Gunde Ninda Gudi Gantalu December 3rd: కాళ్ల బేరానికి వెళ్లిన మీనా.. బాలుకి ఘోర అవమానం..

Gunde Ninda Gudi Gantalu December 3rd: గుండె నిండా గుడి గంటలు సిరీయల్ సోమవారం ఎపిసోడ్ లో శృతి హనీమూన్ కి వెళ్దామని అనగా.. ఇప్పటికే ఇరు ఫ్యామిలీ లకు దూరంగా ఉన్నామని, ఇప్పుడు హనీమూన్ అవసరం లేదని తేల్చి చెప్తాడు రవి. మరోవైపు శోభనం కూడా ఇరు ఫ్యామిలీలు ఒప్పుకున్న తర్వాతనే పెట్టుకుందామని చెబుతాడు. దీంతో శృతి డిసప్పాయింట్ అవుతుంది. మరోవైపు లేని జాబు గురించి మనోజ్ గొప్పలు చెప్తాడు. తాను ఈనెల 15 కార్లు అమ్మాననీ, తనకు ఏసీ కేబిన్ ఇచ్చారంటూ తన పెళ్ళాం దగ్గర గొప్పలు చెప్పుకుంటాడు. దీంతో వచ్చే నెల జీతం పెంచమని అడుగని సలహాస్తోంది. మరోవైపు ఆఫీసు వెళ్లడానికి కారు తీసుకోమని సత్యం సలహా ఇస్తాడు. దీనికి ప్రభావతి కూడా సపోర్టు ఇస్తుంది.

ఇంతలోనే ఆటో రావడంతో రోహిణి పార్లర్ వెళ్తున్ననని బయటికి వస్తుంది. తాను కూడా వస్తానని ప్రభావతి అనడంతో తాను పార్లర్ కు వెళ్లడం లేదని వేరే క్లైంట్ ను కలవడానికి వెళుతున్నానని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత మీనా వంటచేసి తాను బయటికి వెళ్తున్నారంటూ మామయ్యకి చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ప్రభావతిని కలవడానికి మీనాక్షి వస్తుంది. వచ్చి రాగానే రవి గురించి అడిగి సత్యం ను బాధపెడుతుంది. తాను ఇంటిదగ్గర తిని రాలేదని ఆకలి అవుతుందని అనడంతో ప్రభావతి మీనాక్షిలు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కానీ సాంబార్ పై మూత పెట్టక పోవడంతో బల్లి పడుతుంది. మరోవైపు మీనా ఫైనాన్సర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, ఆ ఫైనాన్స్ మీ నాతో మాట్లాడడానికి ఇష్టపడడు. దీంతో మీనా కలిసేదాకా వెళ్ళనంటూ అక్కడ్ని కూర్చుని ఉండిపోతుంది మీనా.

Gunde Ninda Gudi Gantalu serial today episode 306 December 3rd 2024 here is full story

ఇక మంగళవారం ఎపిసోడ్ లో ప్రభావతి మీనాక్షిలు కలిసి వెళ్లి రవిని కలుస్తారు. ఈ సమయంలో ప్రభావతి ఎక్కడలేని ప్రేమను రవిపై ఓలకపోస్తోంది. శృతి, నువ్వు ఇద్దరి కలిసి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. తాను ఇంట్లో వారితో మాట్లాడుతానని హామీ ఇస్తుంది ప్రభావతి. దీంతో రవి సంతోషపడుతాడు. కానీ, బాలు ఇంట్లోకి రానివ్వడని, గతంలో తనపై రెండుసార్లు దాడి చేశాడని చెప్తాడు రవి. ఇదంతా మీనా చేయడం వల్ల జరిగిందని, మీనా చెప్పిన మాట వినడంతోనే ఈ అనార్థాలు జరిగాయనీ మరోసారి మీనాను నిందిస్తుంది ప్రభావతి.

తన పెళ్లి గురించి మీనా వదినకు ఏం తెలవదని, తానే అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్లానని రవి నిజం చెప్పిన ప్రభావతి నమ్మదు. ఆ దేవుడు దిగి వచ్చి మీనా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా.. మీ మమ్మీ నమ్మదంటూ మీనాక్షి అంటుంది. ఎలాగైనా మీరిద్దరూ ఇంటికి రావాలని, ఇంట్లో వారిని తాను ఒప్పిస్తారంటూ చెప్పి వెళ్తుంది ప్రభావతి. మరోవైపు.. మీనా ఫైనాన్సర్ ను కలవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఫైనాన్సర్ బాడీగార్డ్స్ వచ్చి.. వాస్తవానికి అన్నకు నిన్ను కలవడం ఇష్టం లేదని, నువ్వు వెయిట్ చేస్తా అంటే ఉందని అన్నాడు. కానీ, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని వారు చెబుతారు.

అయినా తాను కలిసేంత వరకు అక్కడను వెళ్లనని చెబుతోంది మీనా. ఇంతలోనే ఫైనాన్సియర్ తన ఆఫీసు నుండి బయటకి వస్తాడు. తాను ఒక నిమిషం మాట్లాడాలని, మీ కూతురు లాంటి దాన్ని అని బాలు చేసిన తప్పుకు తాను క్షమాపణ చెప్తున్నానని మీనా అంటుంది. కానీ, ఫైనాన్షియల్ .. మీనా మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అయినా .. మొండిగా.. కారు దగ్గర దాకా వెళ్లి మాట్లాడుతుంది. ఎంత చెప్పినా తాను బాలుని క్షమించమని, వాడు తాగుతే ఎలా మాట్లాడుతాడో.. నీకు తప్ప అందరికీ తెలుసునని, తనని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడంటూ సీరియస్ అవుతాడు ఆ ఫైనాన్షియర్.

అక్కడనుండి చక్కగా వెళ్లిపొమ్మని అవమానిస్తాడు. మీనా బాధను అర్థం చేసుకున్న ఓ అమ్మాయి .. సార్ ఇక్కడ బిజీగా ఉంటాడు. ఇంటికి వెళ్లి కలిస్తే ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు అంటూ ఆ ఫైనాన్స్ విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. మరోవైపు బాలు.. తినడానికి ఇంటికి బయలుదేరుతాడు. కానీ, మొత్తం కార్లు కడిగిన తర్వాతనే ఇంటికి వెళ్లాలని, లేదంటే.. పని మానేయమని అక్కడ ఓనర్ అంటాడు. దీంతో చేసేది ఏం లేక అన్ని కార్లు కడిగిన తర్వాతనే తినడానికి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తన తండ్రి కూడా భోజనం చేయడానికి సిద్ధమవుతాడు.

బాలు, తన తండ్రి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, సిద్దమవుతారు. అంతలోనే సాంబార్లో బల్లి పడ్డ విషయాన్ని బాలు గమనిస్తాడు. వెంటనే దగ్గర నుండి ప్లేటు లాగేసుకుని సాంబార్లో బల్లి పడిందని కోప్పాడుతాడు. ఇంతలోనే తన తల్లి ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది. ఇంట్లో నాన్నను విడిచి ఎక్కడికి వెళ్లావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు. తాను రవి దగ్గరికి వెళ్లిన విషయం ఎక్కడ బయటపడిందోననే విషయం తెలిసిందా? అనుకోని టెన్షన్ పడతాడు ప్రభావతి. కానీ, సాంబార్లో బల్లి పడిందనీ, ఆ విషయాన్ని పట్టించుకోరా అంటూ కోప్పడతాడు. తనకేం తెలియదని, మీనానే పని ఉందంటూ ఎక్కడ పని అక్కడ నే విడిచి వెళ్లిందంటూ మీనా పై మరో నింద వేస్తుంది. అంతలోనే మీనా కూడా ఇంటికి చేరుతుంది. అసలేం జరిగిందని ప్రశ్నిస్తుంది. దీంతో బాలుకి కోపం మరింత ఎక్కువవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X