Gunde Ninda Gudi Gantalu December 4th: శృతిపై సంజూ హత్యాయత్నం? ప్రభావతికి దిమ్మతిరిగేలా చేసిన పూలగంప..
Gunde Ninda Gudi Gantalu December 4th: గుండె నిండా గుడి గంటలు సిరీయల్ మంగళవారం ఎపిసోడ్ లో రవిని కలవడానికి ప్రభావతి వెళ్తుంది. త్వరలోనే అందరితో మాట్లాడి ఇంటికి తీసుకెళ్తానని చెబుతుంది. దీంతో రవి సంతోషపడుతాడు. అయితే..ప్రభావతి తోడుగా వచ్చిన మీనాక్షి ఇన్ డైరెక్ట్ గా పంచులు వేస్తూ అత్తగారింటికి వెళ్లొద్దని చెబుతోంది. ఆ సమయంలో మీనా వదిన ఏం తప్పు చేయలేదని రవి చెప్పిన ప్రభావతి నమ్మదు. ఆ దేవుడే దిగి వచ్చి మీనా మంచిదని చెప్పిన మీ అమ్మ నమ్మదని మీనాక్షి అంటుంది. మరోవైపు ఫైనాన్సర్ ను ఎలాగైనా కలవాలని మీనా వెయిట్ చేస్తూ ఉంటుంది.
కానీ, ఫైనాన్సియర్ మాత్రం మీనాను కలవడానికి ఇష్టపడడు. మీనా పట్టుబడి కూర్చుంటుంది. అతడు బయటికి రాగానే బాలు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ వినకుండా ఫైనాన్సర్ వెళ్ళిపోతాడు. బా మీనా బాధను అర్థం చేసుకున్న ఓ అమ్మాయి సార్ ఇక్కడ బిజీగా ఉంటాడు ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఫైనాన్సర్ విసిటింగ్ కార్డును ఇస్తుంది. బాలు పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. సరిగా అన్నం తినే సమయంలో సాంబార్లో బల్లి పడ్డ విషయాన్ని గమనిస్తాడు. దీంతో తన తండ్రి దగ్గర ఉన్న ప్లేట్లు లాక్కొని అందులో బల్లి పడిందని చెబుతాడు. తన తల్లి రాగానే సాంబార్లో బల్లి పడిందని సీరియస్ అవుతాడు. తనకేం తెలియదని అంతా మీ నాని చేసిందని తప్పును మీ నాపైకి నెట్టేస్తుంది ప్రభావతి. దీంతో మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

బుధవారం ఎపిసోడ్ లో మీనా ఇంటికి రాగానే సాంబార్ లో ఏం వేశావని బాలు నిలదీస్తాడు. తాను సాంబార్లో ఏం వెయ్యలేదని, వంట చేసి అన్ని జాగ్రత్తగా మూతలు పెట్టి, బయటకు వెళ్లాలని చెబుతోంది. కానీ, మీనా చెప్పిన మాటలు బాలు పట్టించుకోకుండా తిడతాడు. ఈ సమయంలో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. ఇంట్లో వారందరినీ చంపాలని ప్రయత్నిస్తున్నావా? అంటూ మీనాను నిందిస్తుంది. అదే సాంబార్ ను మనోజ్ తీసుకువెళ్లాడని, వాడు తిన్నాడా ఏమో అని కంగారు కంగారుగా ప్రభావతి ఫోన్ చేయడానికి రూమ్ లోకి వెళుతుంది.
మీనాక్షి అసలు విషయం గుర్తుకు చేసుకొని ప్రభావతి రూమ్ లోకి తీసుకువెళ్తుంది. సాంబార్లో ఏం పడలేదని, మనం తినేటప్పుడు అంతా బాగానే ఉందని, కానీ తిన్న తర్వాత నువ్వు .. సాంబార్ పై మూత పెట్టలేదని గుర్తు చేస్తుంది. దీంతో ప్రభావతి తన తప్పు తెలుసుకుంటుంది. కానీ, మీనా ఇంట్లో ఉండి ఉంటే.. బల్లి పడి ఉండేది కాదు కదా అంటూ మళ్ళీ మీనాని నిందించడం ప్రారంభిస్తుంది. అసలు విషయం బాలుకి చెప్తానంటూ మీనాక్షి.. ప్రభావతిని భయపెట్టిస్తుంది. వాటికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడంటూ భయపడుతుంది ప్రభావతి.
మరోవైపు సంజు .. శృతిపై ప్రతి కారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. రవి లేని సమయంలో ఇంట్లోకి దూరి శృతి పై హత్య ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తాడు. మత్తుమందును తన కర్చీఫ్ లో చల్లుకొని.. శృతి దగ్గరికి వెళ్తాడు. అంతలోని సడన్ గా కాలింగ్ బెల్ మోగుతుంది. దీంతో ఒక్కసారిగా శృతి లేవడంతో సంజు ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రవికి కనిపించకుండా దాచుకుంటాడు. రవి, శృతిలు లోపలికి వెళ్ళగానే సంజు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. మొత్తానికి ఎలాగోలా బయటపడుతాడు సంజు. మరోసారి శృతికి జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తాడు.
ఇదిలా ఉంటే.. ఓ గుడ్ న్యూస్ అంటూ రవి తన తల్లి వచ్చినా విషయాన్ని చెబుతాడు. తనను కలవడానికి తన తల్లి వచ్చిందని, త్వరలోనే ఇంట్లో మాట్లాడి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిందని రవి సంతోషపడతాడు. దీంతో శృతి కూడా చాలా సంతోషపడుతుంది. కానీ, రవిని ఆటపట్టించడానికి.. మీరు మీరు అంతా ఒకటే అయిపోయారు. నన్ను విడిచి పెడతావా? అంటూ ఫీల్ అవుతుంది. దీంతో రవి అలుగుతాడు. ముందు ఆ సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పడం మానేయ్ లేనిపోని ఆలోచనలు వస్తున్నాయంటూ సీరియస్ అవుతాడు. దీంతో రవికి శృతి సారీ చెప్తుంది తాను ఆట పట్టించానని అంటుంది.
మరుసటి రోజు ఉదయాన్నే మీనా త్వరగా లేచి.. వంటలన్నీ పూర్తి చేస్తుంది. ప్రభావతి వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతుంది. కాఫీ ఎప్పుడో చేసి అక్కడ పెట్టానని అంటుంది మీనా. వంటలను చూసి తొందరగానే ప్రిపేర్ చేశావ్.. ఈరోజు కూరల్లో ఏం వేసావ్ అంటూ మీనాను ప్రభావతి హేళన చేస్తుంది. దీంతో మీనాక్షికి మండుతుంది.. ఇంటిల్లిపాదిని పిలిచి.. తాను చేసిన కూరలను చూపిస్తుంది. అందులో బల్లి గాని, బొద్దింకలు గాని వేయలేదని, అనవసరంగా తనపై నిందలు వేయొద్దని అంటుంది. తాను నిన్న కూడా మూతలు సరిగ్గానే పెట్టి వెళ్ళానని, కానీ మధ్యలో ఎవరో భోజనం చేసి మూతల సరిగ్గా పెట్టలేదని అంటుంది.
దీంతో ప్రభావతి కాలుతుంది. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావ్.. ఏంటి నోరు లేస్తుందేంటీ అంటుంది. ఇంట్లో వాళ్ళు సాక్షాదారాలు లేకపోతే నమ్మడం లేదని, చేయని తప్పుకు తనని నియందిస్తున్నారని తన బాధను ఆవేదనను వ్యక్తం చేస్తుంది మీనా. బాలు కూడా ఏంటి డ్రామాలు అంటూ సీరియస్ అవుతాడు. ఇది డ్రామా కాదని, తన బాధను వ్యక్తం చేస్తున్నారని ఇంట్లో తనని మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదని, ప్రతి విషయానికి తానే తప్పు చేశానని నిందిస్తున్నారని మీనా అంటుంది. ఇంట్లో మామయ్య తప్ప తనని వేరేవాళ్లు అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది.
ఆ తర్వాత తాను గుడికి వెళుతున్నానని, తన మామయ్యకు చెప్పి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది మీనా. ఇంతలోనే ప్రభావతి రోజు గుడికి వెళ్లి ఏం ప్రార్థిస్తున్నావనీ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో సత్యం రియాక్ట్ అవుతూ.. మీరేమైనా మనుషులేనా అంటూ ప్రభావతిని తిడతాడు. బాలుని కూడా మీనాకు తోడుగా గుడికి వెళ్లమని చెబుతాడు. కానీ, తనకు వేరే పని ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. నీకు కారే లేదు కదా అని ప్రశ్నిస్తాడు. ఇక్కడితో నేటి సీరియల్ పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications











