Gunde Ninda Gudi Gantalu November 22th: రవికి బాలు వార్నింగ్.. మీనాకు అనుమానం.. రోహిణి సీక్రెట్ ?

Gunde Ninda Gudi Gantalu November 22th Episode: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో బాలు కారు తీసుకొని వస్తాడు. త్వరగా గుడికి వెళ్దామని చెబుతాడు. మీనా ను తీసుకుని రమ్మని బాలుకు ఆర్ఢర్ వేస్తోంది షీలా డార్లింగ్. అందరు కలిసి కారులో వెళ్లే సమయంలో మీనా అనుకోకుండా బాలుపై పడుతుంది. దీంతో బాలు చిరాకు పడతాడు. గొడవలు పక్కన పెట్టి.. తనకు సంవత్సరం తిరిగే లోపు పండంటి మగ పిల్లల్ని ఇవ్వాలని చెబుతుంది. గుడికి తీసుకెళ్లాక బాలుకి ట్విస్ట్ ఇస్తుంది మీనా.. తన నాన్న పేరు చెప్పి బాలుతో పొర్లు దండాలు పెట్టిస్తుంది. దీంతో బాలు కి చుక్కలు కనిపిస్తాయి.

మరోవైపు.. పండుగ పూట అన్ని పనులు తాను ఒక్కదాన్నే పనులు చేసుకోవాలని, ఇంట్లో పనులు పెట్టుకుని.. ఎక్కడికి వెళ్లావు ? అని మీనా పై కొప్పాడుతుంది ప్రభావతి. ఇంట్లో మిగతా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. అయినా పండగపూట ఇంటికి పెద్ద కోడలు వంట చేయాలి. అదే మన సాంప్రదాయం అంటూ రోహినీ నీ పిలుస్తుంది. 'రోహిణికి వంట చేయడం రాదని, అయినా తనకు ఇలాంటివి తెలియదని చెబుతుంది ప్రభావతి. కానీ, రోహిణి తీసుకొని రమ్మని ప్రభావతికి ఆర్డర్ వేస్తుంది. దీంతో ప్రభావతి.. భయపడుతూ రోహిణి దగ్గరికి వెళ్తుంది. పండగ పూట మొదటి వంట నువ్వే చేయాలని రోహిణినీ రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial today episode 299 November 22th 2024 here is full story

ఇక శుక్రవారం ఎపిసోడ్ లో ఎలాగైనా రోహిణితో వంట చేయించాలని శిలా డార్లింగ్ అనుకుంటుంది. ఈ క్రమంలో రోహిణినీ తీసుకురమ్మని ప్రభావతికి చెప్తుంది. దీంతో ప్రభావతి వెళ్లి.. మా అత్తయ్య పండగపూట మొదటి వంట ఇంటికి పెద్ద కోడలు చేయాలని పట్టుబడుతుందని చెబుతుంది. దీంతో 'నాకు చేయడం రాదు కదా..' అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రోహిణీ. ఒకటంటే ఒకే వాయి అని.. ఇలా వేసి అలా వచ్చేయి అని రోహిణిని రిక్వెస్ట్ చేస్తుంది.

వంటింట్లోకి వెళ్లగానే సుశీలమ్మ.. రోహిణిని ఓ రేంజ్ లో క్లాస్ పీకుతుంది. పనులు చేస్తేనే వస్తానే.. మహారాణిలా కూర్చొంటే రావని అంటుంది. పిండి తీసుకొని గారెలు వెయ్యమని ఆర్డర్ వేస్తోంది. తనకు చేయడం రాదంటూ.. తప్పించుకుని ప్రయత్నం చేస్తుంది. కానీ.. నిన్ను నేర్పిస్తాలే అంటూ దగ్గర ఉంది మరి వేపిస్తుంది. ఇలా చేస్తే.. తనతో మొత్తం పని చేపిస్తారనీ భావించిన రోహిణి తనకు తలనొస్తుందంటూ డ్రామా ఆడుతుంది. దీంతో ప్రభావతి వెళ్లి రెస్ట్ తీసుకోమని హాల్లో కూర్చుండ పెట్టి.. తలపై చల్లని గుడ్డ వేస్తుంది. దీంతో రోహిణి హాల్ లో పడుకుంటుంది.

ఇంతలో రోహిణి అమ్మ సుగుణమ్మ ఇంటికి వస్తుంది. తన కూతురు హాల్లో పడుకోవడం చూసి..'ఏమైందమ్మ.. ఏమైంది.. అంటూ అరుస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ సరిగా వచ్చేస్తారు. రోహిణికి తన నిజం ఎక్కడ బయటపడుతుందని టెన్షన్ పడుతుంది. ప్రభావతి వచ్చి ఎందుకలా అరుస్తున్నావు. 'అయినా రోహిణికి నీకు సంబంధం ఏంటి?' అని నిలదీస్తుంది ప్రభావతి. లేదు.. రోహిణి తలపై బట్టలు చూసి ఏదైనా గాయం అయ్యిందా అని కంగారు పడ్డానని కవర్ చేస్తుంది సుశీలమ్మ. ఇంతలోనే బాలు కూడా ఇంటికి చేరుకుంటాడు. ఏమైంది అందరూ కంగారుగా ఉన్నారు. ఏం జరిగింది? అంటూ ఆరా తీస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 299 November 22th 2024 here is full story

దీంతో సుగుణమ్మ.. రోహిణి తలపై గుడ్డను చూసి ఏమైనా గాయం అయ్యుండొచ్చు అని బాధపడ్డానని చెప్పుకొస్తుంది. తాము ఇక్కడే ఉంటే.. ఎక్కడ నిజం బయటపడుతుందోననీ, మేం వెళ్తున్నామంటూ చెబుతోంది సుగుణమ్మ. దీంతో బాలు.. పండగ పూట ఇంటికి వచ్చిన వారు భోజనం చేయకుండా వెళ్తారా? తినేసి వెళ్లండి? అని చెబుతాడు. సత్యం కూడా.. పండగపూట ఇంటికి వచ్చే వారిని ఖాళీ కడుపుతో పంపడం సరికాదని, తిన్నాక వెళ్లండని చెబుతాడు. దీంతో రోహిణికి మరింత టెన్షన్ పెరుగుతుంది.

మరోవైపు రవి ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలోనే బాలు ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఇలా ఒకరికొకరు ఎదురుపడతారు. వెంటనే బాలు.. రవి కాలర్ పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు. పండగపూట ఇంటికి ఎందుకు వచ్చావు? అని నిలదీస్తాడు. తనకు బామ్మ ఫోన్ ఇంటికి రమ్మని పిలిచిందనీ, అందుకే ఇంటికి వచ్చానని చెబుతాడు రవి. 'నువ్వు చేసిన ఘనకార్యం తెలిస్తే బామ్మనే చీ కోట్టి బయటకు పంపిస్తుందని, అనవసరంగా పండగ పూట .. ఇంటికి వచ్చి గొడవ చేయకుండా వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 299 November 22th 2024 here is full story

మరోవైపు... సుగుణమ్మను తన రూమ్ లోకి తీసుకువెళ్తుంది మీనా. కానీ.. తాము వెళ్తామని సుగుణమ్మ అనగానే.. పండగపూట ఎటు వెళ్తారు? అంటుంది మీనా. చిన్నోడికి తినడానికి ఏమైనా తీసుకువస్తా అంటూ వంటింట్లోకి వెళ్తోంది. ఇంతలోనే ఆ రూమ్ కి రోహిణి వెళ్లి.. ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ తన తల్లిని అడుగుతుంది. తనకు ఎవరో ఫోన్ చేసి.. నీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పారని, ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్ చూసి.. అది
దినేష్ నెంబర్ అని తెలుసుకుంటుంది. ఇంకోసారి ఇలాంటి ఫోన్లు వచ్చినా.. మరోసారి ఇంటికి మాత్రం రావద్దని వార్నింగ్ ఇస్తుంది. మీనా రూమ్ కి రావడాన్ని గమనించిన రోహిణి.. సరే.. భయపడకు నాకేం కాలేదు కదా .మీరేం ఫీల్ అవ్వకండి నేను అర్థం చేసుకోగలను అంటూ కవరింగ్ చేస్తుంది. రోహిణి బయటికి వెళ్లగానే.. మీకు రోహిణి ముందే తెలుసు కదా అంటూ సుగుణమ్మను ప్రశ్నిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X