Gunde Ninda Gudi Gantalu November 26th: బాలుకు షీలా డార్లింగ్ వార్నింగ్.. మీనా సంచలన నిర్ణయం..
Gunde Ninda Gudi Gantalu November 26th Episode: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ లో రోహిణి ప్రవర్తనలో ఏదో తేడా గమనిస్తుంది మీనా.. మీకు అంత ముందుకే రోహిణి తెలుసా అంటూ సుగుణమ్మను నిలదీస్తుంది. రోహిణీ తన కూతురులా అనిపిస్తుందనీ, అందుకే తనతో తెలియకుండానే క్లోజ్ గా మాట్లాడతానని సుగుణమ్మ అంటుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ టపాసులు కాల్చుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో చిన్నోడు పై టపాసుల మెరుగులు పడడంతో రోహిణి వెంటనే రియాక్ట్ అవుతుంది. తన కొడుకును దగ్గరకు హత్తుకుంటుంది. ఈ ఘటనతో అందరూ షాక్ అవుతారు.
చింటూ ఇంటికి వెళ్లే సమయంలో రోహిణిని అలా చూస్తునే వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి 'ఆ పిల్లవాడు ఏంటి నిన్నే బాధగా చూస్తూ వెళుతున్నాడు' అంటూ ప్రశ్నిస్తుంది. వెంటనే బాలు రియాక్ట్ అయి.. ఎవరికి ఏది ఇస్తే.. అది రిటర్న్ అవుతోంది. వాడిని పార్లరమ్మ కాపాడింది కాదా.. అందుకే బాధగా చూస్తూ వెళ్ళిపోయాడు' అంటూ ప్రభావతికి పంచ్ వేస్తాడు బాలు. మరోవైపు రవి ఇంటికి వచ్చి బాధపడుతాడు. దీంతో శ్రుతి రవిని ఓదారుస్తుంది. శ్రుతికి టపాసులు కాలుస్తుండగా సంజీవ్ కారు ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. రవి శ్రుతిని పక్కకు లాగడంతో పెను ప్రమాదం తప్పుతుంది.

మంగళవారం ఎపిసోడ్ లో తన గురించి సపోర్టుగా మాట్లాడినందుకు బాలుకు థాంక్స్ చెప్తుంది మీనా. కానీ, భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి తిరిగి మళ్లీ పాత విషయాలను తీస్తాడు. తాను ఎన్ని రోజులైనా క్షమించమని, తన తండ్రికి ఇచ్చిన మాట కోసమే తీసుకువచ్చానని మీనాను ఎగతాళి చేస్తాడు. ఈ విషయాన్ని బాలు నానమ్మ సుశీల గమనిస్తుంది. మీనాను ఎందుకు తిడుతున్నాంటూ బాలుని నిలదీస్తుంది. అసలు కారణం ఏంటి? చెప్పాలని బాలుని అడుగుతోంది. ఇంతలోనే సత్యం అక్కడికి చేరుకుంటారు. అసలు ఏం జరిగిందో ? ఇంట్లో విషయాలను పట్టించుకుంటున్నావా? లేదా? అంటూ సత్యం కూడా నిలదీస్తోంది సుశీల.
'నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు.. మీనా సరైన సమయంలో మందులు ఇవ్వలేదు. ఆ కోపంతోనే బాలు మీనాను తిడుతున్నాడు' అంటూ సత్యం కవర్ చేస్తాడు. 'మీనా ఎప్పుడు తప్పు చేయదు. ఒకవేళ తప్పు చేస్తే.. దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది' అని సర్దు చెప్తుంది. మరోసారి ఇలాంటి గొడవలు పడ్డట్టు తెలిస్తే బాగోదని హెచ్చరిస్తుంది సుశీల.
ఇక పండగ పూర్తి కాగానే తాను ఇంటికి బయలుదేరుతున్నంటూ.. ఊరికి వెళ్తుంది సుశీల. కానీ, మరో నాలుగు రోజులు ఉండి వెళ్లవచ్చు కాదా అని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. 'సంక్రాంతికి మీరు ఎలాగు అక్కడికి వస్తారు కదా.. ఇప్పడు వెళ్తా..' అంటూ చెబుతోంది. ఈ సమయంలో మీనా గురించి బాలుకి నచ్చదు. నిన్ను నమ్మి మీ ఇంటికి వచ్చిన మీనాను సరిగ్గా చూసుకోమని, తనకి బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా.. నువ్వే తనకు దిక్కు అని చెబుతుంది. అలాగే మనోజ్ కు ఇంటి ఖర్చులలో భాగం కమ్మని, రోహిణిని పిలిచి ఇంటి పనులలో మీనాకు సహాయం చేయమని చెబుతుంది. ఒక రవి గాడిని చూడలేదని అదొక వెతికి ఉంది అని చెబుతూ వెళ్ళిపోతుందిసుశీల.
శీల డార్లింగ్ వెళ్ళగానే ప్రభావతి తన విశ్వరూపం చూపిస్తుంది. మీనాను కించపరచాలని ఉద్దేశంతో బాలుని పిలిచి.. పండుగకు వెళ్లి తొందరగా ఎందుకు వచ్చావు? అంటూ ఆరా తీస్తుంది. 'మీ అత్తగారు సరిగా చూసుకోలేదా ? నిన్ను ఇంట్లో విడిచిపెట్టి పూల కొట్టు దగ్గరనే ఉండిపోయారా? అంటూ హేళనగా మాట్లాడుతుంది. ఇంతకీ మీ అత్తగారు పండుగకి పిలిచి ఏమైనా పెట్టారా? లేదా? అని బాలుని నిలదీస్తుంది. దీంతో బాలుకి ఎక్కడలేని కోపం వస్తుంది. మనోజ్ చూపిస్తూ.. మలేషియా అత్తగారు ఎంత బంగారం పెట్టారు? షిప్ లో పంపించారా? లేదా ఫ్లైట్స్ ల్లో పంపిస్తున్నారా? అంటూ ప్రభావతిని అడుగుతాడు బాలు. తన అత్తగారు పండుగకు పిలిచి బంగారు ఉంగరం పెట్టారని, ఇంట్లో వారందరికీ చూపిస్తారు. దీంతో ప్రభావతి ముఖం చిన్నబోతోంది.
'అవునమ్మా ఎప్పుడైనా రోహిణి వదిన అడిగావా? పెళ్లైన నుండి ఇప్పటికి వరకూ ఒక్కసారైనా వాళ్లు చీర కూడా పంపించలేదు కాదా? అంటూ మౌనిక కూడా బాలుకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఆ గొడవ మరింత పెద్దగా అవుతుందని, ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని సత్యం అంటాడు.ఆ తర్వాత సత్యం బాలు తో మాట్లాడుతూ.. సొంత కారుని అమ్మేశావు సరే .. మరి రెంటుకు తీసుకున్న కారు ఏమైంది? అని ప్రశ్నిస్తాడు.
'ఓనర్ కూతురు ఢిల్లీ నుండి వస్తుందని, ఆమెకు కారు కావాలని వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు. దీంతో ప్రభావతి వారం రోజులు డబ్బులు ఇవ్వవా? అంటూ నిలదీస్తోంది. వారం రోజులు డబ్బులు ఇవ్వకపోతే .. ఇల్లు ఎలా గడుస్తుందని అడుగుతుంది. మరోవైపు రోహిణి వెళ్లి తన శాలరీని తీసుకువచ్చి ప్రభావతికి ఇస్తుంది. మనోజ్ సంగతి అంటే.. వాడు ఎప్పుడో తీసుకవచ్చి.. ఇచ్చాడంటూ కవరింగ్ చేస్తుంది ప్రభావతి. మొగడు పెళ్లాలు ఇద్దరూ ఇంట్లో ఊరికే కూర్చొని తింటే.. వారం రోజులు ఎలా గడుస్తాయని ప్రభావతి అంటుంది. దీంతో మీనా తాను ఒక పూటనే భోజనం చేస్తానని వెళ్ళిపోతుంది.
ఆ తరువాత బాలు కూడా రూమ్ లోకి వెళ్తాడు. ముందుగా బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, బాలు మొదటి వస్తాడు.. నీ వల్లనే ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాననీ, తన కారు పోయిందని, తన నాన్న హాస్పిటల్లో పడ్డాడని, డబ్బులు ఇవ్వకపోతే ఫైనాన్సర్ ను కొట్టాననీ, ముందే డాక్యుమెంట్స్ ఇచ్చిన విషయం తనకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదని మరోసారి మీనాపై బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.


Click it and Unblock the Notifications











