Gunde Ninda Gudi Gantalu November 20th: మీనాను అలా చూసి టెమ్ట్ అయినా బాలు..బయటపడ్డ రోహిణీ బాగోతం..
Gunde Ninda Gudi Gantalu November 20th Episode : గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ లో బాలుకి చెప్పకుండా మీనా తన అత్తగారింటికి వెళ్లి పోతుంది. దీంతో బాలుకి ఎక్కలేని కోపం వస్తుంది. కానీ, మీనా తల్లి పార్వతి అన్ని విషయాలు సద్ది చెప్పి .. పండుగ కనుక ఉంగరం పెట్టి పంపిస్తోంది. మరోవైపు మీనా పండుగకు అమ్మగారింట్లో ఉండకుండా అత్తగారింటికి రావడంతో ఇంట్లో వారు కూడా షాక్ అవుతారు. బాలు అక్కడ ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే ఇంటికి వచ్చామంటూ మీనా అబద్దం చెపుతోంది
ఇంతలోనే .. బాలు ఇంటికి చేరుకుని మీనాపై ఫైర్ అయితడు. తాగి వచ్చి నానా హంగామా చేశారు.దీంతో మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. అందుకే చెప్పకుండా ఇంటికి వచ్చాను అంటుంది మీనా. అలాగే మీ విషయాలు కూడా ఇంట్లో చెప్పానని బాలుని ఆటపట్టిస్తుంది. దీంతో బాలు కంగారు పడతాడు. ఇంతలోనే షీలా డార్లింగ్ ఎంట్రీ ఇస్తుంది. తన కొడుకు సత్యం చూసి ఏంట్రా అలా ఉన్నావ్ అంటూ ఆరా తీసుంది. హాస్పిటల్ కి వెళ్లిన మనిషి అలా కాకపోతే ఎలా ఉంటారని ప్రభావతి అంటుంది. దీంతో షీలా డార్లింగ్ కంగారు పడుతుంది. వెంటనే అదేం లేదు.. జ్వరం వస్తే.. హాస్పిటల్ తీసుకెళ్లాము అని కవరింగ్ చేసి చెప్తాడు బాలు. అందరు కనిపిస్తున్నారు మరి చిన్నోడు అని రవి గురించి అడుగుతుంది. అలాగే కారు కనిపించడం లేదు రా అని బాలుని అడుగుతుంది.

ఇక బుధవారం ఎపిసోడ్ లో మీనాతో శీలా డార్లింగ్ మాట్లాడుతూ.. బాలు సరిగా ఉంటున్నాడా లేదా అంటూ సంసారం గురించి అడుగుతుంది. బాలు చూడటానికి కోపంగా ఉన్నా.. తనతో బాగానే ఉంటాడు. కావాలంటే మీరే చూడండి. అంటూ తన బాధను మనసులో దాచుకుని అబద్దం చెబుతోంది మీనా.
ఆ తరువాత ప్రభావతి ఇంట్లో పండుగ సంబురాలు ప్రారంభమవుతాయి. పండగ పూట నూనెతో తలంటుకొని స్నానం చేస్తే కుళ్ళు మొత్తం పోతుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతిపై పంచి వేస్తుంది షీలా డార్లింగ్. వెంటనే బాలు రియాక్ట్ అవుతు మనోజ్ గాడికి పెట్టు శీలా డార్లింగ్.. వాడి కుళ్ళు మొత్తం పోవాలి అంటాడు. దీంతో పక్కనే ఉన్న సత్యం పండగ కూడా గొడవలేంట్రా చిన్న పిల్లలా అని మందలిస్తాడు. చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చింది చిన్నోడు ఎక్కడ ఉన్నాడ్రా.. వాడు కనిపించట్లేదు అంటూ శీల డార్లింగ్ ప్రశ్నిస్తుంది. దీంతో ఇంటిల్లిపాది ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక షాక్ అవుతారు.
వెంటనే మీనా.. సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి ఊరెళ్ళాడు అంటూ కవరింగ్ చేస్తోంది. పండుగ పూట ఎవరైనా పనులు పెట్టుకుంటారా అంటూ రవికి ఫోన్ చేయబోతోంది శీలా డార్లింగ్. దీంతో బాలు ఆ ఫోన్ ని లాక్కొని మిమ్మల్ని అర్థనగ్నంగా నిలుచొబెట్టి పెట్టి.. రవి గాడికి ఫోన్ చేస్తావా అంటూ.. ఫోన్ లాక్కుటాడు బాలు.
ఆ తర్వాత బాలుకి నూనె పెట్టమని మీనాకు తలకు నూనె పెట్టమని చెబుతుంది సుశీలమ్మ. కానీ నాకు ఎవరు నూనే పెట్టనవసరం లేదంటూ.. పక్కనే ఉన్న నూనె క్లాసు బదులు టీ క్లాస్ మీద పోసుకుంటాడు బాలు. అలా ఫన్నీగా సాగుతోంది. ఆ తరువాత మీనా శారీ కట్టుకోవడానికి రూమ్ లోకి వెళుతుంది. ఆ విషయం తెలియకుండా బాలు సడన్ గా రూమ్ లోకి వస్తాడు. శారీ కట్టుకోవడం చూసి.. ఇలాంటి పనులు చేసేటప్పుడు కనీసం డోర్ పెట్టుకోవాలి? కదా అంటూ కోపాడుతాడు బాలు. నేను డోర్ వేసుకునే చీర కట్టుకుంటున్నా.. కానీ, మీరే వచ్చారంటుంది మీనా.
నీతో మాట్లాడటం వేస్ట్ అంటూ.. బయటికి వెళ్తుంటాడు బాలు. తన చీర కుచ్చులు సెట్ కావడం లేదు కాస్త సెట్ చేయండి అంటుంది మీనా. అలాంటి పనులు నాతో కావు అంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు బాలు. తాను అసలు విషయం అమ్మమ్మ చెప్తానంటూ శిలా డార్లింగ్ పిలుస్తుంది. వెంటనే బాలు కంగారుపడుతూ మీనా నోరుమూస్తాడు. ఈ సమయంలో జారి బెడ్ పై పడిపోతారు ఇద్దరు. ఈ సమయంలో కాస్త రొమాంటిక్ గా కలుస్తారు. ఆ తర్వాత బాలు చీర కుచ్చులను సెట్ చేసి.. కిందికి తీసుకవస్తాడు.
అప్పటికే ప్రభావతి పూజ చేసి హరతి తీసుకొని వస్తుంది. ఈ సమయంలో బాలు మీనాలు ఇద్దరు కలిసి సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సంవత్సరం తిరిగేలోపు తనకు పండంటి బిడ్డను ఇవ్వాలంటూ ఆశీర్వాదం ఇస్తోంది. ఈ సమయంలో రవి కూడా ఉంటే బాగుండేది అంటూ బాధపడుతోంది సుశీల. ఆ తర్వాత రవికి ఫోన్ చేస్తుంది. అసలు విషయం తెలియకుండా సాయంత్రం ఇంట్లో దీపం పెట్టే సమయం వరకు ఇంటికి రమ్మని ఆర్డర్ వేస్తూ సుశీల. దీంతో ఇంట్లో వాళ్లు తనని పండుగకు పిలిచారని రవి సంతోషిస్తాడు. వెంటనే శృతికి ఫోన్ చేసి.. నీకు ఓ సంతోషకరమైన వార్త చెప్పాలంటూ.. త్వరగా ఇంటికి రమ్మని చెబుతాడు. మరోవైపు బాలు తన కారు కోసం వెళ్తాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది రోజు ఎపిసోడ్.


Click it and Unblock the Notifications











