Gunde Ninda Gudi Gantalu November 18th: అత్త గారింట్లో బాలు హంగామా.. మీనా ట్విస్ట్‌కు ముళ్లగంపకు మైండ్‌బ్లాక్
Gunde Ninda Gudi Gantalu: 'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) శుక్రవారం ఎపిసోడ్ లో బాలు తన అత్తగారి ఇంట్లో కూడా సూటిపొటి మాటలతో మీనాను అవమానిస్తాడు. దీంతో మీనాకు కోపం వస్తుంది. వెంటనే బాలును పక్కకు తీసుకెళ్లి.. ఏమైనా తిట్టాలనుకుంటే.. ఇంటికి వెళ్ళిన తర్వత తిట్టు, కానీ ఇక్కడ మాత్రం తనని ఏమి అనవద్దని రిక్వెస్ట్ చేసుకుంటుంది మీనా. ఆ తరువాత బాలు ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లి మరోసారి గొడవపడతాడు. తన దగ్గర నుండి బలవంతంగా కారు ఎందుకు తీసుకవచ్చారని నిలదీస్తాడు.
నడిరోడ్డు మీద నీ భార్య ముందు కారు లాక్కొస్తేనే అంత బాధ పడుతున్నావ్.. అలాంటివి నా స్టాక్ ముందు నన్ను కాలర్ పట్టుకుని కొడితే.. నేను ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటానని అంటాడు. అందుకే నీ బతుకు మీద కొడుదామని కారును తీసుకరమ్మని చెప్పనని అన్నారు. తన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తేనే.. తనకు కారు ఇస్తానని చెప్తాడు షేట్. దీంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ, నీలాంటి వారి దగ్గర పని చేయాల్సిన కర్మ తనకు లేదని వెళ్లిపోతాడు.మరోవైపు డబ్బుల కోసం దినేష్ ప్రభావతి ఇంటికి వస్తాడు. తనకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు ఇవ్వకపోతే.. అసలు విషయం తన అత్తయ్య కు చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. మరోవైపు ప్రభావతి మనోజ్ ను పిలిచి.. పండుగకు మలేషియాకు టిక్కెట్లు బుక్ చేయమని ఫోన్ చేసి అడుగుమని చెబుతోంది.

సోమవారం ఎపిసోడ్లో.. రోహిణి దగ్గరికి ప్రభావతి వచ్చి తన తండ్రికి కాల్ చేయమని చెబుతుంది. అంతకుముందుగా విద్యకు ఫోన్ చేసి.. తన నెంబర్ను స్విచ్ ఆఫ్ చేసుకోమని, తన నెంబర్ నే నాన్న నెంబర్ గా చెబుతానని అంటుంది. దీంతో విద్య తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసుకుంది. ఆ తర్వాత విద్యకు ఫోన్ చేసి.. తన నాన్నకు ఫోన్ చేశానని చెబుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నాన్న ఫారిన్ ట్రిప్ లో బిజీగా ఉన్నాడని, ఫోన్ కలవడం లేదంటూ ప్రభావతికి అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తుంది రోహిణీ. దీంతో సర్లే అంటూ ప్రభావతి అక్కడినుండి వెళ్ళిపోతుంది.
మరోవైపు బాలు ఫుల్లుగా తాగి వచ్చి అత్తగారి ఇంటి వద్ద నానా హంగామా చేస్తాడు. తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. కారు విషయంలో
మీనా అబద్ధం చెప్పిందని, నిజం చెప్పడానికి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్తాడు. ఈ విషయాన్ని గమనించిన మీనా.. మేనేజ్ చేసి బాలుని ఇంట్లోకి పట్టుకొస్తుంది. దీంతో బాలు సీరియస్ అవుతాడు. తనని ఎందుకు పట్టుకోచ్చావనీ, తాను నిజం చెప్పడానికి ఓనర్ దగ్గరికి వెళ్లానని, అతడు చాలా మంచివాడని, అలాంటి వాడికి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు అంటూ ఏదో ఏదో మాట్లాడుతా ఉంటాడు బాలు.
ఆ తర్వాత.. తినడానికి రమ్మని బాలుని పార్వతి పిలుస్తుంది. ఈ సమయంలో బాలు మాట్లాడుతూ.. 'అత్తగారు నా జీవితం నాశనం అయిపోయింది. మీనా.. రవి గాడికి పెళ్లి చేసింది.మా నాన్నను జైల్లో పెట్టించింది. తర్వాత హాస్పిటల్ కు పంపించింది. ఇదంతా మీనా వల్లనే జరిగింది. అసలు పండుగకు మీ ఇంటికి రావడం తనకు ఇష్టం లేదు. మా నాన్న చెప్పడం వల్లనే వచ్చాను' అంటూ అసలు విషయం బయట పెడతాడు బాలు. అంతటితో ఆగకుండా.. 'బాలు గాడు ఎవరు చెప్పినా వినే రకం కాదు. నేను ముళ్ళకంప లాంటి వాడిని , నాతో పెట్టుకుంటే చిరిగిపోతుందని అందరు భయపడేవారు. కానీ మీ కూతురికి మాత్రం ఆ భయం లేకుండా పోయింది' అంటూ తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు బాలు..
ఆ తర్వాత సుమతితో మాట్లాడుతూ.. చిన్న పూల గంప.. నువ్వు మీ అక్క లాగా ఎవరి పెళ్లి చేయకు.. వారి జీవితాలను ఆగం చేయకు అని మీ నాన్న టార్గెట్ చేస్తూ మాట్లాడుతాడు. తర్వాత శివను పిలిచి.. అరేయ్ బామ్మర్ది నువ్వు మీ అక్క లాగా కాకుండా.. బుద్ధిగా చదువుకో.. అంటూ వార్నింగ్ ఇస్తాడు. 'మీ అక్క .. మా నాన్నని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. హాస్పిటల్లో పడుకోబెట్టింది. మా కుటుంబం పరుగును రోడ్డుకీడ్చింది. చివరికి నా బతుకును ఆగం చేసింది' అంటూ మీనా ను తిడతాడు.
బాలు ప్రవర్తనను చూసి పార్వతి ఏడుస్తుంది. ఆ విషయాన్ని గమనించిన బాలు.. 'అత్తగారు మీరు ఏడుస్తున్నారా.. మిమ్మల్ని కూడా మీనా బాధపెట్టిందా? మీనా చేతలకు నేను కూడా చాలా బాధపడుతున్నా.. కానీ మగవాడ్ని.. కాబట్టి ఏడవట్లేదు. నేను ఏడిస్తే 4 ఫుల్ బాటిల్స్ నిండేవి. మీరు ఏడవండి. కానీ 90 ఎం.ఎల్ మాత్రమే ఏడ్చి ఊరుకోండి' అంటూ కామెడీగా మాట్లాడుతాడు.ఇలా తాగిన మైకంలో అత్తగారింట్లో నానా హంగామా చేస్తాడు బాలు.
మరుసటి రోజు ఉదయం బాలు నిద్రలేచి.. హ్యాంగ్ ఓవర్ తో ఇబ్బంది పడతాడు. రాత్రి ఏదైనా తేడాగా మాట్లాడానా అంటూ తన అత్తగారిని అడుగుతాడు. అదేం లేదు బాబు అంతా బాగానే ఉందంటూ కవర్ చేస్తుంది పార్వతి. కానీ శివ వచ్చి.. నువ్వు తిట్టడంతో మా అక్కయ్య మీ ఇంటికి వెళ్ళిపోయింది అని చెబుతాడు. దీంతో బాలు సీరియస్ అయి.. ఎవరైనా మొగుడు తిడితే.. అమ్మగారింటికి వస్తారు. కానీ, మీనా మాత్రం అత్తగారింటికి వెళ్లిందా? అని వ్యంగంగా మాట్లాడుతాడు. తాను చెబుతున్న వినకుండా మీ ఇంటికి వెళ్ళిపోయింది అని పార్వతి అంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











