Gunde Ninda Gudi Gantalu December 6th: సత్యం సంచలన నిర్ణయం.. నోరుజారిన రోహిణి.. మనోజ్ బాగోతం బయటపడిందిగా..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్ లో ఫైనాన్సియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి రోహిణి వెళ్లగా.. కారును ఇవ్వమని అడగటం కోసం మీనా వెళ్తుంది. కానీ, బాలు ప్రవర్తన తనకు నచ్చలేదని అందరి ముందు తనని కొట్టాడని ఫైనాన్సర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అందరి ముందు తనకు క్షమాపణ చెప్పితే.. కారు ఇస్తానని కండిషన్ పెడతాడు. ఈ విషయాన్ని ఎలాగైనా ఇంట్లో చెప్పి బాలుని అవమానించాలని రోహిణి ప్రయత్నిస్తోంది. తాను ఫైనాన్సర్ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో మీనా కూడా అక్కడికి వచ్చిందని, ఆ ఫైనాన్స్ తో కారు ఇవ్వమని బ్రతిమిలాడిందని, ప్రస్తుతం మీ బాలుకి ఏ ఉద్యోగం లేదని, డ్రైవర్ పని చేస్తున్నానని ప్రతి రోజు అబద్ధం చెప్తున్నాడంటూ బాలుని అవమానిస్తోంది రోహిణి.
తన భర్త మొగడు.. ఆయనకు ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదని, అవసరమైతే పస్తులు ఉంటామని, కానీ మరొకరి సంపాదనపై తాము ఆధారపడి బతకమని మీనా దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇస్తుంది. ఆయన చేయకపోయినా.. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చారనీ, ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందనే, ఆత్మ అభిమానం చంపుకొని, ఓ అపార్ట్మెంట్ లో కార్లు కడిగే పనికి చేరారని అసలు విషయం బయటపెడుతుంది మీనా. దీంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు. ఇక రూంలోకి వెళ్లగానే.. అనవసర విషయాల్లో వేలు పట్టవద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.

శుక్రవారం ఎపిసోడ్ లో బాలు.. మీనాని మందలిస్తాడు. అసలు విషయం తెలియకుండా ఫైనాన్షియర్ దగ్గరికి ఎందుకు కోప్పడతాడు. వాడు తన తండ్రిని ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడని, అందుకే వాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని అంటాడు. అసలు వాడు ఏమన్నాడని, మీరు ఎందుకు అంతగా సీరియస్ అయ్యారని మీనా అడుగుతుంది. వాడు నేను డబ్బులు ఇచ్చిన మీ నాన్న చనిపోతే ఏం చేస్తావ్? అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలని, అందుకే వాడిని కొట్టానని అసలు విషయాన్ని బయటపడతాడు బాలు.
ఆ మాటలు విన్న మీనా నేనైతే వాణ్ని చెప్పుతో ఒక్కన్నే కొట్టేవాడ్నీ, మీరు చేసింది కరెక్టే అంటూ బాలుని సమర్థిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు అనవసరంగా నా విషయాలలో జోక్యం చేసుకోకంటూ బాలు సలహా ఇస్తాడు. ఈ మాటలు విన్న సత్యం బాధపడతాడు. ఎలాగైనా తన కొడుకు గౌరవప్రదంగా జీవించాలని, అందుకోసం తాను తండ్రి ఓ మంచి జీవితాన్ని ప్రసాదించాలని భావిస్తాడు. ఈ విషయాన్ని తాను ప్రభావతితో చర్చిస్తాడు. ప్రభావతిని పిలిచి తాను ఇంటి కాగితాలను తాకట్టు పెట్టాలని భావిస్తున్నానని, బాలుకి మంచి జీవితం ఇవ్వాలని, వాడు తనకోసం కారును అమ్మేసుకున్నాడని, ఇప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాడు. ఇల్లు కాగితాలను తాకట్టు పెట్టి.. కారు తీసుకోవాలని భావిస్తున్నానని చెప్తాడు.

దీనికి తాను ఒప్పుకోనని, వాడికి ఎంత చేసిన ప్రయోజనం లేదని వాదిస్తుంది. దీంతో సత్యంకు కోపం వస్తుంది. ఒక్కసారి మనసుపెట్టి ఒక తల్లిగా ఆలోచించని ప్రభావతికి చెప్తాడు. అయితే తాను కూడా ఆపరేషన్ సమయంలో తాను కూడా నగలను ఇచ్చానని, వాటిని కూడా విడిపించమని చెబుతుంది. దానికి సత్యం ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బాలు చాలా పొద్దెక్కిన లేవడు. దీంతో బాలుని మీనా ఆట పట్టిస్తుంది. ఈ క్రమంలో బాలుపై మీనా పడుతుంది అలా తెల్లవారాగానే బాలు మీనా మొఖం చూస్తాడు. దీంతో బాలు .. తెల్లారే గాని నీ మొఖం చూసా .. ఈరోజు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో అంటాడు. తన మొఖం చూస్తే అంత మంచే జరుగుతుంది చెబుతుంది మీనా.
ఆ తర్వాత బాలు టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. మీనా అతనికి టిఫిన్ వడ్డిస్తుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి.. మిగతా వాళ్ళకి ఉందో లేదో.. చూసుకుంటూ వడ్డించు.. మొత్తం వాడికే వడ్డించకంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. అందుకే తాను కార్లకున్న దుమ్ము కడగడానికి వెళ్తున్నానని, ఇలాంటి మాటలు తనకు పడడం ఇష్టం లేదని అంటాడు. ఈ సమయంలో ప్రభావతి.. ఏం చేస్తున్నావ్ అంటూ రోహిణి తో మాట్లాడుతుంది. తాను అకౌంట్స్ చూస్తున్నానని, రేపు మేడం వస్తుందంటూ రోహిణి నోరు జారుతుంది. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు.

నువ్వే కదా పార్లర్ కు మేడం.. మళ్లీ మేడం అంటున్నావు అని అడుగుతుంది ప్రభావతి. మేడం అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని, ఆమె వచ్చి ఆడిటింగ్ చేస్తుందంటూ కవర్ చేస్తుంది. దీంతో ప్రభావతి.. నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారు అంటుంది. దీంతో రోహిణి కూడా షాక్ అవుతుంది. అలా అంటున్నారేంటీ.. మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా అని ప్రశ్నిస్తుంది. అవునవును.. మనోజ్ కూడా కష్టపడి జాబ్ చేస్తున్నాడు అంటూ కవరింగ్ చేస్తుంది ప్రభావతి. దీంతో బాలుకి మనోజ్ పై అనుమానం వస్తుంది.


Click it and Unblock the Notifications











