Gunde Ninda Gudi Gantalu December 11th: బాలుని పండబెట్టి తొక్కిన మీనా.. రవిని రోడ్డుకీడ్చిన శృతి..
Gunde Ninda Gudi Gantalu December 11th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం ఎపిసోడ్లో రవి హోటల్లో జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో శృతి వచ్చి అనవసరంగా ఆలోచించకుండా హ్యాపీగా ఉండు.. ఆ ఇంటికి వెళ్ళనవసరం లేదు. మీ అన్నయ్య రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. మీ మీన వదిన ఎలా భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ రవికి సమాధానం ఇస్తుంది.
'నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది. అన్నదమ్ములు చెల్లెలు అందరూ ఉన్నారు. వారిని విడిచి ఉండడం నావల్ల కావడం లేదు. నువ్వే అర్థం చేసుకో.. ఆ బంధాలు ఆ బంధుత్వాలు వేరు' అని రవి శృతికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతి మాత్రం న్యూక్లియర్ ఫ్యామిలీలో అలాంటి బంధాలకు బంధుత్వాలకు తావు లేదని, నేను నువ్వు నేను మాత్రమే ఫ్యామిలీ అనుకుంటున్నారని, మరోసారి ఇంటికి వెళ్దామని చిన్న పిల్లల మాట్లాడకండి రవికి తేల్చి చెప్తుంది. దీంతో రవి అయోమయంలో పడతాడు.

మరోవైపు బాలు రాత్రి ఇంటికి చేరుకొని ఒళ్ళు నొప్పులు ఉన్నాయంట బాధపడతాడు. దీంతో మీనా.. బామ్ రాస్తానంటూ చెబుతుంది. కానీ అవి సెట్ కావాలి, మసాజ్ చేయమంటాడు. దీంతో మీనా రెచ్చిపోతుంది. బాలును బొక్క బోర్లా పడుకోబెట్టి.. వీపుపై ఎక్కి తొక్కుతుంది. దీంతో బాలుకి చుక్కలు కనిపిస్తాయి. ఒక్కసారిగా అమ్మ అంటూ అరుస్తాడు. ఆ అరుపు విన్న ప్రభావతి కంగారుపడుతుంది. ఎన్నడు లేనిది.. బాలు తనను పిలవడం ఏంటి అని షాక్ అవుతుంది. వెంటనే బాలు రూమ్ కి వెళ్లి చూస్తుంది. బాలుపై మీనా.. ఎక్కి తొక్కుతుండని చూసి.. వాడిని చంపేస్తావ్ అనుకుంటున్నావేంటి. అని మీనాపై కోప్పడుతుంది.
'నువ్వుంటే నీతో తొక్కిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రభావతికి చెప్తాడు. దీంతో ప్రభావతి కోప్పడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలుకి అనుమానం వస్తుంది. 'ఎప్పుడు లేంది తన తల్లి పిలవగానే వచ్చింది. ఏందంటే.. మీనా ను అడుగుతాడు. ఎంతైనా మీ అమ్మ కదా నువ్వు పిలిస్తే.. కచ్చితంగా మాట్లాడుతుంది అని చెబుతోంది మీనా. మరుసటి రోజు ఉదయాన్నే రవి మనోజ్ కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇంటికి రావాలని ఉందని చెబుతాడు. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇంటికి రమ్మనడానికి సిద్ధంగానే ఉన్నారని, కానీ బాలు గాడే అడ్డుపడుతున్నాడంటూ మనోజ్ అంటాడు.
బాలు కోపంలో కూడా అర్థం ఉందని, నా వల్లనే నాన్నకు అవమానం జరిగిందని, నా వల్లనే నాన్న హాస్పిటల్ పాలయ్యాడని బాధపడతాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టి మనోజ్ .. 'నువ్వు లక్కీ రా.. కోటీశ్వరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం' అంటూ రవిని ఎగిస్తాడు.
'నీకేం తక్కువైందన్న మీ మామయ్య కూడా కోటీశ్వరుడు ఆయన మలేషియాలో సెట్ అయ్యాడుగా' అని రవి మనోజ్ కు పంచి వేస్తాడు.
'నాది ఏముంది రా.. బ్లాక్ చెక్.. దానిపై సంతకం లేదు కదా.. అది ఎప్పుడు చెల్లుతుంది. ఎప్పుడు పని చేస్తుందో తెలియడం లేదు' అంటూ మనోజ్ ఫీల్ అవుతాడు.
అంతలోనే శృతి రూమ్ నుండి బయటకు రావడంతో తర్వాత కాల్ చేస్తానంటూ.. ఫోన్ కట్ చేస్తాడు రవి. దీంతో శృతికి కోపం వస్తుంది. తాను రాగానే ఫోన్ ఎందుకు కట్ చేసావ్ అంటూ రవిని నిలదీస్తుంది. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు? మీ అన్న తమ్ముళ్లు అంటూ అడుగుతుంది. ఇంట్లో వాళ్ళు తనని రమ్మంటున్నారని, కానీ, బాలు మాత్రమే అడ్డు చెప్తున్నారంట అని సమాధానం ఇస్తాడు రవి. 'అయితే నువ్వు మాత్రమే వెళ్ళు.. నేను రాను 'అంటూ తెగేసి చెబుతుంది శృతి. బాలు ప్రవర్తన తనకు నచ్చలేదని రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడని ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి మీ అన్నయ్యకు తెలియదంటూ అంటుంది.
దీంతో బాలును తన తమ్ముడు రవి సమర్థిస్తూ ఆయన కోపంలో కూడా అర్థం ఉంది. మన వల్లనే ఇన్ని అనర్ధాలు జరిగాయి అంటూ సమాధానం ఇస్తాడు. అయినా ఉమ్మడి కుటుంబం లో ఉంటే అన్ని విషయాలలో అండగా ఉంటారని, న్యూక్లియర్ ఫ్యామిలీ కంటే ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది అని రవి చెబుతాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అన్నలతో ఎలా మెదిలానో చెబుతాడు. దీంతో శృతికి మరింత కోపం వస్తుంది.
అలాగైతే మీ అన్నలతో ఉండు.. నా దారి నేను చూసుకుంటా అంటుంది శృతి. 'ఇప్పుడు ఇలా ఎందుకు కోప్పడుతున్నావ్? టిఫిన్ చేసి వెళ్ళు అంటూ శృతిని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, తనకు ఆకలి చచ్చిపోయిందని, ఆ టిఫిన్ ఏదో మీ అన్నయ్యలతో కలిసి తిను అంటూ ఎటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది. దీంతో రవి తన వెంబడి వెళ్తాడు. దీంతో కోపం వచ్చిన శృతి రోడ్డుపై పోవాలని పిలిచి రవిని అవమానిస్తుంది. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది .


Click it and Unblock the Notifications











