Gunde Ninda Gudi Gantalu November 27th: రివెంజ్.. బాలుకు జాబ్ దొరికేనా? మీనా షాకింగ్ డెసిషన్..
Gunde Ninda Gudi Gantalu November 27th Episode: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ లో మీనాతో బాలు గొడవ పడడాన్ని శీల డార్లింగ్ చూస్తోంది. అసలు ఏం జరుగుతుందంటూ బాలుని నిలదీస్తోంది. మరోసారి తన ముందు మీనాతో కూడా పడితే.. బాగుండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. మీనాకు మంచి అయినా చెడైనా నువ్వేనని, తనకు అండగా ఉండాలని బాలుకి చెబుతుంది. సుశీలమ్మ వెళ్లిపోవడంతో ప్రభావతి తన విశ్వరూపం చూపిస్తుంది. మీనా ను కించపరిచేలా మాట్లాడుతుంది. అసలు పండుగ కు పిలిచిన మీ అత్తగారు ఏమైనా పెట్టారా? లేదా? అంటూ బాలుని ప్రశ్నిస్తుంది ప్రభావతి. దీంతో తనకి బంగారు ఉంగరం పెట్టారని, మరి మనోజ్ గాడికి వాళ్ళ అత్తగారు ఏం పెట్టారంటూ నిలాదీస్తాడు.
ఆ గొడవ మరింత పెద్దగా అవుతుందని, ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని సత్యం అంటాడు.ఆ తర్వాత సత్యం బాలు తో మాట్లాడుతూ.. సొంత కారుని అమ్మేశావు సరే .. మరి రెంటుకు తీసుకున్న కారు ఏమైంది? అని ప్రశ్నిస్తాడు. ఓనర్ కూతురు ఢిల్లీ నుండి వస్తుందని, ఆమెకు కారు కావాలని వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు. వారం రోజులు డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని, దీంతో మీనా తాను ఒక పూటనే భోజనం చేస్తానని వెళ్ళిపోతుంది. ముందుగా బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, డాక్యుమెంట్స్ ఇచ్చిన విషయం తనకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదని మరోసారి మీనాపై బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

బుధవారం ఎపిసోడ్లో..బాలు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. తనకు తెలిసిన కార్ ఏజెన్సీలకు వెళ్లి జాబ్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ తాము ఇవ్వలేమంటూ తేల్చి చెప్తారు. ఎందుకని ప్రశ్నించగా.. గతంలో నువ్వు పని చేసిన వ్యక్తి దగ్గరే చాలామంది ఫైనాన్స్ తీసుకుంటారని, తనపై చేయి చేసుకున్న విషయం అందరికీ తెలుసుననీ, ఒకవేళ నీకు జాబ్ ఇస్తే.. ఇచ్చినవారికి ఎఫెక్ట్ పడుతుందని, అందుకే ఈ కారు ఏజెన్సులలో నీకెవ్వరు జాబ్ ఇవ్వరని చెబుతాడు. కారు ఏజెన్సీలలో జాబ్ లేకపోతే ఏంటీ.. తాను పర్సనల్ డ్రైవర్ గా చేస్తానని చాలెంజ్ చేసి వస్తాడు బాలు.
మరోవైపు.. రోహిణికి తన బాయ్ ప్రెంఢ్ దినేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. నీ విషయం ఇంట్లో వాళ్లకు తెలియలేదా? అని ప్రశ్నించాడు. తెలిస్తే.. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయే దానివిలే అంటూ.. తనకు వారం రోజుల్లోగా 50వేలు ఇవ్వాలని, మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. గతంలో ఇవ్వాల్సిన 25,000 ప్రస్తుతం 50,000.. మొత్తం 75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే.. ఈ సారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనీ, తన రహస్యం మొత్తం ఇంట్లో వారికి చెప్తానని హెచ్చరిస్తాడు దినేష్. తన దగ్గర డబ్బులు లేవని రోహిణి ఎంత చెప్పినా.. పట్టించుకోకుండా కచ్చితంగా మరో వారం రోజుల్లో ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు.
మరోవైపు సరుకులు వచ్చాయి, డబ్బులు కట్టాలని మీనాను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది ప్రభావతి . ఇంతకీ బాలు డబ్బులు ఇచ్చాడా లేదంటూ నిలదీస్తోంది. బాలు ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదనీ చెబుతుంది మీనా. దీంతో ప్రభావతి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డబ్బులు ఇవ్వకపోతే పరువు పోతుందని, డబ్బులు ఇవ్వకుండా మొగడు పెళ్లాలు ఇంట్లో కూర్చోని తింటారా? అని హేళన చేస్తుంది. డబ్బులు ఇస్తేనే మూడు పూటలా భోజనం పెడతానని చెబుతుంది. రోహిణీ ముందు అవమానించడం, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా చాలా బాధపడుతోంది.
దీంతో ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని భావిస్తుంది. అలా తనకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్లి.. డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఆ షాప్ మూసివేసే సరికి ఏం చేయాలో దిక్కు తోచదు. ఈ సమయంలో తన తమ్మునికి ఫోన్ చేస్తుంది మీనా. తాను శివాలయం దగ్గర ఉన్నాననీ, అర్జెంట్ గా రమ్మని చెబుతోంది మీనా. తన తమ్ముడు రాగానే.. తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలని, తన గాజులు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకురమ్మని చెబుతుంది.
తన అక్క పరిస్థితిని గమనించిన శివ.. అవసరం లేదనీ, తాను వేరే దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాననీ, వాళ్లు అడ్వాన్స్ అడిగితే డబ్బులు ఇస్తారనీ, తాను తెచ్చి ఇస్తానంటూ చెప్తాడు శివ. అవసరం లేదు. ఆ జాబులు మానేసి.. చదువుకోమని చెప్పి.. తన గాజులు తమ్ముడికి ఇచ్చి.. పంపిస్తుంది మీనా. మరో వైపు బాలు జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకు తెలిసిన వ్యక్తి కనిపించి ఏం చేస్తున్నావ్ అంటూ ఆరా తీస్తాడు. ఆ వ్యక్తి జాబ్ ఇస్తాడా? లేదా ? వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











