Gunde Ninda Gudi Gantalu December 2nd: మనోజ్ పై అనుమానం.. ప్రభావతి తప్పుకు మీనా బలి..
గుండె నిండా గుడి గంటలు సిరీయల్ శుక్రవారం నవంబర్ 29 న ఎపిసోడ్ లో మీనాక్షి ప్రభావతి కి ఫోన్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని ప్రశ్నిస్తుంది. త్వరగా రవిని ఇంటికి తీసుకురాకపోతే శృతి వాళ్ళ నాన్న రవిని ఇల్లారికం తీసుకెళ్లే ప్రమాదముందనీ, ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసిన వర్కౌట్ కాదని చెబుతోంది మీనాక్షి. మరోవైపు బాలు డ్రైవర్ గా కాకుండా అపార్ట్మెంట్లో కార్లు క్లీన్ చేసే వ్యక్తిగా చేరిన విషయం మీనాకు తెలుస్తుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి బాలు పనిచేసే ప్లేస్ కు వెళ్తుంది. మీనా అక్కడికి వెళ్లే ఈ సమయంలో బాలు పై దొంగతనం నింద వేసి అక్కడి వారు అవమానిస్తారు. ఆ అవమానాన్ని భరించలేక మీనా అక్కడ నుండి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. మరోవైపు రవి, శృతి తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. హనీమూన్ కు వెళ్దామని శృతి అడగటంతో వద్దంటూ రవి సర్ది చెప్తాడు.
సోమవారం ఎపిసోడ్ లో శృతి హనీమూన్ గురించి రవితో మరోసారి డిస్కస్ చేస్తుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే ఇరు ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్నామని, ఇప్పుడు అవసరం లేదని చెప్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పటికే తప్పు చేసామని, అనవసరంగా మరో తప్పు చేయలేదని, కనీసం ఇరు ఫ్యామిలీలో ఒప్పుకున్న తర్వాతే శోభనం చేసుకుందామని చెబుతాడు. దీంతో శృతి డిసప్పాయింట్ అవుతుంది. తన ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడవద్దని, తాను కూడా ఫ్యామిలీని విడిచి వచ్చానని, స్వార్థంగా ఆలోచిస్తున్నారని అనుకున్న పర్వాలేదని అంటుంది.

మరోవైపు రోహిణి.. మనోజ్ మధ్య జాబ్ డిస్కషన్ జరుగుతుంది. లేని జాబ్ గురించి మనోజ్ గొప్పలు చెప్పుకుంటాడు. తాను ఈ నెల 15 కార్లు అమ్మాననీ, తనకు ఏసీ క్యాబిన్ ,పడకడానికి బ్రెడ్ ఇచ్చారని, ఆఫీసులో తనకు తానే బాస్ అంటూ గొప్పలు చెప్పుకుంటాడు.అయితే.. జీతం పెంచమని అడగడని చెబుతోంది రోహిణీ. దీంతో ఇరకాటంలో పడుతాడు మనోజ్. ఇక కిందికి రాగానే సత్యం జాబ్ ఎలా ఉందంటూ అడుగుతాడు. ఆఫీస్ కు వెళ్లడానికి ఇబ్బంది పడకుండా.. ఆఫీసులో లోన్ తీసుకొని కారు కొనుక్కోమని సలహా ఇస్తాడు. ప్రభావతి కూడా సపోర్టుగా మాట్లాడుతుంది.
అంతలోనే రోహిణి కూడా కిందికి వస్తుంది. ఆ విషయం తెలుసుకుని రోహిణి సంతోషపడుతుంది. ఈరోజే ఆ లోన్ గురించి మాట్లాడమని మనోజ్ కు చెబుతుంది. ప్రభావతి .. మనోజ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. మనోజ్ ఆఫీస్ లో లోన్ అడగడానికి మొహమాటపడుతున్నాడని, నువ్వే వెళ్లి వాళ్ళ ఆఫీస్ లో లోన్ గురించి అడగమని చెబుతుంది.దీంతో అవసరం లేదు..తానే లోన్ గురించి అడుగుతానని మనోజ్ చెప్తాడు. అంతలోనే ఆటో రావడంతో తనకు టైం అవుతుందని రోహిణి షాప్ కు వెళ్తుంది. ప్రభావతి తాను కూడా పార్లర్ కు వస్తానని, షాప్ చూడక చాలా రోజులవుతుందని చెబుతుంది. కానీ తాను షాప్ కు వెళ్లడం లేదని, వేరే క్లైంట్ దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది.
మరోవైపు మనోజ్ జాబ్ కోసం వెళ్తున్నానని బయటకు వస్తాడు. ఏదైనా ఒక జాబ్ చూసుకోమని, బాజ్ లేదనే విషయం బాలుకు తెలిస్తే.. ఇల్లు పైకి పందిరి వేస్తాడని, ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్లగొడుతాడని వార్నింగ్ ఇస్తుంది. ఆ విషయాన్ని సత్యం వింటాడు. వాడిని ఏదో పని చూసుకోమని అంటున్నావు ? వాడు జాబ్ చేయడం లేదని ప్రభావతిని అడుగుతాడు. అదేం లేదు ఈరోజు సెలవు అంటున్నాడు వేరే పని చేసేకుని రమ్మని చెబుతున్నానని అంటుంది. మరోవైపు మీనా వంటచేసి తాను బయటకు వెళ్తున్నానని తన మామయ్యకు చెప్పి వెళ్తుంది.
ఇంతలోనే మీనాక్షి ఇంటికి వస్తోంది. వచ్చి రాగానే రవి గురించి మాట్లాడి సత్యంను బాధపెడుతుంది. తాను ఇంటి దగ్గర తినకుండా వచ్చానని, బాగా ఆకలి అవుతుందని అంటుంది. దీంతో ప్రభావతి తిందాం అని పిలుస్తోంది. కానీ తిన్న తర్వాత సాంబార్ పై ప్లేటు పెట్టడంతో అందులో బల్లి పడుతుంది. మరోవైపు.. బాలుకి తెలియకుండా మీనా ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తుంది. కానీ, మీనాను కలవాలని వెళ్ళిన ఫైనాన్షియర్ ఇష్టపడడు. తనని బయటికి పంపించడని తన బాడీగార్డ్స్ కు చెబుతాడు. తాను మాత్రం షేట్ ను కలిసేంతవరకు వెళ్లనని మీనా భీష్మించి కూర్చుంటుంది.


Click it and Unblock the Notifications










