Gunde Ninda Gudi Gantalu November 29th: మీనాకు దొరికిపోయిన ముళ్ల కంప.. బాలుపై నిందా.. హానీమూన్ ఫ్లాన్లో రవి
Gunde Ninda Gudi Gantalu November 29th Episode: గుండె నిండా గుడి గంటలు సిరీయల్ గురువారం ఎపిసోడ్ లో బాలు ఉద్యోగం కోసం తిరుగుతుండగా ఓ వ్యక్తి కనిపించి తమ అపార్ట్మెంట్ కార్లు క్లీన్ చేయడానికి ఓ వ్యక్తి కావాలని చెబుతాడు. వేరే వ్యక్తి ఎందుకు సార్ తాను ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నానని, ఆ పనిలో చేర్పిస్తాడు. మరోవైపు మీనా తమ్ముడు శివ డబ్బులు తీసుకువచ్చి తన అక్కయ్యకు ఇస్తాడు. ఆ డబ్బులను తీసుకువచ్చి తన అత్తగారికి ఇస్తోంది. అయితే.. ఈ విషయం బాలుకి తెలియదు. వాటికి డబ్బులు రేపు ఇస్తానని చెబుతాడు. దీంతో ప్రభావతికి అనుమానం వస్తోంది. దొంగతనం చేసి తీసుకొచ్చావా అంటూ మీనా నిందిస్తుంది.
తనకు దొంగతనం చేసే అంత కర్మ పట్టలేదని, పైసలు లేకపోతే.. పస్తుల ఉంటానని, ఏమైనా లక్షలు దొంగతనం చేశానా? అంటూ దిమ్మతిరిగిపోయే రిప్లే ఇస్తుంది. తాను కారు ఈఎంఐకి ఇచ్చిన డబ్బులు సరుకులకు ఇచ్చినట్లు ఉందని కవరింగ్ చేస్తాడు బాలు. ఆ తర్వాత బాలు.. డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చావని మీనాను అడుగుతాడు. అసలు విషయం చెప్పదు. చేతులకు గాజులు లేకపోవడానికి చూసి.. గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకవచ్చావా? అని మీనాను నిలదీస్తాడు. చివరికి మీనా నిజం ఒప్పుకుంటుంది. బాలు తెల్లారగానే లేచి జాబుకు వెళ్లాలని కంగారు కంగారుగా రెడీ అవుతాడు. మీనా మాత్రం ఏదో ఊహాల్లో విహరిస్తోంది.

శుక్రవారం ఎపిసోడ్ లో ప్రభావతికి మీనాక్షి ఫోన్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని కోడు భాషలో అడుగుతుంది. తాను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నానని, కానీ ఆ విషయం ఆలోచిస్తేనే భయమేస్తుందని, అటు బాలు ఇటు సత్యం ఏమంటారో.. వారి రియాక్ట్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయంగా ఉందనీ ఫీల్ అయితుంది ప్రభావతి. నువ్వు అలా ఆలోచిస్తూ లేట్ చేస్తే.. శ్రుతి వాళ్ళ నాన్న వచ్చి రవి గాడికి ఇల్లారికం తీసుకువెళ్తాడని, తర్వాత నువ్వు ఏం చేసినా.. ఫలితం ఉందనీ, ఏ నిర్ణయం త్వరగా తీసుకోమని సలహా ఇస్తోంది. ఏం చేయాలో చెప్పమని మీనాక్షిని అడుగుతుంది ప్రభావతి. ఈ రోజే రవిని వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. దీంతో ప్రభావతి తోడుగా రమ్మని కామాక్షిని రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి ముందుగా రాలేదని చెప్పినా ప్రభావతి రిక్వెస్ట్ చేయడంతో తర్వాత వస్తానని హామీ ఇస్తుంది కామాక్షి.
మరోవైపు బాలు ఓ అపార్ట్మెంట్లో డ్రైవర్ గా కాకుండా క్లీనర్ గా పనిచేస్తున్నాడని మీనా ఫ్రెండ్ చెబుతుంది. దీంతో అసలు బాలు ఏ పనిలో చేరాడో తెలుసుకోవాలని, బాలు పనిచేసే ప్లేస్ కు వెళ్తుంది మీనా. అక్కడికి వెళ్లేసరికి బాలు కార్లను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఓ కారు ఓనర్ వచ్చి తన కారులో ఫోను కనిపించడం లేదని, ఫోన్ తీసావా? అంటూ బాలుని నిలదీస్తాడు. తాను చూడలేదని తనకు తీయాల్సిన అవసరం లేదని, చెప్పి వేరే కారణం చేస్తూ ఉంటాడు. ఇందులోనే మరో వ్యక్తి వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. తనకు ఫోన్ కనిపించడం లేదని, కానీ తన ఫోన్ ను కారులోనే పెట్టానని, కారు కీస్ బాలుకు మాత్రమే ఇచ్చానని చెబుతాడు.

ముక్కుమొఖం తెలియని వారిని పనిలో పెట్టుకోవద్దనీ, ఎవరు ఆ వ్యక్తిని పనిలో పెట్టారంటూ రెచ్చిపోతాడు. బాలుపై దొంగతనం చేశాడంటూ నింద వేస్తాడు. తనకు ఫోన్ దొంగతనం చేయవలసిన పనిలేదని, తాను నిజాయితీగా ఉంటానని చెబుతాడు. కానీ, ఆ కారు ఓనర్ బాలుని చెక్ చేయడానికి ప్రయత్నించాడు. తన ఒంటిపై చేయి వేస్తే బాగోదని చెబుతాడు బాలు. ఇంతలోనే మరో వ్యక్తి వచ్చి ఫోన్ గ్రౌండ్ లోనే మరిచిపోయారని తీసుకవచ్చి ఇస్తాడు. దీంతో అప్పటి వరకూ రెచ్చిపోయిన వ్యక్తి అక్కడి నుంచి సైలెంట్ గా జారుకుంటాడు. తన కూడా కారుందనీ, కానీ అవసరాల దృష్టిగా ఇలా పనిచేయాల్సి వస్తుందని బాలు బాధపడుతాడు. కనీసం తనకు సారీ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఫీలవుతాడు బాలు.
ఈ విషయాన్ని అంతా మీనా గమనిస్తూనే ఉంటుంది. తన భర్త పడుతున్న కష్టాన్ని చూసి మీనా బాధపడుతోంది. బాలుని కలవకుండానే మీనా ఏడ్చుకుంటూ అక్కనుండి వెళ్ళిపోతుంది. మరోవైపు రవి, శృతిలు తమ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే శృతికి ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి.. కొత్త కాపురం ఎలా ఉందని అడుగుతుంది. ఏం కొత్త కాపురం.. అంతా రొటీన్ గా ఉండదంటుంది మీనా. దీంతో హనీమూన్ కి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేం. రోజురోజుకు బరువులు, బాధ్యతలు పెరుగుతాయని సలహాయిస్తుంది. దీంతో హానీమూన్ కి వెళ్లాదనీ రవిని శృతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే మనం హీరో ఫ్యామిలీ లకు దూరంగా ఉన్నామని, ఇప్పుడు తనకు ఆ ఫీలింగ్స్ లేదని తర్వాత చూద్దాం అంటూ సర్ది చెప్తాడు.


Click it and Unblock the Notifications











