Gunde Ninda Gudi Gantalu December 5th: బెడిసికొట్టిన రోహిణీ ప్లాన్.. గట్టురట్టు చేసిన మీనా.. బాలుకు సర్పైజ్..

Gunde Ninda Gudi Gantalu December 5th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్ లో.. ఫైనాన్సియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి రోహిణి వెళుతుంది. ఇంతలోనే మీనా కూడా ఫైనాన్సియర్ ను కలవడానికి అక్కడికి చేరుకుంటుంది. ఆ విషయాన్ని రోహిణి గమనిస్తుంది. మీనా ఇక్కడికి ఎందుకు వచ్చిందని తెలుసుకుని ప్రయత్నం చేస్తోంది. మీనాను చూడగానే.. మళ్లీ ఎందుకు వచ్చావు? అంటూ ఫైనాన్సర్ నిలదీస్తాడు. తన భర్తకు కారు ఇమ్మని, కారు లేక ఆయన చాలా కష్టపడుతున్నారని, చాలా అనుమానాలు ఎదుర్కొంటున్నాడని మీనా బాధపడుతుంది. నీ మాటాలను ఒప్పుకుంటా.. కానీ, బాలు ప్రవర్తన తనకు నచ్చలేదని అందరి ముందు తనని కొట్టాడని ఫైనాన్సర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

అందరి ముందు తనకు క్షమాపణ చెప్పితే.. కారు ఇస్తానని కండిషన్ పెడతాడు. దీంతో మీనా సందేహపడుతుంది. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా అవసరం లేదు వాడి బతుకు వాడు బతకని అంటూ ఫైనాన్షియర్ వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ఎలాగైనా ఇంట్లో చెప్పి బాలుని అవమానించాలని రోహిణి పంచాయతీ పెడుతుంది. దానికి సపోర్టుగా ప్రభావతి కూడా నిలుస్తుంది. అందరూ హాల్లోకి పిలుస్తోంది. సమయంలో ప్రభావతి మాట్లాడుతూ.. మీ ముద్దుల కొడుకు బాగోతం గురించి రోహిణికి ఏదో తెలిసిందట చెప్తుంది వినండి అంటుంది. దీంతో రోహిణి రెచ్చిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 308 December 5th 2024 here is full story

తాను ఫైనాన్సర్ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో మీనా కూడా అక్కడికి వచ్చిందని, ఆ ఫైనాన్స్ తో కారు ఇవ్వమని బ్రతిమిలాడిందని,
ప్రస్తుతం మీ బాలుకి ఏ ఉద్యోగం లేదని, డ్రైవర్ పని చేస్తున్నానని ప్రతి రోజు అబద్ధం చెప్తున్నాడు.పైగా ఆ ఫైనాన్సర్ ను బాలు కొట్టాడని చెబుతుంది. ఇప్పటి వరకూ బాలు లెక్కలు వేశాడుగా..నేను ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాం కదా.. ఇప్పుడు అన్నం తినేయడం మానేస్తారా అంటూ మనోజ్ నోరు జారతాడు. దీంతో మీనాకు ఇక్కడ లేని కోపం వస్తుంది.

తన భర్త మొగడు.. ఆయనకు ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదని, అవసరమైతే పస్తులు ఉంటామని, కానీ మరొకరి సంపాదనపై తాము ఆధారపడి బతకమని మీనా దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇస్తుంది. ఒక్క నెల ఆయన పని మానేస్తేనే ఇంతగా మాట్లాడుతున్నారు. అయినా పనిచేయకుండా కూడా డబ్బులు ఇచ్చారు కదా అంటుంది. మీరు ఇలాంటి మాటలు అంటారని, ఆయన ఆత్మ అభిమానం చంపుకొని, ఓ అపార్ట్మెంట్ లో కార్లు కడిగే పనికి చేరారని అసలు విషయం బయటపెడుతుంది మీనా. దీంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు.

Gunde Ninda Gudi Gantalu serial today episode 308 December 5th 2024 here is full story

తమకు ఎవరిని మోసం చేసి బతకాలని లేదని, ఆయన ఏమైనా లక్షలు దోచుకున్నారా.. ఇల్లు తాకట్టు పెట్టారా.. అంటూ మీనా నిలదీస్తుంది. దీంతో సత్యం మాట్లాడుతూ ఇక చాలు అందరూ సైలెంట్ గా వెళ్లిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. బాలు రూమ్ లోకి వెళ్లగానే మీనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు ఫైనాన్షియల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? అంటూ నిలదీస్తాడు. అయినా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్లాలని అని అడుగుతాడు.

మీనా మాట్లాడుతూ.. 'మీకు ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేనంత పౌరుషం ఉంది కాదా.. మీరెందుకు అడుగుతారు.అవసరమైతే పల్లెటూర్లలో చెరువులలో బర్లు తోముతారు. ఎవరేమన్నా వారి కార్లను కడుగుతారు. మీ జీవితంలో మీరు ఎన్నడైనా దొంగతనం చేశారా? అలా పరాయి వాళ్ళు మీపై దొంగతనం నింద వేస్తే మీరు సైలెంట్ గా ఉన్నప్పుడైనా నా మనసు చచ్చిపోయింది. పరాయి వాళ్ళ కార్ల కడుగుతుంది ప్పుడే తన మనసు చచ్చిపోయిందంటూ మీనా బాధపడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 308 December 5th 2024 here is full story

అసలు ఏం మాట్లాడుతున్నావ్.. పెళ్ళాంతో రికమండేషన్ చేయించుకుని మళ్ళీ కారు అడుగుతున్నాడని బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 'ఈ పొగరుతోనే ఇన్ని సమస్యలు తెచ్చుకున్నారని మీనా అనడంతో మీనాపై చేయి చేసుకునే ప్రయత్నం చేస్తాడు బాలు. వీరిద్దరి మాటల్ని సత్యం చాటుగా వింటాడు. దీంతో తన కొడుకుకు ఏదైనా ఉపాధి కలిగించాలని భావించి ఊహించని గిఫ్ట్ ఇస్తాడు సత్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X