Gunde Ninda Gudi Gantalu November 25th: బయటపడ్డ రోహిణీ తల్లి ప్రేమ.. పూలగంపకు ముళ్లగంప సపోర్టు..
Gunde Ninda Gudi Gantalu November 25th Episode: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో పండుగ పూట ఇలాగైనా రోహిణి చేత వంట చేయించాలని ఫిక్స్ అవుతుంది సుశీలమ్మ. తనకు వంట చేయడం రాదని రోహిణీ చెప్పినా.. తాను నేర్పిస్తానంటూ వంట చేయిస్తుంది సుశీల. దీంతో తనకు తల తిరుగుతుంది అంటూ యాక్టింగ్ చేస్తుంది రోహిణి. దీంతో ప్రభావతి తీసుకువెళ్లి హాల్లో పడుకోబెట్టి తలపై చల్లని గుడ్డ వేస్తుంది. ఇంతలోనే రోహిణి తల్లి సుగుణ ఇంటికి వస్తుంది. రోహిణీని చూసి గట్టిగా అరవడంతో ఇంట్లో వారు అందరూ వచ్చి ఏమైందని ప్రశ్నిస్తారు.
'అయినా రోహిణి చూసి ఎందుకలా అరిచారు?' అని సుగుణపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ప్రభావతి. మరోవైపు.. రవి ఇంటికి చేరుకుంటాడు. ఇంతలోనే బాలు ఎదురుపడి.. రవి కాలర్ పట్టుకుని ఎందుకొచ్చావు? అని నిలదీస్తాడు. తనకు నానమ్మ ఫోన్ చేసిందని చెప్తాడు. మరోవైపు రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్లి.. ఎందుకొచ్చావని ప్రశ్నిస్తుంది. తనకు ఎవరో ఫోన్ చేసి నీకు ప్రమాదం జరిగిందనీ, చెప్పడంతో తాను ఇలా వచ్చానని చెబుతుంది. ఇంకోసారి ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తోంది. మీనా రావడంతో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది.

ఇక సోమవారం ఎపిసోడ్ లో రోహిణి ప్రవర్తనలో ఏదో తేడా గమనిస్తుంది మీనా. మీకు అంత ముందుకే రోహిణి తెలుసా అంటూ సుగుణమ్మను నిలదీస్తుంది మీనా. 'అదేంటమ్మా.. అలా అడుగుతున్నావ్.. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే కదా పరిచయం చేశారు అంటూ కవరింగ్ చేస్తుంది సుగుణమ్మ. 'ఇంతకుముందు కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో క్లోస్ గా ఉన్నట్టు అనిపించింది. అందుకే ' అంటూ మరోసారి ప్రశ్నిస్తుంది మీనా. ' లేదమ్మా.. నా కూతురులా అనిపించిన వాళ్లతో నాకు తెలియకుండానే క్లోజ్ గా మాట్లాడతాను' అని సుగుణమ్మ అంటుంది.
ఆ తరువాత అందరూ టపాసులు కాల్చుతూ.. బయట ఎంజాయ్ చేస్తుంటారు. బాలు టపాసులు కాల్చకుండా సైలెంట్గా ఉండిపోతాడు. దీంతో మీనా..' పిల్లాడితో మాత్రమే కాల్పిస్తున్నారు. మీరు కాల్చరా? భయపడుతున్నారా? అంటూ బాలుకి పంచ్ వేస్తుంది మీనా. దీంతో బాలు టపాసుల కాలుస్తూ.. గాలిలోకి విరుసుతాడు. దీంతో మీనా భయపడి బాలును గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇప్పుడూ అర్థమైందా? భయం ఎవరికో అంటూ మీనాను ప్రశ్నిస్తాడు బాలు.
ఇలా అందరూ టపాసులు కాల్చుస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. రోహిణీ మాత్రం టెన్షన్ పడుతుంది. తన పరిస్థితి తెలిస్తే.. నా జీవితంలో ఇదే చివరి దీపావళి అవుతుందని తన మనసులో అనుకుంటంది. ఇంతలోనే.. చిన్నోడు పై టపాసులు మెరుగులు పడడంతో వాడు అమ్మ అని అరుస్తాడు. దీంతో రోహిణి వెంటనే రియాక్ట్ అయి.. 'చింటూ చింటూ.. 'అంటూ తన కొడుకును హత్తుకుంటుంది. ఈ ఘటనతో అందరూ షాక్ అవుతారు. ప్రభావతి మనోజ్ లకు అనుమానం వస్తుంది.
బాలు అయితే.. 'ఏమైంది పార్లరమ్మ అంతగా కంగారు పడ్డారేంటి?'అని ప్రశ్నిస్తాడు.'పిల్లాడికి ఏం కాకుండా రోహిణి వదిన కాపాడింది. ఆ దైర్యం అందరికి ఉండది' అంటూ మౌనిక అంటుంది. దీంతో రోహిణి తనను తాను కవర్ చేసుకుంటూ.. 'పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదామ్మ ' అంటూ తన తల్లికి చెబుతోంది.
మరోవైపు రవి ఇంటికి వచ్చి బాధపడతాడు. దీంతో ఏమైందని, అక్కడ ఏమైనా అన్నారా? అంటూ ప్రశ్నిస్తుంది శ్రుతి. 'మా నానమ్మ ఫోన్ చేసి రమ్మంటే.. వాళ్లంతా రమ్మన్నారేమో అని నేనే తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళను. మా నాన్నమ్మ నాకు ఫోన్ చేసిన విషయం వాళ్లకి ఎవరికి తెలియదు. మా నాన్నమ్మకు అబద్ధం చెప్పారట. నిజం తెలియక నానమ్మ నాకు ఫోన్ చేసి రమ్మంది. కానీ మా బాలు అన్నయ్య నన్ను గుమ్మంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఆ కుటుంబానికి ద్రోహం చేశారంటూ నానా మాట అన్నాడు'అంటూ రవి బాధపడతాడు.
'పండుగ పూట కూడా నీ ఏడుపు ఏంటి? అవన్నీ విడిచిపెట్టు సంతోషంగా ఉండు' అంటూ శృతి రవిని ఓదారుస్తుంది. 'పెళ్లయ్యాక వచ్చిన మొదటి పండగది. ఈ రోజు నేను నీతో హ్యాపీగా గడపాలి. మనకి ఇది ఒక మంచి మెమరీ కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ రవి నా బేబీ కాదు స్మైల్.. 'అంటూ రవిని మోటివేట్ చేస్తుంది. ఇలా బయటకు వెళ్లి టపాసులు కాలుస్తుండగా సంజీవ్ అక్కడికి చేరుకుంటాడు. వారు సంతోషంగా ఉండటం చూసిన సంజీవ్.. ఎదైనా చేయాలని, శ్రుతిపైకి కారు ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. కారుపైకి రావడం చూసిన రవి.. శ్రుతిని పక్కకు లాగుతాడు. దీంతో ప్రమాదం తప్పుతుంది.
మరోవైపు.. పండుగ అయిపోవడంతో సుగుణమ్మ, చింటూ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో చింటూ.. బాధగా రోహిణిని చూస్తూ వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి 'ఆ పిల్లవాడు ఏంటి నిన్నే బాధగా చూస్తూ వెళుతున్నాడు' అంటూ ప్రశ్నిస్తుంది. వెంటనే బాలు రియాక్ట్ అయి.. ఎవరికి ఏది ఇస్తే.. అది రిటర్న్ అవుతోంది. వాడిని పార్లరమ్మ కాపాడింది కాదా.. అందుకే బాధగా చూస్తూ వెళ్ళిపోయాడు' అంటూ ప్రభావతికి పంచ్ వేస్తాడు బాలు.
'పసివాడి కూడా భోజనం పెట్టకుండా పంపించాం.. పండగ రోజు అనుకోకుండా ఇంటికి వస్తే..ఆ దేవతలే వచ్చారని భావించే వాళ్లం.. కనీసం మాటవరసకైనా ఉండమన్నావా ప్రభావతి..ఏం మనిషి నువ్వు' అంటూ శీలా డార్లింగ్ గట్టిగా అరుసుకుంది. ' ఆ కాలంలో మీరు అలా చేసే.. అసలే వెనకేయలేదు. కాబట్టే.. ఈ కాలంలో మేము ఇలా కష్టాలు పడుతున్నాం' అంటుంది ప్రభావతి. ఆ మాటలతో మౌనిక రియాక్ట్ అవుతూ..' అమ్మ ఒక్క పూట మన ఇంట్లో తిన్నంత మాత్రాన మన ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ' అంటూ నిలదీస్తూంది.
అయినా ఇంట్లో మీనా పెత్తనమేంటీ? అంటూ ప్రభావతి టాపిక్ డైవర్ చేసే ప్రయత్నం చేస్తూంది. 'సరుకులు తెచ్చేది నేను.. వంట చేసేది మీనా.. అనవసరంగా మీనా పుట్టింటి వాళ్ళ దాకా వెళ్తావు? ఎందుకు తిన్నగా మాట్లాడలేవా? అంటూ మీనాకు సపోర్టుగా మాట్లాడుతాడు బాలు. 'దాని వెనకేసుకొస్తున్నావ్ ? అప్పుడే అన్ని మర్చిపోయావా' అంటూ మళ్ళీ పాత విషయాలను గుర్తుకు చేస్తుంది ప్రభావతి. దీంతో 'ప్రభావతి ఏం మాట్లాడుతున్నావ్.. వాడి భార్యను వాడు వెనక వేసుకొని రావడంలో తప్పేం కనబడుతోంది. నువ్వు ఇంకొక జన్మ ఎత్తిన ఎవర్ని అర్థం చేసుకోలేవు' అంటూ సత్యం కూడా సీరియస్ అవుతాడు. ఆ తరువాత బాలు దగ్గరికి వచ్చి.. పూల గంప థాంక్స్ చెప్తుంది.


Click it and Unblock the Notifications











