Gunde Ninda Gudi Gantalu November 19th: శీల డార్లింగ్ ఎంట్రీ.. రవి గురించి ఆరా.. నోరు జారిన ప్రభావతి..

గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్లో..ప్రభావతి రోహిణి దగ్గరకు వచ్చి తన తండ్రికి కాల్ చేయమని చెబుతుంది. విద్యకు ఫోన్ చేసి, తన నాన్నకు ఫోన్ చేశానని చెబుతుంది. కానీ, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందనీ, నాన్న ఫారిన్ ట్రిప్ లో బిజీగా ఉన్నాడని మేనేజ్ చేస్తుంది రోహిణీ. మరోవైపు బాలు ఫుల్లుగా తాగి వచ్చి అత్తగారి ఇంటి వద్ద నానా హంగామా చేస్తాడు. తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. 'రవి గాడికి పెళ్లి చేసింది. మా నాన్నను జైల్లో పెట్టించింది. తర్వాత హాస్పిటల్ కు పంపించింది' అసలు పండుగకు మీ ఇంటికి రావడం తనకు ఇష్టం లేదు. మా నాన్న చెప్పడం వల్లనే వచ్చాను' అంటూ అసలు విషయం బయట పెడతాడు బాలు.

బాలు ప్రవర్తనను చూసి పార్వతి ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం బాలు నిద్రలేచి.. హ్యాంగ్ ఓవర్ తో ఇబ్బంది పడతాడు. రాత్రి ఏదైనా తేడాగా మాట్లాడానా అంటూ తన అత్తగారిని అడుగుతాడు. అదేం లేదు బాబు అంతా బాగానే ఉందంటూ కవర్ చేస్తుంది పార్వతి. కానీ శివ వచ్చి.. నువ్వు తిట్టడంతో మా అక్కయ్య మీ ఇంటికి వెళ్ళిపోయింది అని చెబుతాడు. దీంతో బాలు సీరియస్ అయి.. ఎవరైనా మొగుడు తిడితే.. అమ్మగారింటికి వస్తారు. కానీ, మీనా మాత్రం అత్తగారింటికి వెళ్లిందా? అని వ్యంగంగా మాట్లాడుతాడు. తాను చెబుతున్న వినకుండా మీ ఇంటికి వెళ్ళిపోయింది అని పార్వతి అంటుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 296 November 19th 2024 here is full story

మంగళవారం ఎపిసోడ్ లో మీనా తనకు చెప్పకుండా అత్తగారింటికి వెళ్లిందని బాలు ఫైర్ అయితాడు. దీంతో.. మీనా తల్లి సర్ది చెప్పి.. పండుగ కానుకగా ఉంగరం ఇస్తుంది. మొదట తనకు ఎలాంటి కానుకలు వద్దని చెబుతాడు. కానీ, పార్వతి పట్టు పట్టి.. తన సంతోషం కోసమైనా ఉంగరం తీసుకోవాలని చెప్పడంతో.. బాలు ఉంగరం తీసుకుని ఇంటికి వస్తాడు. మరోవైపు తెల్లవారగానే మీనా ఇంటి ముందు ముగ్గు వేయడం చూసి మౌనిక షాక్ అవుతుంది. ఇది కలయా నిజమా అంటూ మీనాను ప్రశ్నిస్తుంది.

అంతటితో ఆగకుండా తన మమ్మీ,డాడీలను పిలుస్తుంది మౌనిక. మీనాను చూసి ప్రభావతి కూడా షాక్ అవుతుంది. పండుగ పూట కూడా మీ ఇంట్లో వారికి తీరిక లేదా ఉన్నారా? పూల గిరాకి ఎక్కువ ఉందని గుడి దగ్గరే ఉండిపోయారా? అంటూ ఎగతాళి చేస్తుంది. దీంతో సత్యంకు కోపం వచ్చి.. అసలు ఎందుకు వచ్చిందో అడగకుండా.. నోరు ఎందుకు పడేసుకుంటున్నావ్ అంటూ ప్రభావతి తిడుతాడు. అయినా పండుగ పూట అక్కడ ఉండకుండా ఎందుకు వచ్చారని సత్యం ప్రశ్నించగా.. బాలుకి అక్కడ ఉన్న తన మనసు మొత్తం ఇక్కడే ఉందని, మీరు సరిగ్గా తింటున్నారా లేదా టాబ్లెట్ వేసుకున్నారో లేదోనని ఆలోచించినారని అందుకే తెల్లవారుజామున ఇద్దరం ఇంటికి వచ్చామంటూ మీనా అబద్ధం చెపుతుంది.

ఆ తర్వాత.. బాలు ఇంటికి చేరుకుంటాడు. వచ్చి రాగానే మీనా పై మండిపడుతాడు. తనకు చెప్పకుండా ఒంటరిగా ఇంటికి ఎందుకు వచ్చావు.. నీకు అసలు బుద్ధి ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో కోపం వచ్చినా మీనా.. నిన్న రాత్రి పీకలదాకా తాగి వచ్చి.. నన్ను నానా మాటలు తింటారు. మీరు అన్నమాటలకు మా అమ్మ చాలా బాధపడింది. పండుగ పూట వారిని బాధపడ్డకూడదనే ఉద్దేశంతో ఇంటికి వచ్చేసానంటూ చెబుతుంది. మరి మా ఇంట్లో వారికి మనం వచ్చిన విషయం తెలుసా? వారికి ఏం చెప్పావ్ ? అంటూ బాలు అడుగుతాడు.

మామయ్యకు అన్ని విషయాలు చెప్పానని, మెయిన్ మీరు తాగి వచ్చి గొడవ చేశారని, రాత్రి పూట ఓనర్ ఆంటీ వాళ్ళ డోర్ కొట్టారని, నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారని, ఇలా అన్ని విషయాలు చెప్పానని బాలుని ఆటపట్టిస్తుంది మీనా. దీంతో బాలు.. నా ముఖం ఎలా చూపించాలి. మళ్లీ నేను తాగవచ్చానంటే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడు' అంటూ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత అసలు విషయం చెబుతుంది మీనా. మీరు అంత టెన్షన్ పడవాల్సన అవసరం లేదు. తాను ఎవరికి ఏం చెప్పలేదని, మిమ్ములను చూడకుండా బాలు ఉండలేకపోయారని, అందుకే తెల్లవారగానే వచ్చేసామని చెప్పానని మీనా చెబుతుంది.

దీంతో బాలు కాస్త కూల్ అవుతాడు. అంతటితో సైలెంట్ గా ఊరుకోకుండా.. అయినా తనకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? అంటూ మళ్ళీ మీనాపై అరుస్తాడు. ఇంతలోనే బాలు నానమ్మ సుశీలమ్మ వస్తుంది. వారి గొడవను అబ్జర్వ్ చేసి.. బాలుకి క్లాస్ పీకుతుంది. ఇంట్లోకి వెళ్లి అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. తన అత్తయ్య వచ్చారని తెలియగానే ప్రభావతి వణికి పోతుంది. ఈ పండుగకు తనకు చుక్కలు చూపించేలా ఉన్నారంటూ ఫీల్ అవుతుంది. సత్యంను చూడగానే సుశీలమ్మ .. 'ఏంట్రా ఇంత బక్క చిక్కిపోయావు? ముఖం మొత్తం పాలిపోయింది. అసలు ఏమైంది రా ? అంటూ తన కొడుకుని అడుగుతుంది.

హాస్పిటల్ కు వెళ్లిన వ్యక్తి ఇలా కాకపోతే ఎలా ఉంటారంటూ నోరు జారుతుంది ప్రభావతి. తన కొడుకును హాస్పిటల్ లో చేర్పిస్తే తనకు ఒక్క మాట కూడా చెప్పరా? అంటూ కోప్పడుతుంది సుశీలమ్మ. బాలు వెంటనే కాస్త అనారోగ్యంగా ఉందంటే చిన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి.. రెండు సెలైన్ ఎక్కించి రాత్రి వరకు తీసుకువచ్చాం. అందుకే అమ్మ హాస్పిటల్ కు వెళ్ళామంటూ చెప్పి కవర్ చేస్తాడు బాలు. నాకు వచ్చిన పీడకలలు నిజమే కావచ్చు అని, ఇంత సేపు టెన్షన్ పడ్డానని, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటూ శీలా డార్లింగ్ కూల్ అవుతుంది.

ఎలాగైనా టాపిక్ మార్చాలని సత్యం.. ఇంటికి వచ్చిన మా అమ్మని ఇలానే నిలబెట్టి మాట్లాడతావా ? అంటూ ప్రభావతి మీదికి ఫైర్ అవుతాడు సత్యం.ఆ తరువాత శీల డార్లింగ్.. బాలుని పిలిచి ఏంట్రా ఇంట్లో కారు కనిపించడం లేదు అని ప్రశ్నిస్తుంది. కారు టూర్ కు వెళ్లిందని కవర్ చేస్తాడు. కారు ఎక్కడికి వెళ్లిన గంటలో ఇంటి ముందుకు రావాలి. అందరం గుడికి వెళ్దాం అంటూ ఆర్డర్ వేస్తుంది సుశీలమ్మ. దీంతో లేని కారును ఎలా తీసుకురావాలని బాలు ఆలోచిస్తాడు. అనవసరంగా పండగ పూట అక్కడ ఉండకుండా.. ఇక్కడికి వచ్చి చిక్కుల్లో పడ్డావు అంటాడు సత్యం.

కనీసం అద్దె కారు అయినా తీసుకురా అని చెబుతాడు సత్యం. అద్దె కారు కూడా ప్రస్తుతం లేదంటూ చెబుతాడు. సరేలే ఏదో ఒకటి తీసుకోవచ్చు మేనేజ్ చెయ్యి అని సత్యం సలహా ఇస్తాడు. మరోవైపు శిలా డార్లింగ్ ను తన రూమ్ కి తీసుకువెళ్తుంది మీనా. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరుగుతుంది. వాడు కరెక్టే ఉన్నాడా? అంటూ బాల గురించి ఆరా తీస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X