ్లయిన తర్వాత.. ఎటు వెళ్లలేదు.దీపావళి పండుగకు మలేషియాకి వెళ్ళండి. అటు హనీమూన్ కు, ఇటు పండక్కి వెళ్ళినట్లు ఉంటుంది.వెంటనే మీ నాన్నకు కాల్ చేసి మాట్లాడు 'అంటూ రోహిణి కి చెప్తుంది. తన తండ్రి ఫారిన్ టూర్ లో ఉన్నాడని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ తో మీటింగ్ లో ఉంటారని, తనని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం బాగుండదు అంటూ తప్పించుకుంటుంది రోహిణీ. మరోవైపు.. తండ్రికి మాట ప్రకారం బాలు అత్తగారింటికి వెళ్తాడు. కానీ మార్గమధ్యంలో షేట్ మనుషులు అడ్డుపడి తన కారును లాక్కెళ్తారు. వీటన్నింటికి కారణం నువ్వేనంటూ మీనా ను నిందిస్తాడు బాలు. ఆ తర్వాత చేసేది ఏమీ లేక.. ఆటోలో అత్తగారింటికి వెళ్తాడు బాలు.

శుక్రవారం ఎపిసోడ్ లో బాలు తన అత్తగారింట్లో మీనాను హేళన చేస్తాడు. సరిగ్గా ఆరు నెలల క్రితం తాను మీనా మెడలో తాళి కట్టాననీ, అప్పటినుండి తన బతుకు ఆగమైపోయిందని అంటాడు.అంతటితో ఆగకుండా.. ఆరోజు ఇంటి పత్రాలు ఎక్కడ పెట్టిందో చెప్పి ఉంటే ఆ ఫైనాన్సర్ తో గొడవ జరిగేది కాదు ఈరోజు నా జీవనాధారం పోయేది కాదని మీనాను తిడతాడు. ఆ మాటలతో మీనా తల్లి పార్వతి చాలా బాధపడుతుంది.
దీంతో మీనాకు కూడా కోపం వస్తోంది. 'దాని గురించి మీరు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు. అతను డబ్బులు అతనికి కట్టేస్తే కారు ఇస్తాడు కాదా.. మనం సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారు. అది అబద్ధమని.. నీకు ఇంకా నామీద కోపం పోలేదని తెలిస్తే.. అమ్మ వాళ్ళు ఇంకా బాధపడతారు. మీకు అంతగా నన్ను తిట్టాలి అనిపిస్తే.. మన ఇంటికి వెళ్ళాక ఇష్టం వచ్చినట్టు తిట్టండి. మనం పండక్కి వచ్చామని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీ సూటిపోటీ మాటలతో వాళ్ళని బాధ పెట్టకండి' అని మీనా రిక్వెస్ట్ చేస్తోంది.
బాలు బయటకు వెళ్లగానే.. పార్వతి వచ్చి ఏమైందమ్మా అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు. అని ప్రశ్నిస్తోంది. 'ఆయన గురించి మీకు తెలుసు కదా.. ఉప్పు లాంటోడు కొన్నిసార్లు నిప్పులో వేసినట్టు చిటపటలాడుతాడు. కొన్నిసార్లు వంటల్లో వేసినట్టు మంచిగా ఉంటాడు. సర్దుకుపోవడం తప్ప మనం ఏం చేయలేం ' అని మీనా బాధపడుతోంది.
మరోవైపు.. బాలు సెట్ దగ్గరికి వెళ్లాడు. 'కారును బలవంతంగా ఎందుకు తెచ్చారు. నేను చెప్పిన వినకుండా.. నా భార్య ముందు నడిరోడ్డుపై రుబాబు చేసి కారు తీసుకురావడం దుర్మార్గం అనిపించలేదా ? ' అని సేట్ ను ప్రశ్నిస్తాడు. ' నేను వెళ్లే మార్గమే అది కదా.. ఓహో నీ భార్య దగ్గర నీ పరువు పోయిందని ఫీల్ అవుతున్నావా ? ఆ రోజున ఆఫీసుకు వచ్చి.. నా మనుషుల ముందే నా కాలర్ పట్టుకుంటే నా పరువు పోలేదా?..దానికి ప్రతీకారం ఇది' అని చెప్పుతాడు.
'ఆరోజు అత్యవసరం అని, ఎలాగైనా మా నాన్న ప్రాణాలు కాపాడుకోవాలని నీ కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధమయ్యాను. కానీ కనీసం నువ్వు మానవత్వం కూడా లేకుండా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడావు. తండ్రిని దైవంగా భావించే కొడుకుగా నాకెలా ఉంటుంది. డబ్బుని మనిషి ప్రాణాలతో పోల్చడమేంటీ? అంటూ కారు ఓనర్ ను తిట్టుతాడు బాలు.
'నేనింతే.. నా దందా ఇంతే.. నువ్వు ఎక్కువ మాట్లాడకుండా.. నా బ్యాలెన్స్ డబ్బు అరేంజ్ చెయ్.. అప్పుడు ఆలోచిస్తా కారు ఇవ్వాలో లేదో.. అది కూడా నా కాళ్లు పట్టుకుని, చేసిన తప్పుకు క్షమాపణ కోరుకుంటే.. జీవితాంతం నా దగ్గర తలదించుకునే ఉంటానని, పొరపాటు కూడా నోరు జారనని లిఖితపూర్వకంగా రాసిచ్చి కారు ఇస్తా' అని కారు ఓనర్ అంటాడు.
దీంతో బాలుకు ఎక్కడ లేని కోపం వస్తోంది. 'చావ చచ్చినోడికి చెప్పు నీ మాటలు.. కూలి పని చేసినా..గౌరవంగా బతకడం నేర్పించాడు మా నాన్న. మనిషిని మనిషిలా చూసే వాడిని మాత్రమే గౌరవించమని నేర్పించాడు మా నాన్న. కడుపు కాలుతుంది కదా అని, గొంతు తడారిపోతుందని, జిత్తుల మారి నక్కల దగ్గర తలవచ్చుకోకుమని నేర్పించారు. నీలా డబ్బు జబ్బుతో బతికేవాడ్ని ఇంకా బతిమాడాల్సిన కర్మ నాకేం పట్టలేదు' అని అంటాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న సేట్ బాడీ గార్డు బాలుపై చేయి చేసుకోబోతారు. దీంతో బాలు రియాక్ట్ అయి.. 'జాగ్రత్త.. నాకు స్టీరింగ్ తిప్పడమే కాదు ఎముకలు విరగట్టడం కూడా వచ్చు' అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు బాలు.
మరో వైపు.. రోహిణీ కోసం తన ఇంటి దగ్గర వేయిట్ చేస్తూ.. ఫోన్ చేస్తాడు దీనేష్. ఏంటి కళ్యాణి ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడుండుంటుందో అంటూ ఫోన్ చేస్తాడు. దీంతో రోహిణీ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తోంది. ఆటో దిగి ఇంట్లోకి వెళ్తుంది. సడెన్ గా దీనేష్ పిలుస్తాడు. దీంతో రోహిణి మరింత కంగారు పడుతోంది. 'నువ్వు ఇక్కడికి వచ్చావ్ ఏంటి ? నీకు డబ్బులు ఇచ్చాను కదా ఇంకా ఏంటి ? అని అడుగుతోంది. దీంతో ..'బాలన్స్ ఎవరు ఇస్తారు మీ అత్తగారు ఇస్తారా? అయితే మీ అత్తగారిని పిలువు మంటాడు' దినేష్. దీంతో రోహిణి టెన్షన్ పడుతూ.. నా దగ్గర డబ్బులు లేవు.. అర్థం చేసుకో.. 'అంటూ బ్రతిమిలాడుతోంది.
' నిన్ను అర్థం చేసుకున్నాను. కాబట్టే.. టైం ఇచ్చాను. నిన్ను నిన్నుగా వదిలేశాను. కాబట్టే.. నీ మొగుడుతో సుఖంగా ఉన్నావ్ కదా 'అంటాడు. రోహిణి దినేష్ తో మాట్లాడటం ప్రభావతి చూస్తుంది. ఆ విషయాన్ని రోహిణి అర్థం చేసుకుని .. మా అత్తగారు వచ్చారు. నువ్వు వెళ్ళిపో ప్లీజ్.. నువ్వు వెళ్ళిపో.. అంటూ రిక్వెస్ట్ చేస్తు రోహిణిని..
దీంతో దినేష్ కు మరింత కోపం వస్తుంది. 'నన్ను నెగ్లెట్ చేస్తావు కదా' అంటూ రోహిణీ తల్లికి ఫోన్ చేస్తాడు. మీ కుతూరు కళ్యాణికి యాక్సిడెంట్ అయ్యింది. వచ్చి.. కాపాడుకోండి' అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో రోహిణీ@ కళ్యాణీ తల్లి కంగారు పడుతోంది. వెంటనే తన కుతూరుకి ఫోన్ చేస్తోంది. కానీ, రోహిణి కాల్ కట్ చేసి.. తన తల్లి నెంబర్ ను బ్లాక్ చేస్తోంది. దీంతో రోహిణి తల్లి తన కూతురికి ఏమైందోనని కంగరూ పడుతుంది.
ఇదెలా ఉంటే.. ప్రభావతి మనోజ్ ను పిలిచి.. 'పండుగకు అత్తగారింటికి వెళ్లాలి కాదా.. నువ్వే మీ మామయ్యకు ఫోన్ చేసి.. పండుగకు వస్తున్నామని చెప్పు.. రోహిణి మీ మామ అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంది కాదా.. వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కదా.. అందుకే కాస్త ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది. మనం కూడా తనని అర్థం చేసుకోవాలి. నా మాట విని.. రోహిణీ ఫోన్ తీసుకుని నువ్వే మీ మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడు' అని మనోజ్ కు చెబుతోంది. ఆ మాటలను రోహిణి దొంగచాటుగా వింటుంది. 'వీళ్లు ఈ టాపిక్ ని వదిలేలా లేరు.. లేని నాన్నను ఎక్కడి నుంచి తీసుకురావాలిరా భగవంతుడా.. ఈ సమయంలో విద్య నే నాకదే దిక్కు..'అని మరో ప్లాన్ చేస్తోంది రోహిణి. ఆ ఫ్లాన్ ఎంటో తరువాత ఎపిసోడ్ లో తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











