Gunde Ninda Gudi Gantalu December 9th: బాలు గౌరవాన్ని నిలబెట్టిన సత్యం.. పూలగంపను క్షమించిన మూళ్ల గంప..

Gunde Ninda Gudi Gantalu December 9th: గుండె నిండా గుడి గంటలు సిరీయల్ శుక్రవారం ఎపిసోడ్ లో ఫైనాన్షియర్ దగ్గరికి ఎందుకు వెళ్లాలని మీనాపై బాలు కోప్పడతాడు. డబ్బులు ఇచ్చిన మీ నాన్న చనిపోతే ఏం చేస్తావ్? అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలని, అందుకే వాడిని కొట్టానని అసలు విషయాన్ని బయటపడతాడు. ఆ మాటలు విన్న మీనా తానైతే వాణ్ని చెప్పుతో ఒక్కన్నే కొట్టేవాడ్నీ అంటుంది మీనా. బాలు మాటలు విన్న సత్యం బాధపడతాడు. ఎలాగైనా తన కొడుకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని, ఇంటి కాగితాలను తాకట్టు పెట్టాలని భావిస్తున్నాడు.

కానీ, ఇందుకు ప్రభావతి ఒప్పుకోదు. ఒక్కసారి మనసుపెట్టి ఒక తల్లిగా ఆలోచించమని ప్రభావతికి చెప్తాడు. అయితే తన నగలను కూడా విడిపించమని చెబుతుంది. దానికి సత్యం ఒప్పుకుంటాడు. బాలు టిఫిన్ చేస్తుండగా ప్రభావతి వచ్చి మిగతా వాళ్ళకి ఉందో లేదో చూసి తినమని అంటుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. ఈ సమయంలో నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారని రోహిణితో అంటుంది. మనోజ్ ఉద్యోగం చేయడం లేదనే విషయం ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది. దీంతో బాలుకి అనుమానం వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 310 December 9th 2024 here is full story

సోమవారం ఎపిసోడ్లో బాలు తినేటప్పుడు ప్రభావతి అనుమానించడంతో తాను కార్లు కడిగే పనికి వెళ్తున్నననీ, ఇంట్లో ఖాళీగా ఉంటే.. తినే ప్రతి మెతుకుకు లెక్క వేయాలని బాలు కొప్పాడుతాడు. ఇంతలో సత్యం వచ్చి త్వరగా అందరిని బయటికి రమ్మని పిలుస్తాడు. దీంతో బాలు కంగారు పడతాడు ఏమైంది నాన్న అని ప్రశ్నిస్తాడు. అంతా తర్వాత చెప్తా గాని మొదలు బయటకు రా అని లాక్కొస్తాడు. అంతలోనే బాలు ఫ్రెండ్ రాజేష్ కనిపిస్తాడు. దీంతో బాలు కంగారుపడి.. ఏమైందిరా అని ప్రశ్నిస్తాడు.

'నాన్న నీకోసం కారు తీసుకవచ్చారు. అదే నీ కారు'అని చెబుతాడు. దీంతో బాలుకి పట్టరాని సంతోషం వేస్తుంది. వెంటనే వెళ్లి తన కారును చూసుకొని మురిసిపోతాడు. ఆ తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చి.. ఎందుకు నాన్న ఇలా చేశారని అడుగుతాడు బాలు. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది అంటే నాకు ప్రాణం ఎంతో ప్రేమగా చూసుకునేవాడిని, పంటలు పండగ కాలం కలిసి రాక మా అమ్మ ఆవుని అమ్మేసింది దీంతో నేను చాలా బాధపడ్డాను. నా బాధను చూసిన మా అమ్మ సాయంత్రం కల్లా ఆ ఆవును ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఆ సంతోషమే నీలో చూస్తున్న అంటూ సత్యం సమాధానం ఇస్తారు.

అంత డబ్బులు ఎలా కట్టావ్ నాన్నప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి సమాధానం చెబుతూ.. ఇల్లు కాగితాలను తాకట్టు పెట్టామని చెబుతాడు. దీంతో మనోజ్ కూడా షాక్ అవుతాడు.. 'అమ్మ నువ్వు ఇంటి పత్రాలను తాకట్టు పెట్టమని చెప్పావా ?'అని అడుగుతాడు. మీ అమ్మ నగలు కూడా విడిపిస్తానంటే ఒప్పుకుంది అంటూ అసలు ఈ విషయాన్ని సత్యం బయటపెడతాడు. దీంతో నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు అంటూ నోరు పారేసుకుంటాడు. 'నీకేంట్రా చెప్పేది. మీ అమ్మతో చెప్పే లోన్ తీసుకున్నా.. వాడు నా కోసం కారు అమ్మడు. ఆత్మాభిమానం చంపుకొని కార్లు కడుగే పనిలో చేరాడు. తండ్రిగా వాడికి నేను చెయ్యగలిగే అంత చేస్తున్న అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇస్తాడు.

ఆ తర్వాత మీనాకు కారు తాళాలు ఇచ్చి నీ చేతులతో ఇవ్వమ్మా శుభం జరుగుతుందని చెబుతాడు సత్యం. పక్కనే ఉన్న తన ఫ్రెండు రాజేష్ .. పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూసావో.. అమ్మేసిన కారు తిరిగివచ్చింది అంటాడు. ఆ తర్వాత బాలు తన తండ్రిని, చెల్లిని భార్యను కారులో ఎక్కించుకొని బయటికి తీసుకెళ్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మీ నాకు థాంక్స్ చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ, బాలు వల్ల కాదు ఏదో అహం అడ్డు వస్తుంది.

దీంతో మీనాను కారెక్కించుకొని బయటికి తీసుకెళ్తాడు. దారిలో తన ఫ్రెండ్ రాజేష్ కనిపించగా.. అతనితో మీ నాకు సారీ చెబుతాడు. ఆ తర్వాత ఊహించని విధంగా మీ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. అంత ముందుకు టూర్ కి వెళ్లిన సమయంలో తీసుకున్న గాజులను మీ నాకు దొరుకుతాడు దీంతో మీనా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయాలని భావిస్తారు. మీరు వెళ్లే రెస్టారెంట్ లో అంతకుముందే రవి శృతిలు వచ్చి ఉంటారు. అయితే రవి బాలులు ఎదురుపడతారా వారి మధ్య ఏదైనా గొడవ జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X