Gunde Ninda Gudi Gantalu November 21th: బాలుకి మైండ్ బ్లోయింగ్ ట్వీస్ట్.. ప్రభావతికి చుక్కలు చూపించిన శీలా
Gunde Ninda Gudi Gantalu November 21th Episode: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో ప్రభావతి ఇంట్లో పండుగ సంబురాలు ప్రారంభమవుతాయి. పండగపూట అందరూ తలంటుకొని స్నానాలు చేస్తూ సందడి చేస్తారు. ఈ సమయంలో రవి లేడు అంటూ సుశీలమ్మ బాధపడుతుంది. అసలు వాడు ఎటు వెళ్లడాన్ని నిలదీస్తుంది. వెంటనే మీనా.. సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి ఊరెళ్ళాడు అంటూ కవరింగ్ చేస్తోంది. ఆ తరువాత మీనా శారీ కట్టుకోవడానికి రూమ్ లోకి వెళుతుంది. ఆ విషయం తెలియకుండా బాలు సడన్ గా రూమ్ లోకి వెళ్లాడు.దీంతో తన చీర కుచ్చులు సెట్ కావడం లేదు కాస్త సెట్ చేయమని అంటుంది మీనా. తాను అసలు విషయం అమ్మమ్మ చెప్తానంటూ శిలా డార్లింగ్ పిలువడంతో బాలు కంగారుపడుతూ మీనా నోరుమూస్తాడు. ఈ సమయంలో జారి బెడ్ పై పడిపోతారు ఇద్దరు. ఈ సమయంలో కాస్త రొమాంటిక్ గా కలుస్తారు. ఆ తర్వాత బాలు చీర కుచ్చులను సెట్ చేసి.. కిందికి తీసుకవస్తాడు.
ఆ తర్వాత ప్రభావతి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఈ సమయంలో బాలు మీనాలు బామ్మ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోగా.. సంవత్సరం తిరిగేలోగా తన చేతిలో మునిమానమని పెట్టాలంటూ ఆశీర్వదిస్తుంది. అనంతరం షీలా డార్లింగ్ రవికి ఫోన్ చేసి పండుకి ఇంటికి రమ్మని చెబుతోంది. సుశీలకు అసలు విషయం తెలియక రవిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఏదైనా పని ఉంటే .. తర్వాత చూసుకుందువులే అంటూ సాయంత్రం దీపం పెట్టి సమయం వరకు రావాలని ఆర్డర్ వేస్తోంది. దీంతో రవి సంతోషపడి శృతికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెబుతాడు.

గురువారం ఎపిసోడ్ లో బాలు కారు కోసం వెళ్తాడు. కారు కొన్న వ్యక్తికి అసలు విషయం చెప్పి.. తనకు కారు ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకుంటాడు. బాలు ఫీలింగ్ అర్థం చేసుకున్న.. ఆ వ్యక్తి కారు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ తాను కూడా వస్తానని చెబుతాడు.దీంతో వెంటనే బాలు.. ఇంటికి వచ్చి గుడికి వెళ్దాం అంటూ హడావిడి చేస్తాడు. దీంతో తన బామ్మ అంతా ఆగ పడుతున్నావేంట్రా.. మన కారే కదా.. వెళ్దాంలే ఫస్ట్ నీ భార్య రెడీ అయిందా? లేదా? అది తెలుసుకోమని చెబుతుంది.
అలా మీనా కోసం బెడ్ రూమ్ కి వెళ్లాడు బాలు. ఆ సమయంలో బాలు తెచ్చిన గాజులను చూస్తూ ఉంటుంది మీనా. ఆ గాజులను చూపించి.. గాజులు నా కోసమే.. తీసుకువచ్చావా అని ప్రశ్నిస్తుంది. లేదు నా మీనా కోసం తీసుకవచ్చాననీ, నీ కోసం కాదని చెబుతాడు. అయినా నేను ప్రేమించినా మీనా.. నువ్వు కాదు. ఇప్పుడు నా ముందు ఉన్నది. నన్ను మోసం చేసిన మీనా. నా మాటను తోసిపుచ్చిన మీనా. మా నాన్న జైలుకి పంపించిన మీనా .. అంటూ తిడతాడు. దీంతో మీనా ఫీలై కిందికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలు పంచ కట్టుకొని రెడీ అయ్యాయి కిందికి వస్తాడు.

అలా అందరు కలిసి గుడికి వెళ్తారు. కారులో వెళ్లే సమయంలో మీనా అనుకోకుండా బాలుపై పడుతుంది. దీంతో బాలు చిరాకు పడతాడు. ఆ విషయాన్ని గమనించిన శీల డార్లింగ్.. పడింది నీ పెళ్లామే కాదా ఎందుకీ గొడవ. ఈ గొడవలు పక్కన పెట్టి.. తనకు సంవత్సరం తిరిగే లోపు పండంటి మగ పిల్లల్ని ఇవ్వాలని చెబుతుంది. గుడికి తీసుకెళ్లాక బాలుకి ట్విస్ట్ ఇస్తుంది మీనా.. మామయ్య ఆరోగ్యం బాగుంటే.. మీతో పొర్లు దండాలు చేయిస్తానని చెబుతుంది. ఇలా తన నాన్న పేరు చెప్పి బాలుతో పొర్లు దండాలు పెట్టిస్తుంది. దీంతో బాలు కి చుక్కలు కనిపిస్తాయి. నమ్మకద్రోహం చేసావ్ అని మీనాపై కొప్పాడుతాడు బాలు. పక్కనే ఉన్న శీలా డార్లింగ్.. 'మీ తాతయ్య కోసం మీ నాన్న చేశాడు. ఇప్పుడు మీ నాన్న కోసం నువ్వు చేసావు. ఇందులో తప్ప ఏముంది?' అంటూ బాలునీ క్లాస్ పీకింది సుశీల.
మరోవైపు.. రవి చాలా హ్యాపీగా ఉంటాడు. శృతి ఇంటికి రాగానే రవి సంతోషంతో ఎత్తుకుని తిప్పుతాడు. తనకు తన భామ నుండి ఫోన్ వచ్చిందని, తనని ఇంటికి రమ్మని పిలుస్తున్నారని చెబుతాడు రవి. కానీ, మీ బామ్మకు అసలు విషయం తెలియదు కావచ్చు. అందుకే పిలిచిందని ఏదో సందేహపడుతుంది శృతి. రవి మాత్రం తన బామ్మ అందరినీ కన్వెన్షన్ చేసి.. తనకు కాల్ చేసిందని చెబుతాడు. అయితే.. తాను కూడా వస్తానని చెబుతుంది శ్రుతి. కానీ, ఇప్పుడు వద్దు అక్కడ పరిస్థితులను బట్టి.. తానే తీసుకెళ్తానని రవి చెబుతాడు.
మరోవైపు.. పండుగ పూట అన్ని పనులు తాను ఒక్కదాన్నే పనులు చేసుకోవాలని అంటూ ప్రభావతి ఇంట్లో అరుస్తుంది. ఇంతలోనే తన అత్తమ్మ వచ్చింది. ఏం చేస్తున్నావ్? ఎందుకు అలా అరుస్తున్నావ్ ? అంటూ ప్రశ్నిస్తుంది. ఈ సమయంలో మీనా వంటింట్లోకి వస్తుంది. అత్త మీది కోసం మీనా మీద తీయాలని.. ఇంట్లో పనులు పెట్టుకుని.. ఎక్కడికి వెళ్లావు ? అని ప్రశ్నిస్తుంది. తాను బామ్మతో గుడికి వెళ్లానని చెబుతోంది. గుడికి వెళ్తే.. ఇంట్లో ఉన్న పనులు ఎవరు చేయాలి అని అడుగుతుంది. దీంతో శీల డార్లింగ్ కు కోపం వస్తుంది.

ఇంట్లో మిగతా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. అయినా పండగపూట ఇంటికి పెద్ద కోడలు వంట చేయాలి. అదే మన సాంప్రదాయం అంటూ రోహినీ నీ పిలుస్తుంది. 'రోహిణికి వంట చేయడం రాదని, అయినా తనకు ఇలాంటివి తెలియదని చెబుతుంది ప్రభావతి. 'పెళ్లయిన కొత్తలో నీకేమైనా వచ్చా.. అన్నీ నేనే కదా.. దగ్గరుండి నేర్పించాను. ఒకసారి తప్పు చేస్తారు. మరోసారి నేర్చుకుంటారు.' వెంటనే వెళ్లి రోహిణి తీసుకొని రమ్మని ప్రభావతికి ఆర్డర్ వేస్తుంది. దీంతో ప్రభావతి.. భయపడుతూ రోహిణి దగ్గరికి వెళ్తుంది. పండగ పూట మొదటి వంట నువ్వే చేయాలని రోహిణినీ రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.


Click it and Unblock the Notifications











