Gunde Ninda Gudi Gantalu November 28th: మీనాపై నిందా.. క్లీనర్ గా మారిన బాలు.. రోహిణి మాస్టర్ ప్లాన్

గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో బాలు ఉద్యోగం కోసం పలు కారు ఏజెన్సీల చూట్టు తిరుగుతాడు. కానీ, తాము ఉద్యోగం ఇవ్వలేమంటూ తేల్చి చెప్తారు. కారు ఏజెన్సీలలో జాబ్ లేకపోతే ఏంటీ.. పర్సనల్ డ్రైవర్ గా చేస్తానని నిర్ణయించుకుంటాడు. రోహిణికి తన బాయ్ ప్రెంఢ్ దినేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. గతంలో ఇవ్వాల్సిన 25,000 ప్రస్తుతం 50,000.. మొత్తం 75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే.. ఈ సారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనీ, తన రహస్యం మొత్తం ఇంట్లో వారికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్.

ఇంటికి సరుకులు వస్తున్నాయనీ, డబ్బులు కట్టాలని మీనాను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది ప్రభావతి. బాలు తనకు డబ్బులు ఇవ్వలేదనీ, ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదనీ చెబుతుంది మీనా. డబ్బులు ఇస్తేనే మూడు పూటలా భోజనం పెడతానని అంటుంది ప్రభావతి. రోహిణీ ముందు అవమానించడం, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా బాధపడుతోంది. దీంతో ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని భావిస్తుంది. తన తమ్ముడికి బంగారు గాజులు తెచ్చి డబ్బులు తీసుకరమ్మని చెబుతోంది మీనా.

Gunde Ninda Gudi Gantalu serial today episode 303 November 28th 2024 here is full story

గురువారం ఎపిసోడ్లో బాలు ఉద్యోగం కోసం తిరుగుతుండగా ఓ వ్యక్తి కనిపించి తమ అపార్ట్మెంట్లో పనిచేయడానికి ఓ వ్యక్తి కావాలని చెబుతాడు. వేరే వ్యక్తి ఎందుకు సార్ తాను ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నానని, తనకు ప్రస్తుతం ఉద్యోగం ఎంతో అవసరమని, ఆ పనిలో తానే చేరుతానని చెబుతాడు బాలు. అయితే.. అది డ్రైవింగ్ పని కాదని, క్లీనర్ పని అని చెబుతాడు. అయినా పర్వలేదనీ, ఏ పని అయినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని అంటాడు బాలు. దీంతో ఆ వ్యక్తి తీసుకువెళ్లి పనిలో చేర్పిస్తాడు.ఇలా మొత్తానికి డ్రైవర్ బాలు.. కాస్త క్లీనర్ గా పనిలో చేరుతాడు.

మరోవైపు మీనా తమ్ముడు శివ తన ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకువచ్చి తన అక్కయ్యకు ఇస్తాడు. మీనా ఆ డబ్బులు తీసుకువచ్చి తన అత్తగారికి ఇస్తోంది. అయితే.. ఈ విషయం బాలుకి తెలియదు. బాలు ఇంట్లోకి రాగానే ఇంటి సరుకులు వస్తాయి. వాటికి డబ్బులు రేపు ఇస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. 'ఆల్రెడీ నీ పెళ్ళాం డబ్బులు ఇచ్చేసింది కదా.. నువ్వు రేపు ఇస్తానని చెబుతున్నావని ప్రశ్నిస్తుంది ప్రభావతి. బాలు డబ్బులు ఇవ్వకుండా.. డబ్బు ఎక్కడి నుండి తీసుకొచ్చావని ప్రశ్నిస్తుంది. 'మీ తమ్ముడు లాగా.. దొంగతనం చేసి తీసుకొచ్చావా?' అంటూ నిందిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 303 November 28th 2024 here is full story

దీంతో మీనా రియాక్ట్ అవుతుంది. తనకు దొంగతనం చేసే అంత కర్మ పట్టలేదని, కావాలనుకుంటే పస్తుల ఉంటానని అంటుంది. కానీ, ఏమైనా లక్షలు దొంగతనం చేశానా? అంటూ ఇన్ డైరెక్ట్ గా మనోజ్ ను తిడుతుంది. దీంతో బాలు రియాక్ట్ అవుతాడు. నేను డబ్బులు ఇవ్వలేదన్న విషయం నిజమే.. కానీ, కారు ఈఎంఐకి ఇచ్చిన డబ్బులు సరుకులకు ఇచ్చినట్లు ఉందని కవరింగ్ చేస్తాడు బాలు. ఆయన దొంగతనం చేసిన వారిని ఇంట్లో పెట్టుకుని తన భార్యను ఎందుకు తిడతారని, తాను మనోజ్ పై కేసు పెడితే.. జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రభావతి మొఖం చిన్నబోతుంది.

ఆ తర్వాత బాలు బెడ్ రూమ్ కి వెళ్ళిపోతాడు. మీనా రాగానే డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చావని అడుగుతాడు. మీరు నెల ఇచ్చిన డబ్బులను కూడాపెడుతున్నానని, అలాగే పూలు అమ్మగా వచ్చిన డబ్బులు దాచిపెట్టానని చెబుతుంది. కానీ ఆ విషయం బాలు నమ్మడు. చేతులకు గాజులు లేకపోవడానికి చూసి.. గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకవచ్చావా? అని మీనాను నిలదీస్తాడు. చివరికి మీనా నిజం ఒప్పుకుంటుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్నీ తిడితే భరించలేకపోయానని అందుకే తన గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాల్సి వచ్చిందని చెబుతోంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 303 November 28th 2024 here is full story

దీంతో బాలు కాస్త రియలైజ్ అవుతాడు. మరోసారి ఇలాంటి పనులు చేయకనీ, తనకు ఒక దగ్గర డ్రైవర్ గా పని దొరికిందని, వచ్చే నెల జీతం రాగానే డబ్బులు ఇస్తానని చెబుతాడు. దీంతో మీనా సంతోషపడుతుంది. కానీ బాలు మాత్రం టెన్షన్ పడతాడు. తాను డ్రైవర్ గా కాకుండా క్లీనర్ గా చేస్తున్నానంటే బాధపడుతుందని చెప్పకుండా ఊరుకుంటాడు. మరోవైపు రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడానికి ప్రయత్నిస్తోంది. కానీ, మనోజ్ ముందుగానే తన బిజినెస్ ఐడియా గురించి రోహిణికీ చెబుతాడు. ఒకసారి తన తండ్రితో మాట్లాడి.. డబ్బులు అడగమని, బిజినెస్ పెట్టుకుంటే.. లైఫ్ సెట్ అయిపోతుందని రిక్వెస్ట్ చేస్తాడు.

ఎలాగైనా ఆ మ్యాటర్ ను డైవర్ట్ చేయాలని రోహిణి.. మీ కోసం ఓ సర్ఫ్రైజ్ గిఫ్టు తీసుకవచ్చాననీ, సెంట్ బాటిల్ ఇచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. దీంతో మనోజ్ ఆ టాపిక్ మరిచిపోతాడు. మరోవైపు బాలు తెల్లారగానే లేచి జాబుకు వెళ్లాలని కంగారు కంగారుగా రెడీ అవుతాడు. మీనా మాత్రం ఏదో ఊహాల్లో విహరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X