Gunde Ninda Gudi Gantalu December 10th: సందిగ్ధంలో పడ్డ సత్యం.. చిక్కుల్లో పడ్డ శృతి..
Gunde Ninda Gudi Gantalu December 10th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం ఎపిసోడ్లో బాలు తినేటప్పుడు ప్రభావతి అనుమానించడంతో తాను కార్లు కడిగే పనికి వెళ్తున్నననీ, ఇంట్లో ఖాళీగా ఉంటే.. తినే ప్రతి మెతుకుకు లెక్క వేయాలని బాలు కొప్పాడుతాడు. ఇంతలో సత్యం వచ్చి ఊహించని విధంగా కారును గిఫ్ట్ గా తీసుకవచ్చి ఇస్తాడు.దీంతో బాలుకి పట్టరాని సంతోషం వేస్తుంది. వెంటనే వెళ్లి తన కారును చూసుకొని మురిసిపోతాడు.
మంగళవారం ఎపిసోడ్ లో బాలు, మీనా తినడానికి రెస్టారెంట్ కి వెళ్తారు. అది రెస్టారెంట్లో శృతి, రవి ఉంటారు. ఆ విషయాన్ని బాలు పట్టించుకోడు. కానీ, రవి గమనించి తన అన్నయ్య దగ్గరికి వస్తాడు. దీంతో బాలుకు ఎక్కలేని కోపం వస్తుంది. అనవసరంగా వరుసలో కలపొద్దు .. ఎవర్రా నీకు అన్నయ్య అంటూ బాలు మండిపడతాడు. అయినా రవి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. దీంతో రవిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అడ్డుపడుతుంది. రవి ఏమైనా చిన్న పిల్లవాడు అనుకుంటున్నారా.. చీటింగ్ మాటికి కొట్టడానికి.. మీ హద్దులలో మీరు ఉండండి.. రవికి సపోర్ట్ గా శృతి మాట్లాడుతుంది.

దీంతో బాలుకి మరింత కాలుతుంది. తనను ఎదిరించి మాట్లాడిన శృతిని ఇష్టం వచ్చినట్లు బాలు తిడతాడు. నువ్వే గొప్ప గొప్ప చదువులు చదివావని, నీకే తెలివితేటలు ఉన్నాయా చూపిస్తున్నావా? కాలేజీలో లేచిపోవడం ఎలా? అని నేర్పించారంటూ శృతిని అందరి ముందు అవమానిస్తాడు. మరోవైపు రవి టార్గెట్ చేస్తూ.. ఇంకోసారి నన్ను కలవాలని, ఇంటికి రావాలని ప్రయత్నించినా అక్కడే నరికేస్తా.. అంటూ వారిని ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు.. శ్రుతికి మరింత కోపం పెరుగుతుంది. ఆ కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తాడు.కానీ, శృతి తన జీవితంలో మీ ఇంట్లో అడుగు పెట్టనని తెగేసి చెబుతుంది.
అప్పటివరకు సంతోషంగా ఉన్న బాలు, మీనాలు తిట్టుకోవడం ప్రారంభిస్తారు. నీ వల్లనే రవిగాడు పెళ్లి చేసుకున్నాడంటూ మీనా ను అవమానిస్తాడు. ఇంకోసారి రవితో మాట్లాడాలని ప్రయత్నిస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు.. మీనాక్షి ప్రభావతి దగ్గరికి వచ్చి.. రవిని ఇంటికి తీసుకువచ్చి ప్లాన్ వేస్తారు. మెయిన్ గా.. సత్యంను ఒప్పిస్తే.. రవి గాడు చెప్పినట్లు వింటాడని ప్రభావతి అంటుంది. ఇంతలోనే సత్యం ఇంటికి చేరుకుంటాడు.రాగానే కామాక్షి .. రవి విషయం చెబుతోంది. ఇలాగేనా రవిని ఇంటికి తీసుకురావాలని లేకపోతే తన మామయ్య వాడిని అమెరికన్ తీసుకెళ్తాడంటూ సత్యం కు నచ్చదెబ్బే ప్రయత్నం చేస్తుంది కామాక్షి.
ఇంతలోనే బాలు, మీనాలు ఇంటికి చేరుకుంటారు. ఈ విషయాన్ని గమనించిన బాలు మండిపడతాడు. ఇంకోసారి రవి విషయాన్ని ప్రస్తావించి, తన తండ్రిని ఒప్పించాలని ప్రయత్నించినా.. తాను ఒప్పుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఈ సమయంలో మీనా తన మామయ్యతో మాట్లాడుతూ.. రవి వాస్తవానికి మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, శృతి తొందర పెట్టేసరికి.. అర్థం కాని పరిస్థితుల్లో కల పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అంటుంది. ఈ విషయంలో ప్రవేశించి ఇంటికి తీసుకురమ్మని సలహా ఇస్తుంది.
మరోవైపు.. బాలు తెగేసి చెప్తాడు. అనవసరంగా వాడి గురించి ఆలోచించి, తన తండ్రి పరువును తీసిన సురేంద్ర కూతురు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడం సరికాదని, ఆ పిల్ల తననే గౌరవించడం లేదనీ, తన తండ్రిని ఎలా గౌరవిస్తుందని అంటాడు. దీంతో సత్యం సందిగ్ధంలో పడుతాడు. ఈ విషయంలో ఎవరు రవిని క్షమించినా.. తాను మాత్రం క్షమించలేనని, ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోమని అందరికీ చెప్పి వెళ్తాడు సత్యం.
దీంతో బాలు తన తండ్రి మాట కాదని, ప్రవర్తిస్తే వారు ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు హోటల్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ రవి బాధపడుతూ ఉంటాడు. అనవసరంగా ఆ విషయాలను గుర్తుచేసుకొని బాధపడవలసిన అవసరం లేదని, మీ అన్నయ్య రౌడీ వెధవల ప్రవర్తిస్తున్నాడని, తనని మరోసారి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేయొద్దు అంటూ తేగేసి చెబుతోంది శృతి. దీంతో రవికి కోపం వస్తుంది.


Click it and Unblock the Notifications











